Friday, April 6, 2007
నువ్వు నేను- ఆ ఫోటో
సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.
Subscribe to:
Post Comments (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
-కొండవీటి సత్యవతి తెలుగు పత్రికలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉంది. మొదటి తెలుగు పత్రిక ఎప్పు...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
2 comments:
అద్భుతమయిన అనుభూతిని పొందడమే కాదు.ఆ ఆనందాన్ని అద్భుతం గా అందమయిన పదాల్లో ఆవిష్కరించగలిగారు.నిజమే నచ్చిన చోట,మెచ్చే నెచ్చెలి సాన్నిధ్యం ...మనసే కాదు తనువూ పులకిస్తుంది.ఆ పులకింత మోములో ప్రతిబింబిస్తుంది.
రాధిక గారూ
ధన్యవాదాలు.మీకూ నాలాగే అద్భుతమైన నేస్తం వున్నారని రాసారు.చాలా సంతోషమైంది చదివి.
నాకూ మీలాంటి అభిరుచులే వున్నందుకుకు ఆశ్చర్యంగా వుంది.
బహుశా అది మన గోదావరి ప్రభావమెమో.ఇంతకు ముందు మీ స్నేహమా బ్లాగ్ చదివి మీకు మైల్ కూడా ఇచ్చాను.మీ పరిచయం ఇలా కలిగినందుకు బోలెడంత ఆనoదంతో
సత్యవతి
Post a Comment