ఓ వొంటరి ఒడ్రంగి పిట్ట

పొద్దున్నే బద్దకాన్ని వదలగొడుతుంది
ఓ వొంటరి ఒడ్రంగి పిట్ట
కొంపలంటుకుపోయినట్టు
ఎవరో కొట్టడానికి వస్తున్నట్టు
పొడవైన తన ముక్కుతో
గుండె మీద పొడుస్తున్నట్టుగా
కుర్ కుర్ మంటూ అరుస్తుంది
ఎటో వెల్లిపోయిన తల్లి పిట్ట కోసం
గొంతు చించుకుంటూ
ఏడుపు స్వరంతో ఒకసారి
తల్లి రెక్కల్లో దూరినప్పటి
గునుస్తున్న స్వరంతో ఒకసారి
గుక్క తిప్పుకోకుండా అరుస్తోంది
కళ్ళు నులుముకుంటూ బయటకెళ్ళి చూద్దును కదా
కళ్ళను కట్టి పడేసే రంగు రంగుల్లో
ఇంధ్రధనుస్సుకు పొడవైన ముక్కు
మొలుచుకొచ్చిందా అన్నట్టు
బుల్లి ఒడ్రంగి పిట్ట
తల్లి కోసం దీనంగా ఏడుస్తోంది.

Comments

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం