మా గోదావరి కధలు


మా వూరు సీతారామపురం అని నా పరిచయంలో చెప్పాను కదా. మా వూరికి గోదావరి నాలుగు కిలోమీటర్ల దూరంలో వుందండి.ఈ విషయం కూడా చెప్పినట్టే వున్నాను. వెన్నోల్లో మా గోదారి అందాలకి పరవసించినదాన్ని.గోదావరి నా జీవితంతో మమేకమైపోయింది.నేను ఏది రాయబోయినా గోదావరి ప్రశక్తి రాకుండా వుండదు.గోదావరితో నా అనుబంధం మా అమ్మతో నాకున్న అనుబంధం లాంటిదే. మా వూరు సీతారమపురంతో నా అనుబంధం కూదా అంతే. అయితే నాకు మా వూరితో మా గోదావరితో ఇప్పటికీ సజీవ సంబంధం వునందని చాలా గర్వంగా చెప్పుకోగలను. మా చిన్ని వూరిలో నేను చెట్టు మీద పిట్టల్లే పెరిగానని గొప్పగా చెప్పుకోగలను.నేను గడిపిన అద్భుతమైన బాల్యం ( సవాలక్ష ఆర్ధిక ఇబ్బందులున్నప్పటీకి)ఇప్పటికీ నా కళ్ళళ్ళో వెలుగుని నింపుతుంది.మా వూరికి ఒక పక్క గోగావరి మరో పక్క సముద్రం వుండడంతో నా బతుకు నీటితో ముడిపడిపోయింది.అందుకే నాకు నీళ్ళు చూస్తే వొళ్ళు తెలియని పరవశం కలుగుతుంది.సముద్రపుటలలు ఎప్పుడూ చేతులు చాచి పిలుస్తున్నట్టే వుంటుంది.నరసాపురం దగ్గర అఖండ వశిష్ట గోదావరి శాంత స్వరూపాన్ని ఒక సారి చూసిన వాళ్ళెవరూ మర్చిపోతారని నేను అనుకోను. అటువైపు విస్తరించిన కోన సీమ కొబ్బరి తోటల సౌందర్యం చూసి తీరవలసిందే. అన్నచెల్లెల గట్టు, లాంచి మీద అంతర్వేది ప్రయాణం, అక్కడ సముద్ర స్నానం,బెస్త వారి జీవన శైలి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.
ఇది మా గోదావరి మొదటి కధ.

Comments

Sriram said…
adbhutamgaa raasaaru gOdaavari andaala gurimci.
ikkaDa nEnu teesina konni gOdaavari phOtOlu pettaanu choodandi:
yuppieyearnings.blogspot.com
radhika said…
మీరు గోదారి గురించి ఎన్ని కధలు చెప్పినా వినడానికి సిద్దంగా వున్నానండి.మీ మాటల్లో నాకు మా ఊరు కనిపిస్తుంది.మా ఊరిలో గోదారి లేకపోయినా నా జీవితం లో గోదారికి చాలా సంబంధం వుందండి.
గోదావరిమీద అభిమానంతో ఓసారి త్య్రంబకేశ్వరం పోయి కొండెక్కి వచ్చా. చిన్నమడుగు చూపించి ఇదే గోదావరంటే నిరుత్సాహం కల్గింది. నాసిక్లో స్నానం చేసినా, కాళేశ్వరంలో మునిగినా ఆపారవశ్యమే వేరు.
Swathi said…
చాలా అందం గా ఉంది. వర్ణన తో ఆపేయకుండా ఇంకా పొడిగించండి.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం