మా గోదావరి కధలు
వరదల్లో కొట్టుకొచ్చిన కొండాలమ్మ విగ్రహం కధ.
నేను తొమ్మిదో క్లాసు చదివే రోజులవి.నేను చదువుకున్నది "హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం"
స్కూల్లో.అంతే కాదు అది ఓరియంటల్ స్కూల్ కూడా.90% సంస్క్రుతం
మేము చదవేవాళ్ళం. సైన్సు,షోషల్, మాథ్స్ లాంటివేవి నేను చదువుకోలేదు.
నరసాపురం లో ని రాయపేటలో మా స్కూల్ ఉండేది.
ఒక రోజు మా సంస్క్రుతం మాష్టారు మాకు "మేఘసందేశం" పాఠం చెబుతున్నారు.మేము చాలా శ్రద్ధగా వింటున్నాము. అపుడు ఏం జరిగిందంటే మా స్కూల్లో అటెండర్ శ్రీరాములు పరుగెట్టుకుంటూ మా క్లాసులో కి వచ్చి 'అయ్యవారూ అయ్యావారూ మన గోదాట్లో కి వరదతో పాటు ఓ కొయ్య విగ్రహం కొట్టుకొచ్చిందంటా' అంటూ అరిచి చెప్పాడు.'ఒరేయ్ పోరా అవతలికీ అంటూ మా మాష్టారు శ్రీరాముల్ని తిట్టి క్లాసులోంచి పంపించేసారు. కాసేపటికి బెల్ కొట్టారు. అంతే. మేము పిల్లలమంతా పొలోమని గోదావరి వేపు పరుగులు తీసాం. వరద గోదారి ఉరవళ్ళు పరవళ్ళుగా ప్రవహిస్తోంది.ఒక చోట జనం గుంపుగా నిలబడడం కనపడింది.మేమంతా అటు వేపు పరుగెత్తాం.పెద్ద కొయ్య విగ్రహం కనబడింది.దాన్ని చూడగానే మాకు చాలా భయం వేసింది.చాలా పెద్దగా ఉంది.ఎవొరో అరిచారు.'ఇది భద్రాచలం నుండి వరదలో కొట్టుకొచ్చింది.మన నరసాపురానికి వచ్చి ఆగింది కాబట్టి మనం ఇక్కడే గుడి కట్టాలి.' అందరూ అవును అవును అని అరిచారు.
ఆ తర్వాత అక్కడే ఓ గుడి కట్టరు. అదే కొండాలమ్మ గుడి.మొన్నటి పుష్కరాలకి కొండాలమ్మ గుడిని బాగా అలంకరించారు. ఈ గుడి చిరంజీవి చదువుకున్న శ్రీ. వై. ఎన్.కాలేజి దగ్గర గోదావరి గట్టు మీద ఉంది.ఆ.......అన్నట్టు చిరంజీవి నేను ఒకే బస్సులో కాలేజికి వెళ్ళేవాళ్ళమండీ. అతను మొగల్తూరు లో ఎక్కి వచ్చేవాడు.నేను,మా చిన్నాన్న గారి అమ్మాయి భారతి మా సీతారామపురంలో అదే బస్సు ఎక్కేవాళ్ళం.దీనికి సంధించిన కధ మరోసారి.
ఇదండీ మా కొండాలమ్మ విగ్రహం కధ.
2 comments:
సత్యవతిగారూ నాతో మాట్లాడాలనుకొంటున్నందుకు చాలా థాంక్స్ అండి.కానీ నాకు అంత సీన్ లేదండి.మీ మైల్ ఐడి చెపితే నేను దానికి నా డిటైల్స్ తో మైల్ పంపుతాను.నేను వుండేది అమెరికాలో కాబట్టి మీ ఆఫీసు టైమింగ్స్ లో కాల్ చెయ్యడం కుదరదేమోనండి.ఒకసారి మీ ఐడి తెలిస్తే అప్పుడు ఎలా మాట్లాడాలన్నది ఆలోచించొచ్చు.
raadhika garu
thanks for your reply.
my email ID is satyavatikondaveeti@gamail.com
satya.
Post a Comment