Wednesday, July 7, 2010

బ్రహ్మకమలాలండీ బ్రహ్మకమలాలు

 (నిన్న పూసిన పువ్వు ఫోటో అప్ లోడ్ అవ్వలేదు.ఇవి పాత ఫోటోలు)
జూన్ నెల వచ్చిందంటే చాలు
మా ఇంట్లో బ్రహ్మ కమలాలు
బ్రహ్మాండంగా విడవడం మొదలౌతుంది.
నిన్న రాత్రి వర్షం పడుతూ ఉంది.
బ్రహ్మకమలం విచ్చుకోవడం,సువాసనలు వెదజల్లడం.
చిరుజల్లుల్లో తడుస్తూ కొంచం సేపు చూస్తూ కూర్చున్నాను.
కాసేపటికి మొత్తం తడిసిపోయాను.
అద్భుతంగా విచ్చుకుంటున్న పువ్వుని అలా వర్షంలో ఒంటరిగా
వదిలేయాలంటే ఎంత దుఖమో.
పోనీ కుండీని తీసుకెళదామా అంటే మొయ్యలేనంత బరువుంది.
ఏం చెయ్యాలి??
పువ్వుని కోసుకుని నీళ్ళల్లో వేసి ఇంట్లోకి పట్టుకెళ్ళిపోయా.
ఇల్లంతా ఘాటైన వాసన కమ్ముకుంది.
బోలెడన్ని ఫోటోలు తీసా. మీ కోసం కొన్ని.

13 comments:

ప్రభ అశోక్ said...

చాలా బాగున్నాయి. నా తోట లో కూడా ఉంది బ్రహ్మకమలం మొక్క. కానీ.. పూలు రాలేదు ఇంకా ..

ఆ.సౌమ్య said...

అబ్బ ఇలాంటి పూవొకటుందా, నాకు తెలీదండీ...భలే ఉన్నాయి. చూస్తూ ఉంటే మన్సుకి హాయిగా ఉంది.

ప్రసూన said...

abba enta bavunnayonandi ee pulu.

శ్రీలలిత said...

ఆ పువ్వుల పేరంత బాగున్నాయి పువ్వులు కూడా.. మంచి పువ్వులు చూపించారు. ఇదివరకు నేను వీటిని ఎప్పుడూ చూడలేదు.

మాలా కుమార్ said...

అంటేఅన్నానంటారు కనీయండి , మీరు చెప్పే పూల కబుర్లు , చూపించే పూల ఫొటోలు ఎంత బాగుంటాయో ! ఇహ నేనుండలేను , మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తాను . ఇక నన్నెవరూ ఆపలేరు . ఎక్కడ కుందన్ బాగ్ అన్నారుకదూ . ఎవరిని అడిగినా చెబుతారు గా కుందన్ బాగ్ ఎక్కడో .

సుజాత వేల్పూరి said...

మా ఇంట్లోనూ పూస్తాయండీ ఇవి! బోలెడు!ఏడెనిమిది కుండీల్లో వేశాను.

కానీ ఈ పుష్పాలు రాత్రి పన్నెండుకల్లా విచ్చుకుని తెల్లవారేసరికి వాడిపోవడం భలే అన్యాయమనిపిస్తుంది నాకు! ఎంత సేపు చూస్తూ కూచున్నా తనివి తీరదు. దేవతా పుష్పాలంటే ఇవేనేమో అనిపిస్తుంది!

రాధిక(నాని ) said...

chaalaa baagunnyandi puvvulu.ninna puusina brahmakamalam photos epuudu chuupistaru?

..nagarjuna.. said...

ఇంజనీరింగ్ చదువుతన్నప్పుడు వటిగురించి విన్నాను. కాని అపుడు ఇవి నెలకోసారో/ఏడాదికోసారో విచ్చుకుంటాయని విన్నాను, మీ బ్లాగు చూసాక తెలిసింది రాత్రి విచ్చుకొని తెల్లారేసరికి వాడిపోతాయని..
Thanks for sharing..

భావన said...

అబ్బ ఎంత బాగున్నాయో.. ఎప్పుడూ పేరు కూడా వినలేదు. ట్రాపికల్ ప్లాంటా? ఇంట్లో పెరుగుతుందా బయటా? విత్తనమా కొమ్మా..? చాలా ప్రశ్నలా.. కాదా.. ఐతే చెప్పండి...

సుజాత వేల్పూరి said...

భావనా, ఇది కొమ్మా కాదు,విత్తనం కాదు. ఆకు నుంచి చిన్న బుడిపెల్లాంటివి వస్తాయి. అంత వరకూ కట్ చేసి పెడితే కొత్త మొక్క పెరుగుతుంది. నేను మా ఇంట్లో ఒక కుండీ నుంచి ఏడెనిమిది కుండీలు చేసింది కాక కాలనీ అంతా పాకించా దాన్ని! ఎంత మందికి ఇచ్చానో లెక్కే లేదు.

కానీ అవి విచ్చుకుంటున్నపుడు వాటి అందం చూసి తీరాలి. అంత సౌందర్యం భరించలేక గుండె ఆగిపోతుందేమో అని భయమేస్తుంది నాకైతే!

................ said...

మీరు మాతో పంచుకున్న బ్రహ్మ కమలాలు బ్రహ్మాండముగా వున్నాయి. ధన్యవాదాలు!

maa godavari said...

చూసారా బ్రహ్మకమలం ఎంత సంతోషాన్ని ఆయాచితంగా పంచుతుందో!
మీ అందరికి తలొక పువ్వూ ఇచ్చేయాలన్నంత ఉద్వేగం కలుగుతోంది.
కానీ ఇంత సౌందర్యం వెదజల్లే పువ్వు ఆయుష్సు కొన్ని గంటలు మాత్రమే.
పన్నెండు ఒంటిగంటమధ్య మొత్తం విచ్చుకుని ఘాటైన వాసనలు విరజిమ్ముతూ ముడుచుకోవడం మొదలౌతుంది.ఉదయం లేచి చూస్తే తోటకూర కాడలా వేలాడిపొతుంది.
ఈ చెట్టుని నేను గౌహతి నుండి తెచ్చాను.
సుజాత గారు చెప్పినట్టు,రణపాల ఆకులా చిన్న ఆకు పాతితే బతికిపోతుంది.
మొన్ననే జ్యోతి గారు మా ఆఫీసుకి వస్తే ఒక మొక్క ఇచ్చాను.
దాదాపు ఓ యాభై మందికి నేను ఈ మొక్క ఇచ్చాను.
ఎవరికైనా కావాలంటే చెప్పండి.
భూమిక అఫీసులో ఉంచుతాను తీసుకోవచ్చు.
మాలా గారు ముందు మీకే.
సౌమ్య,సావిరహే,మధురవాణి,భావన,
ఎప్పుడు వస్తారో చెబితే తెస్తాను.
భూమిక అఫీసు బాగలింగంపల్లి వాటర్ టాంకు దగ్గరుంది.

మాలా కుమార్ said...

సత్యవతి గారు ,
థాంక్స్ అండి . సుజాత గారు ఇచ్చింది పారేసుకున్నాను . ఈ సారి ఆ పొరపాటు చేయను . వచ్చేజూన్ కు నేనూ బ్రహ్మ కమలాలు పూయించి ఫొటో పెట్టేస్తాను .

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...