Thursday, July 29, 2010

మా సీతారాంపురం కధలూ,కబుర్లూ

ముసురుపట్టిన ఈ సాయంకాలం

పదే పదే మా ఊరిని గుర్తుకు తెస్తోంది.ఇలాంటి సాయంకాలాలంటే చిన్నప్పుడు ఎంత ఇష్టంగా ఉండేది.
వర్షం మీద ఇష్టం కాదు.ముసురు పట్టిన సాయంకాలాల్లో మాత్రమే చేసే చింతపండు,ఆవపిండి తో చేసే ఘాటైన పులిహోర మీద ప్రేమ.ఇంకేమీ వండే వాళ్ళు కాదు.కంచం నిండా కావలసినంత పులిహోర,ఆవకాయ ముక్క.అంతే.అబ్బ! ఎంత బావుండేది.ముక్కులు ఎగపీల్చుకుంటూ వేడి వేడిగా తిటుంటే నా సామి రంగా! ఆ ఘాటు, ఆ రుచి తిని చూడాలే కానీ ఎంతని వర్ణించను.
మా ఇంట్లో ఓ యాభై మంది దాకా పిల్లకాయలుండే వాళ్ళం.
అందరం పొలోమని కంచాలేసుకుని పులిహోర కోసం ఎగబడిపోయే వాళ్ళం.వర్షా కాలంలో మాత్రమే వండుతారు అదీ బాగా ముసురు పట్టినప్పుడు.
అందుకే నాకు ముసురు పట్టిన ఈ నాలుగు రోజులుగా మా ఊరు,మా ఆవపిండి పులిహోరా,మా పిల్లమూకా తెగ గుర్తుకొస్తున్నారు.మా ఊరితో నాకెన్ని ఇలాంటి అనుభవాలో.ఎన్ని అద్భుతమైన అనుభూతులో!ఎంత సంతోషమో అవన్ని గుర్తు చేసుకుంటే.

3 comments:

Viswanath said...

ekkada undi seetharamapuram ... chebroolu pakkana seetharampurama ??

maa godavari said...

అయ్యబాబోయ్!మీకు మా సీతారంపురం ఎక్కడుందో తెలవదా?
ఒక పక్క గోదారమ్మా మరోపక్క బంగాళాఖాతం మధ్యనుండేదే మా సీతారంపురమండి.అంటే నర్సాపురం గోదారి గట్టుకి,పేరుపాలెం బీచ్ కి మయానుంటుదన్నమాట.

sunil srinivas said...

namaste andi. mi seetharampuram sangatulu baagunni.palle lante naaku kudaa chala istam andi. maadi kuuda palleture. Ravinuthala (prakasham dist). mi vishayaalu chadivina taruvaatha naaku kuda maa vuru gurutuku vachindi.
thanks andi.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...