Saturday, July 31, 2010

మా సీతారాంపురం కధలూ,కబుర్లు- చిరంజీవి మా బస్ మేట్

మొన్న ఒకాయన మీ సీతారాంపురం ఎక్కడ అని అడిగారు.
మా ఊరికి ఒక పక్క గోదావరి మరో పక్క సముద్రం ఉంది.
నర్సాపురానికికి, మొగల్తూరికి మధ్యలో ఉంది మా ఊరు.
మొగల్తూరు అంటే గుర్తొచ్చింది.సినీ స్టార్,ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి రోజూ మేము వెళ్ళే బస్సులోనే కాలేజికి వెళ్ళేవాడు.చిరంజీవి వాళ్ళు పాతకాలవ అనే ఊళ్ళో ఉండే వాళ్ళు.
అతను శ్రీ వై ఎన్ కాలేజి,నేను బిజిబిఎస్ వుమన్స్ కాలేజి.
అప్పట్లో అతని పేరు శివశంకర ప్రసాద్. కండక్టర్ సీటు పక్కన డోర్లో నిలబడి పోజులు కొడుతూ ఉండేవాడు.
మొన్నీ మధ్య "లాడ్లి మీడియా అవార్డ్స్" ఫంక్షన్ కి అతన్ని పిలవడానికి వెళ్ళినపుడు బస్సు విషయాలు,ఫోజుల సంగతులు చెబితే పడీపడీ నవ్వాడు.ఇంకా మీకు ఆ విషయాలన్ని గుర్తున్నాయే అంటూ ఆశ్చర్యపోయాడు.ఇంకా చాలా గుర్తున్నాయి చెప్పనా అంటే వద్దులెండి హాయిగా ఉన్నాను అన్నాడు.
కొంచం పెద్దవాళ్ళమయ్యాక బుస్సుల్లో ఎక్కేవాళ్ళం కానీ అంతకు ముందు అంతా నడకే.రోజుకి రానూ పోనూ ఎనిమిది కిలోమీటర్లు నడిచేవాళ్ళం.నడవలేనప్పుడు సైకిల్ లిఫ్ట్ అడిగే వాళ్ళం.
ఎంత కష్టపడితే డిగ్రీ చేతికొచ్చిందని.మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం.మా తిండి తిప్పల గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.
మా ఊరు కల్పవృక్షం లాంటిది.రకాల పడ్లతోటలతో పచ్చగా కళకళ్ళాడుతూ ఉంటుంది.మాకు కడుపునిండా తిండి పెట్టేవి మా ఊరి చెట్లు.మామిడి,జీడి మామిడి,సపోటా,సీతాఫలం ముంజెలు,తేగలు అబ్బో ఎన్నో పళ్ళు.మా కడుపులు నింపే అద్భుతమైన ఫలాలు.అందుకే నాకు చెట్లంటే అంత ప్రేమ.



1 comment:

Manjusha kotamraju said...

బాగుంది మీ బస్ mate కబుర్లు

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...