సోంపేట విషాదం-"అభివృద్ధి" పేరు తో విధ్వంశం.

అభివృద్ధి పేరు మీద జరుగుతున్న విధ్వంశంలో మరో నలుగురు అమాయక రైతు,మత్స్యకారుల బలిదానం జరిగింది.టి వి.లో కనబడిన భయానక,బీభత్స దృశ్యాలు మనస్సును కలిచివేసాయి.గుండెల్లో మంట పుట్టించాయి.పచ్చటి పంట పొలాలతో,మత్స్యకారులకు జీవికనిచ్చే జలాశయాలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ధర్మల్ ప్రాజెక్టుకు కట్టబెట్టాలనే దుర్మార్గాన్ని అందరూ వ్యతిరేకించాలి.మా పొలాలను ఇవ్వమనే హక్కు రైతులకుంది.

పది ఉద్యోగాలు ఎర చూపి వందలాది ఎకరాలను గుంజుకునే దుర్మార్గ అభివృద్ధి లోని మోసాన్ని అర్ధం చేసుకోవాలి.
సోంపేట బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది.
సోంపేట ఘటనకు నిరసనగా ఈ రోజు ఉదయం అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో నేనూ పాల్గొన్నాను.నా సామాజిక బాధ్యతను నెరవేర్చుకున్నాను.

Comments

మీ సేవాభావం హర్షణీయం. మీలాగా నేను పాల్గొనలేనందుకు నిజంగా విచారిస్తున్నాను. మనం ఏదో ఒకటి చేయకపోతే సోంపేటలు పునరావృత్తమవుతూనే ఉంటాయి.

"నా సామాజిక బాధ్యతను నెరవేర్చుకున్నాను.....:

కానీ ఇలా వాచ్యంగా చెప్పుకోకూడదు. మీ గుఱించి ఈ ముక్క అనే అవకాశాన్ని ఇతరులకి వదిలిపెట్టాలి.