స్నేహ గీతం

తెల తెల్లటి సంపెగపూలు
ఎర్రెర్రటి అనార్ పూలుపాలనురుగులాంటి నక్షత్రపుష్పాలు
నల నల్లని మబ్బుతునకలు
చల చల్లని చిరుజల్లులు
హాయైన వేళ
మనసు ఊయలలూగే ఈ వేళ
నేస్తం!
నీ చేతిలో చెయ్యేసి
ఆకాశం అంచుల దాకా నడవాలనిపిస్తుంది.
అంతు దరిలేని కబుర్లని కలబోసుకోవాలనిపిస్తుంది.

Comments

భావన said…
చాలా బాగున్నాయి అండి. మీ దొడ్లోని చెట్లేనా?
Satyavati said…
అవును భావనా గారు.నా బ్లాగ్ లో నేను పెట్టేవన్ని మా గార్డెన్ లో చెట్లే.