ఎలా పరిచయమయ్యాడో గుర్తులేదు కానీ బేగంపేట్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డ్యూటీ లో ఉండే ఓ కానిస్టేబుల్ తో స్నేహమయ్యింది.
స్నేహమంటే ఎప్పుడూ మాట్లాడుకున్నది లేదు.
కలిసింది లేదు.ప్రతి రోజు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనబడతాడు.
నేను సిగ్నల్ దగ్గర కారు ఆపగానే అట్టెన్షన్లో కొచ్చి చక్కగా నవ్వుతూ సెల్యూట్ చేస్తాడు.
దూరంగా ఉంటే కనుక చెయ్యి ఊపి చిర్నవ్వుతాడు.
ఆ సిగ్నల్ దగ్గర అతను లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది నాకు.
నేను దాదాపు ఆరు గంటలకి ఇంటికొస్తాను.
నేనొచ్చే సమయం తెలుసు కాబట్టి నా కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.
బేగంపేట్ సిగ్నల్ కి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతాయి.
అతని నవ్వు చాలా స్వచ్చంగా,పసిపిల్లాడి నవ్వు లాగా ఉంటుంది.
ఆ నవ్వు లోని తేటతనం నాకు నచ్చి రోజూ అతని కోసం చూస్తాను.
ఎప్పుడూ మాట్లాడాలనిపించలేదు.
అతను నాతో మాట్లాడ్డానికి ప్రయత్నించలేదు.
దుమ్మూ ధూళీ,కాలుష్యం మధ్య నిలబడి కూడా మల్లెపువ్వులాంటి నవ్వుల్ని
ఆయాచితంగా,అవ్యాజంగా వెదజల్లే నా ట్రాఫిక్ కానిస్టేబుల్
మితృడి గురించి మీకు చెప్పాలనిపించి రాసాను.
3 comments:
Nice..
అవును, ఇలాంటి స్నేహితులు అక్కడక్కడా కనిపిస్తారు. లక్ డీ కా పూల్ బస్టాప్ టర్నింగ్ లో పాదచారులను రోడ్డు దాటించే కానిస్టేబులూ, రోజూ ఎక్కే ప్రయాణీకుల కోసం ఒక్క పది సెకన్లు ఆగి చూసే ఆర్టీసీ డ్రైవర్లూ,ఏమీ ఆశించని స్వచ్ఛమైన చిరునవ్వుతో పలకరించే కాలేజీ వాచ్ మనూ....
very nice..
Post a Comment