Thursday, July 12, 2007


నిప్పుల గుండం లో నడిస్తే కాళ్ళు కాలవు

నిప్పుల గుండం లో నడవడానికి, మహత్యాలకి ఏమి సంభంధం లేదన్నది నా అనుభవం.నేను 1980 లో విజయవాడలో జరిగిన ప్రపంచ నాస్తిక మహా సభలల్లో జరిగిన ఓ కార్యక్రమంలో నిప్పుల మీద నడిచాను. ఎర్రటి నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలవు.నివిరుగప్పిన నిప్పు కాలుతుంది.తాటాకుతో నిప్పుల గుండాన్ని విసురుతారు.కణ కణలాడే గుండంలో మాత్రమే నడవాలి.చాలా వేగంగా కూడా నడవాలి.మనం నడిచినపుడు ఆ వేడికి అరికాళ్ళలో సన్నటి నీటిపొర ఏర్పడుతుంది.ఆ నీటి పొర కాళ్ళు కాలకుండా కాపాడుతుంది. ఇది విగ్న్ఞానం,సైన్సు కు సంబంధించినది. మహత్యాలకు,మాయలకు సంబంధించినది కాదు.

2 comments:

Viswanadh. BK said...

నా బ్లాగ్ సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉంది.
గుబురుగుబురుగా పెరిగిన జీడిమామిడి తోటల మధ్యల్లోఅక్కడక్కడా సపోటా చెట్లు,అక్క్డక్కడా మామిడి, సర్వి చెట్లు, బ్రహ్మజెముడు నాగజెముడు పొదల మధ్య ఎర్రటి ఇసుక దారులు. రుస్తుంబాద్ ప్రక్కనుండే అదే సీతారమపురమా మీది?

maa godavari said...

విశ్వనాథ్ గారూ
మా సీతారామపురాన్ని భలేగా పోల్చేసారండీ.మా ఊరుకు అటు సముద్రం,ఇటు గోదావరి కూడా ఉన్నాయండీ.నిజమే మా ఊరి చుట్టూ జీడిమామిడి, మామిడి,సపోటా,శీతాఫలం తోటలే.సరుగుడు తోటలకు మా ప్రాంతం ప్రసిద్ధం.మా ఊరికి పెట్టని కోటలు కోరాడులు (అంటే ఒకరి భూమికి మరొకరి భూమికి సరిహద్దులుగా ఇసుక దిబ్బలు వేసి వాటి మీద బ్రహ్మజెముడు, నాగజెముడు పాతుతారు)సీతాకాలంలో మంచు కమ్ముకున్న మా ఊరులో బారులు తీరిన తెల్లటి బ్రహ్మజెముడు పువ్వులను చూసితీరాల్సిందే . మా ఊరు చాలా అందంగా, అద్భుతంగా ఉంటుందండి.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...