మధ్యాహ్నం ముసురు నన్ను ఇంట్లోనే కట్టిపడేసింది.చెయ్యాల్సిన పనులెన్నో ఎదురు చూస్తున్నా అలాగే ధారలుగా కురుస్తున్న వానని చూస్తూ కూర్చున్నాను.చెట్లన్నీ తలారా స్నానాలు చేస్తూ పచ్చగా మెరిసిపోతున్నాయి.సంపెంగ చెట్టు నిండా పూసిన సగం తెలుపు పూలు పరిమాళాలని వెదజల్లుతున్నాయి.నేను వర్షంలో తడుస్తూనే కొన్ని సంపెంగ పూలు కోసుకొచ్చుకున్నాను. నా చుట్టూ కమ్ముకున్న సంపెంగ పరిమళం.
ఇంకొంచం వానలో తడిసి తోటకటు వైపు వెళ్ళాను.అబ్బ!పొగడ పూల చెట్టుకింద నక్ష త్రాల్లా పరుచుకున్న పొగడపూలు.ఆ పూలన్నింటిని ఏరుకొచ్చి సంపెంగల పక్కన పోసాను.నా చుట్టూ ఓ వింతైన పరిమళం.
వర్షపు ధార పరవశం ఒకవైపు,మరో వైపు ఈ పూల పరిమళం .ఈ మధాహ్నం ఇంట్లో ఉన్నందుకు ఎంతో హాయి.

Comments

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం