


వెన్నెల పుష్పం
నిన్న అర్ధరాత్రి మా గార్డెన్లో ఓ అద్భుతం జరిగింది.ఈ అద్భుతం గురించి ఇంతకు ముందు విని ఉండడం వల్ల నేను 12 గంటలవరకు మేలుకుని కెమేరాతో సహ కాపు కాసి ఆ పువ్వు విచ్చుకోవడం ఫోటో తీసాను.అద్భుతమైన ఆ పువ్వు కొన్ని గంటలు మాత్రమే ఉండి తెల్లారేపాటికి తొటకూర కాడలా వేలాడిపోయింది. వెన్నెలంత తెల్లగా ఎంతో అందంగా ఉన్న ఆ పువ్వు అంత తొందరగా వాడిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మొక్కను నేను అస్సాంలోని గౌహతి నుంచి తెచ్చి మా గార్డెన్లో వేసాను. వాళ్ళు చెప్పిన పేరు రాత్కి రాణి,రేరాణి అని. నేను మత్రం వెన్నల పుష్పం అని పేరు పేట్టాను. ఈ పువ్వు అసలు పేరు తెలిస్తే ఎవరైనా చెబుతారని బ్లాగ్లో పెట్టాను.
4 comments:
పువ్వూ బాగుంది.దానికి మీరు పెట్టిన పేరూ బాగుంది.అందాన్ని అరక్షణం ఆస్వాదించినా చాలు.మరీ ఎక్కువ చూస్తే ఆ అందానికి విలువ ,మన ఆనందానికి గాఢత తగ్గిపోతుందేమో?
రాత్ కి రాణీ ఎంటంటే Cestrum nocturnum ఎందుకంటే అది సువాసన లను రాత్రుళ్ళు వెదజల్లుతుంటుంది. కాని నాకు మాత్రం సన్న జాజులు, మల్లెల వాసన ఇష్టం.
బ్రహ్మ కమలం (Saussurea obvallata) అయినా అయ్యి ఉండాలి లేకపోతే Night Blooming Cerius అయినా అయ్యి ఉండాలి. మొక్క బొమ్మ కూడా పోస్ట్ చేసి ఉంటే బాగుండేది. రెండోది క్యాక్టసు. కాబట్టి మీ మొక్క క్యాక్టస్ కాకపొతే, మీ ఇంట్లో బ్రహ్మ కమలం ఉందని చెప్పండి.
Post a Comment