వేసవి శిబిరం ఫోటోలు
నేను మరి కొంత మంది మిత్రులు కలిసి మే10 నుండి బేగుంపేట్ లోని మక్తా అనే ప్రాంతంలో పిల్లలకోసం ఒక వేసవి సిబిరం నడుపుతున్నామని ఇంతకు ముందు మీకు తెలియచేసాను.జూన్ 2న ఆ శిబిరాన్ని ముగించాలనుకుంటున్నాం. ఎందుకంటే జూన్ మొదటి వారంలోనే కొన్ని పాఠశాలలు రీఓపన్ కాబోతున్నాయి. ఈ వేసవి సిబిరం నడపడం నాకో అద్భుతమైన అనుభవం.30 మంది పిల్లల్ల్ని పోగేసి ఆటలు,పాటలు న్రుత్యాలు,డ్రాయింగ్ నేర్పించడం, వాళ్ళతో కలిసి ఆడడం, ఎగరడం అన్నీ చక్కని అనుభవాలే. మామూలుగా అయితే ఈ పిల్లలు సమ్మర్ కాంపులకు వెళ్ళగలిగిన వారు కాదు. మేము అనుకోకుండా ఈ కాంపు పెట్టడం పిల్లలకెంతో సంతోషాన్ని కలిగించింది.వాళ్ళ సంతోషం మాకు ఎంతో త్రుప్తినిచ్చింది.ఈ కాంపు లో పాల్గొన్న పిల్లలంతా ఎంతో ఉత్సాహంతో మేము చెప్పినవన్నీ నేర్చుకున్నారు.అద్భుతమైన బొమ్మలేసారు.రధాలు తయారు చేసారు.వాటిని చక్కగా అలంకరించారు.మీకోసం కొన్ని ఫోటోలు ఇవిగో.

ఇంకా ఉంది.....

Comments

పిల్లలకి చాలా ఉత్సాహం కలిగుంటుంది- ఒక కొత్త అనుభవమౌతుంది. వాళ్ళల్లో కొంతమంది బాగా టాలెంటున్నా సరియైన బాసటలేక వడిలిపోతోంటారు. మంచి initiative.
బాగుందండీ. మీరు నా వానగట్ టపాలో ఋఆసిన వ్యాఖ్య అందింది. మీరు కావాలంటే నాకు kottapali at yahoo dot com కి రాయవచ్చు.

బేగంపేట లో మక్త అంటే ఎక్కడ? మొదటి టపాలో కుందన్ బాగ్ అని రాశారు - కుందన్ బాగ్ అంటే లైఫ్స్టైలు బిల్డింగు పక్కనించి అటు లోపలికి పోతే వచ్చే ఏరియా కదూ?

గూదు కథకి స్పందించి రాసిన ఈ బ్లాగు చూశారా? http://harinathreddy.blogspot.com/

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

ఉప్పొంగే గంగ వెంబడి ఉరుకులెత్తిన ప్రయాణం