ఆదివారం నాటి నా పాత పుస్తకాల షాపుల దర్శనానుభవం వ్యాసానికి స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు.నిజమే పుస్తకం ఓ ప్రియ నేస్తం స్థానం నుంచి జారి పోయిన మాట వాస్తవమే.ఆత్మీయతని పంచే,అనుభవాల విపంచిని కళ్ళముందు పరిచే పుస్తకం ఎక్కడ?గోపిచంద్ "మెరుపుల మరకలు" పి. శ్రీ దేవి 'కాలాతీత వ్యక్తులు" రాహుల్ సాంఖ్రుత్యాయన్ "వోల్గా నుండి గంగా వరకు" ప్రేంచంద్ "గోదాన్" సరత్చంద్రుని "శ్రీకాంత్" లాంటి జీవితాన్ని మలుపు తిప్పిన అద్భుతమైన పుస్తకాలు పాత పుస్తకాల షాపుల్లోనే కొనుక్కోగలిగిన ఆ నాటి ఆర్ధిక వొత్తిళ్ళలో కూడా ఎంత సంతోషమో పుస్తకాలు కొనుక్కోగలిగినందుకు. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటే మరెంతో ఆనందం.భాగ్యనగరంలో వెలుస్తున్న మహా మల్స్ సందర్శనం నాలాంటి వాళ్ళకు అదనంగా ఒరగబెట్టేది ఏమి ఉండదు కూడా.ఈ మెగా షాపుల్లో ప్రదర్శించే వస్తు సముదాయం వస్తు వ్యామోహాన్ని పెంచుతుందేమో గానీ నా వరకు ఎలాంటి ఆనందాన్నీ ఇవ్వలేవు.నా ఆనందం స్నేహితుల్లో, వాళ్ళకు రాసే ఉత్తరాల్లో,పుస్తకాల్లో,ప్రక్రుతిలో,నా పనిలో,నా చుట్టూ అల్లుకున్న నా కిష్టమైన పరిసరాల్లో ఉంది.మా ఊరు, మాగోదావరి,మా సముద్రం,మా ఊరి పచ్చదనం ఇచ్చినంత కిక్కు నాకు మరేది ఇవ్వలేదు.మా గోదావరి ప్రవాహం,మా సముద్ర కెరటం చాలవా నా గుండెల్లో ఆనందాన్ని నింపడానికి?

Comments

Swathi said…
పుస్తకాలతో, ఉత్తరాలతో ఎన్ని ఆనందాల్ని, ఎన్ని మధురానుభూతుల్ని, ఎన్ని హృదయ స్ప్నదనల్ని పంచుకుని ఉంటామో.
ఇది నా ఆహ్వానం గా భావించి మీరు సాహిత్యం గ్రూప్ లో చేరండి.
http://groups.google.com/group/sahityam

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం