ఈ రోజు నేను ఇంకో నలుగురు మిత్రులు కలిసి( యద్దనపూడి సులోచనా రాణీ,డా.సునంద డా.వహీదా,నేను)మా కుందంబాగ్ ప్రాంతంలో పిల్లల కోసం ఒక సమ్మర్ కాంప్ మొదలు పెట్టేం.ఒక స్కూల్ వాళ్ళ స్థలం లో నెల రోజులపాటు ఈ కాంప్ నడపాలని అనుకున్నాం.ఓ పాతిక మంది పిల్లలు వచ్చారు.అది స్లం ఏరియా కాబట్టి పిల్లల తల్లులు కూడా వచ్చారు.వాల్లతో పాటలు, పద్యాలు పాడించాము.పిల్లలంతా చక్కగా పాడారు.మేము కూడా వాళ్ళతో కలిసి పాడాము.
రేపటి నుండి పిల్లలకు ఓ గంట స్పోకెన్ ఇంగ్లీషు,డ్రాయింగు,పాటలు ,ఆటలు వుంటాయి.ఎండ వేళ పిల్లలు నీడపట్టునుండి సరదాగా గడపడం తల్లులకి నచ్చింది.మాకు కూడ ఏమైనా చెప్పండి అని అడిగారు.తల్లులకు ఆరోగ్యం గురించి డాక్టర్ల ద్వారా ఉపన్యాసాలిప్పించాలని అనుకున్నాం. పిల్లలకి ఈ రోజు చాక్లెట్లు, అరటి పండు,పుచ్చకాయ ముక్కలు ఇచ్చాము.రోజుకొకరం తినుబండారాలను తేవాలని అనుకున్నాం.భాగ్యనగరంలో ఉన్నవారు ఎవరైనా ఈ కాంప్ లో పాల్గోవచ్చు.మీ దగ్గరుండె కొత్త కళలను పిల్లలకి నేర్పొచ్చు.కాంప్ టైం ఉదయం 9 నుండి 11 లేక 12 వరకు.

Comments

lalitha said…
మీరు చేస్తున్న పని చాలా బాగుందండి.
మీకు నేను e-mail పంపించాను (కానీ gmail నుండి కాదు).

నేను పిల్లల కోసం తయారు చేసిన
వీడియోలు, యాక్టివిటీలు చూడండి http://www.telugu4kids.com లో.
నేను మీ కార్యక్రమానికి ఇటువంటివి చెయ్యడం ద్వారా ఏమైనా సహకరించ గలను అనుకుంటే తెలప గలరు.

ధన్యవాదాలు,
లలిత.
http://www.onamaalu.wordpress.com
మంచి కార్యక్రమం.
Satyavati said…
లతిత గారూ,కొవ్వలి గారూ
మీ స్పందనకి ధన్యవాదాలు.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం