హమ్మో!!!! ఎన్ని మోదుగపూలో !!!!!


నువ్వూ నేనూ మోదుగ పూలూ
మార్చి ఎనిమిది మీటింగులో ప్రసంగించి
నేనూ నా నేస్తం సిద్దిపేటకెళ్ళి వస్తుంటే
కరీంనగర్ రహదారిలో కన్నులపండుగగా మోదుగపూలు.
కాదు కాదు మోదుగ వనాలు .
ఒకటా రెండా హమ్మో ఎన్ని వనాలో !
మోదుగపూలని
కావలించుకుని ఫోటో దిగితే కాని తనివి తీరలేదు.
నేనూ నా ఫ్రెండూ
ఒకటే కేరింతలు,తుళ్ళింతలు
అడవి అంటుకుందా అనిపించేలా
ఎర్రని మంటల్లా మోదుగపూలు
మండుటెండలో కూడా మమ్మల్ని సమ్మోహపరిచిన
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ మత్తులో ముంచెత్తే
మోదుగ పూలు

Comments

రాధిక said…
మీ స్నేహంలానే చాలా తాజాగా వున్నాయి పూలు
లలిత said…
మీలో కవితావేశం రగిలించిన మోదుగపూలు......

వీటిని మోదుగపూలు అంటారని నాకు ఈ మధ్యనే ( బ్లాగుల ద్వారానే) తెలిసిందండీ!
ఎప్పుడో ఖమ్మం వెళ్ళేప్పుడు దారిలో ఈ పూల చెట్లు కనిపించాయి. నాతో వున్నవారెవరికీ వీటి పేరు తెలియలేదు.