Wednesday, March 3, 2010

భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

మేము ఒక ఇంటి ముందు కూర్చున్నాము. మా చుట్టూ ఊరంతా చేరారు.

జనవరి 22 న అత్యాచారానికి గురైన ముగ్గురు మహిళలు కూర్చున్నారు.

మేము వారితో మాట్లాడడానికి ప్రయత్నించాం.అయితే ఆ ముగ్గురికి తెలుగు రాదు.
వాళ్ళ ముఖాలు ఎంత అమాయకంగా ఉన్నాయొ చెప్పలేను.అసలు ఏ భావమూ కనబడ లేదు.బహుశా ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టు ఉన్నారు.
22 జనవరి రోజు ఎమి జరిగిందో చెప్పడానికి అక్కడ ఒకరిద్దరు తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
రాంబాబు అనే ఆయన మాకు దుబాసీగా వ్యవహరించాడు.
ఒక్కరి తర్వాత ఒక్కరు తమ పట్ల పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించిదీ చెప్పారు.
జనవరి 22 న దాదాపు 80 మంది గ్రేహౌండ్స్ పోలీసులు స్థానిక ఎస్ ఐ.కేశవ్ రావ్ తో సహ భల్లుగూడా గ్రామం మీద దాడి చేసి మగ వాళ్ళని,మగ పిల్లల్ల్ని దగ్గరలోని స్కూల్ లో పెట్టి తాళం వేసారు. ఆ తర్వాత పోలీసులు ఆదివాసీల ఇళ్ళళ్ళోకి చొరబడి నలుగురు స్ర్తీల మీద అత్యాచారానికి పాల్పడ్డారు.వంతల డోమిని,వంతల రామి,వంతల ముక్త,కిల్లో భుట్టొ లు పోలీసుసు తమ మీద అత్యాచారం చేసారని,అందులో ఒకరి చేతుల్లో ఉన్న పసి పిల్లని తుప్పల్లోకి విసిరేసాసారని వివరించారు.అత్యాచారానికి గురైన ఇద్దరి భర్తలని అరెష్టు చేసి విశాఖ జైల్లో ఉంచి బాగా కొట్టారని రాంబాబు చెప్పాడు.

జనవరి 23 న పాడేరు ఎం ఎల్ ఏ రాజా రావ్ కి తమకు జరిగి దారుణం గురిచి చెప్పుకున్నా మూడు రోజుల వరకు కేసు బుక్ చెయ్యలెదు స్థానిక పోలీసులు.కేసు రిజిస్టర్ చెయ్యకపోగా భల్లుగూడా గ్రామస్తుల్ని తీవ్రంగా బెదిరించారు.
వైద్య పరీక్షలకి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.

ప్రతి రోజు రాత్రిళ్ళు పోలీసులు తమ గ్రామం చుట్టు తిరుగుతున్నారని,తమని బెదిరిస్తున్నారని గ్రామస్తులు భయపడుతూ చెప్పారు.

తమకి పోలీసులంటే చాలా భయమని,ఓ పదేళ్ళ క్రితం ఇలాగే తమ గ్రామం మీద పడి తమ పెద్దల్ని భయంకరంగా కొట్టారని,ఆ సంఘటనని తాము ఎప్పటికి మర్చిపోలేమని, తమకు నక్సలైట్ల గురించి ఏమీ తెలియదని గద్గద స్వరాలతో చెప్పారు. డొమిని రామి, ముక్తలతో ఇంకా ఎక్కువ మాట్లాడాలని మాకు ఉన్న భాష అడ్డం వచ్చింది.వారి ముఖాల్లో 22 తేదీ నాటి ఘోరం తాలుకూ భయం స్పష్టంగా కనబడుతోంది. వారి ముఖాల్లోని అమాయకత్వం,ఎలాంటి భావాన్ని వ్యక్తం కానివ్వని ఆ అమాయకత్వం మా కళ్ళళ్ళొఓ నీళ్ళు పెట్టించిది.
క్రితం సంవత్సరం ఇదే విధమైన అత్యాచారనికి గురైన వాకపల్లి మహిళలు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూమి చెబితే ఆకాశం నమ్మదా అంటూ నిలదీసారు.
భల్లుగూడా దోమిని,రామి,ముక్త లు మాత్రం కన్నీళ్ళని సైతం కోల్పోయినట్లు కనబడ్డారు.
భారమైన గుండెలతో,వారికి న్యాయం జరిగేలా క్రుషి చేస్తామని,ఈ మారు మూల ఆదివాసీ గ్రామం లో జరిగిన ఈ బీభత్సకాండ గురించి ప్రపంచానికి తెలియ చెబుతామని వారికి చెప్పి చిక్కటి చీకటిలో కొండలెక్కి అడవి దాటి రాత్రి ఒంటి గంటకి వైజాగ్ చేరాం.
ఆ రాత్రి దుఖంతోనే కడుపు నిడిపోయింది.ఎవ్వరం అన్నాలు తినలేదు.
ఆ అమాయక అదివాసీ ల ముఖాలు కళ్ళళ్ళొంచి కదలడం లేదు.
భల్లుగూడా ఆదివాసీ అక్కలకు జరిగిన అన్యాయాన్ని ఖండిచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

5 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

ఆంగ్లేయులు, వాళ్ళ పాలన ఎంతో భేషనిపించే ఇలాంటి నల్ల దొరల అక్రుత్యాలు చూసినప్పుడల్లా గాంధీ గారి ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో? ఆయన మళ్ళీ పుడితె ఈ దేశానికి ఈ పాలకులకూ స్వంతంగా పరిపాలన చేసే హక్కు లేదని మళ్ళీ ఇంగ్లీషు వాళ్ళు రావాలని పోరాటం చేస్తారేమో? ఆ ఆదివాసీలకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాను.

Anonymous said...

If your version is TRUE, I condemn it.

anveshi said...

hmm...ఎలా ఏమి రాయాలో తెలియటం లేదు.నరకానికి నకళ్ళుగా వాళ్ళ కన్నీళ్ళు ఎలా తుడవగలమో తెలియటం లేదు.ఇలాంటి మౄగాల సంచారన్ని ఆపలేమా అనిపిస్తుంది.
భాదితులకి ఏమన్నా సహాయం చేయగలమేమో తెలియచెప్పగలరు.

Anonymous said...

నేను భల్లుగూడ ఆదివాసీ అక్కలపై జరిగిన దాడిపై రాసిన కవితను ఇక్కడ చూడగలరు.http://saamaanyudu.wordpress.com/2010/01/24/%E0%B0%97%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%AE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%82%E0%B0%A1/

పరిమళం said...

దారుణం ....

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...