నేను వండిన కూర అతనికి నచ్చలేదు
నేను చేసిన కేకూ నచ్చలేదు
అతనన్నాడు
నేను చేసిన బిస్కట్లు గట్టిగా ఉన్నయని
వాళ్ళ అమ్మ చేసినట్టు లేవట
నేను కాఫీ కూడా సరిగ్గా చెయ్యలేదట
ప్రేమగా చేసిన స్వీటూ నచ్చలేదు
అతని తల్లి మడత పెట్టినట్టుగా
అతని బట్టలు నేను మడత పెట్టలేదట
నేను వీటన్నింటికి సమాధానం ఏంటీ అని వెతుకుతుంటే
ఒక క్లూ కోసం మధనపడుతుంటే
అతని తల్లి చేసినట్టే నేను ఏమైనా చెయ్యగలనా
అని ఆలోచిస్తుంటే
నా పెదవులమీద చిరుదరహాసం మొలకెత్తింది
ఓ వెలుగు కిరణం నా కళ్ళ ముందు కదలాడింది
ఓ పని ఖచ్చితంగా
వాళ్ళ అమ్మ చేసినట్టు
చెయ్యగలననిపించి
చాచి ఓ లెంపకాయ్ అతని చెంప మీద వేసాను.
వాళ్ళ అమ్మ ఎప్పుడూ చేసేలా
అనుసృజన:సత్యవతి కొండవీటి
(రచయిత్రి ఎవ్వరో తెలియదు)
15 comments:
తల్లి లాలించినట్లుకూడా లాలించుండొచ్చేమో!
కవిత చాలా బాగుంది. చెంప నిజంగానే ఛెళ్ళుమనిపించేలా ఉంది.
అమ్మ పెట్టే నాలుగూ పెడితేగానీ...అని చిన్నప్పుడు చెప్పుకునే కధ గుర్తొచ్చింది.
psmlakshmi
ఒకవేళ భర్త గారు వండినా సరే భార్య గారికి వాళ్ళ అమ్మ చేతివంట ముందు ఇది వేస్ట్ అనిపిస్తుంది. అమ్మ చేతి వంట పవర్ అటువంటిది. ఇది అర్థం చేసుకోకుండా ఆడవాల్లెప్పుడు మగవారి పై ఏడుస్తూనే ఉంటారు. ఇటువంటి కవితలు రాస్తూనే ఉంటారు.
చాలా బాగుంది. ఓరిజినల్ కూడా ఇవ్వండి...
:-) భలే భలే!
ఫెడీళ్ .. ఫెడీళ్ ..
ఎవరికో చెంప ఛెళ్ళు ఛెళ్ళు మన్నట్టుంది.. ఎందుకో!?!?!?
హె హె
ikkaDO cadivina gurtu
baaguMdi
చాలా బావుంది :))
సరసానికైతే పరవాలేదు.
లేకుంటే,
భార్య భర్తను కొట్టినట్లు,
రాబోయే కోడలు, కొడుకుని కొడుతుంది.
అత్త గారిని ఆదర్శంగా తీసుకుంటుంది.
భర్తలు బహు పరాక్ .... : )
భలే భలే....గూభ గుయ్ అని ఉంటుంది:):)
ఇలాంటిపనులు తట్టుకోలేకే ఒంటరి మహిళలు పెరుగుతున్నారు.మహిళాబిల్లు పాసై స్త్రీలు పురోగతి సాధించేకొద్దీ మహిళల్లో బ్రహ్మచారిణులు ఇంకా పెరగొచ్చు.పురుషునిలాగానే స్త్రీ కూడా ఒంటరిగా బ్రహ్మచారిణిగా ఈ సమాజంలో మనమధ్యే ఉండకూడదనే చట్టాలు ఏమీలేవు.పెళ్ళికిముందే శృంగారం,సహజీవనం నేరం కానప్పుడు స్త్రీ ఒంటరిగా బ్రతకాలనుకోవటం నేరం కాదుగా?.
సత్యవతి గారికి నమస్తె!
కవితాపోటీ కి ఆహ్వానం.
http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html
satyavathi gaariki namaskaram. na peru kalyan naadhi tirupati. me blog choosanu chala bagundhi. me profile kooda choosanu santhoshanga anipinchindhi. meru sthreejathiki o kanuvippuga vundatam aanandhadhaayakam. nenu na kavithaa thrushnathatho o blog modhalupettanu.
www.nalomata.blogspot.com
choosi mee abhipraayaalanu chepthaarani asisthunaanu.
చాలా బాగుంది :))))
Post a Comment