Thursday, November 29, 2012

భూమికకు, నాకూ అవార్డుల, సన్మానాల సీజన్

దశాబ్ద మహిళ అవార్డ్ (20-11-12)
డిప్యూటి సి ఎం శ్రీ దామోదర రాజనరసిమ్హ 
చేతుల మీదుగా అందుకున్నప్పటి చాయాచిత్రం

నవంబరు 21 న విజయ్ స్కూల్ టాలెంట్ షో ప్రోగ్రాం లో నేను ముఖ్య అతిధిగా పాల్గొన్నాను.
అమృతలత గారు, వారి టీం నాకు ఎంతో ఆత్మీయంగా సన్మానం చేసినప్పటి ఫోటో.
అమృతలత గారు
ఆర్మూరులో వీరు ఓ చిన్న విత్తనం నాటారు.
విత్తనం ఎప్పుడూ సజీవమైందే కదా.
పాతిన విత్తనం ఊరికే ఉంటుందా.తన పని తాను చేస్తుంది.
విత్తనం అంకురమైంది,లేలేత చిగుళ్ళు వేసింది,ఆకుపచ్చని కొమ్మలేసింది,కొమ్మ కొమ్మకీ పూలొచ్చ్హాయి, కాయలొచ్చాయి,కాయ పలకమారి,పండై మళ్ళి విత్తనాన్ని విరజిమ్మింది.
మీ విజయ ప్రస్థానం సరిగ్గా ఈ విత్తన ప్రస్థానం లాంటిదే అనిపించింది నాకు.
ఎల్ కే జి నుండి ఇంజనీరింగ్ వరకు వీరు అభివృద్ధిపరిచిన విద్యాలయాలు
ప్రతి సంవత్సరం వేలకొద్దీ ఉత్తమ విద్యార్ధుల్ని తయారుచేసి చక్కటి,సంస్కారవంతులైన పౌరులుగా సమాజం లోకి పంపిస్తున్నాయి.
వీరు తయారు చేసిన "ఆల్ వుమన్ టీం" కార్యాచరణ వెనక మీ టచ్ చక్కగానే వ్యక్తమైంది.
ఆనాటి సాయంత్రం ఎంత గాఢమైన అనుభూతిని మేము పొందామో,
ప్రేక్షకుల్ని కదలకుండా కట్టిపడేసిన పిల్లలు ఎంత అద్భుతంగా ఆ రోజు పర్ ఫార్మ్ చేసారో మేము ప్రత్యక్ష సాక్షులమే కదా.
వీరు ఎంతో ప్రేమగా,ఆత్మీయత వుట్టిపడేలా నాకు చేసిన సన్మానం నా జీవితాంతం నాకు గుర్తుండిపోతుంది.





తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...