
నేను ఈ మధ్య ఒక సంస్థ వారు ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరవ్వడం కోసం మెదక్ జిల్లా సదాశివపేట దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నేను చెప్పైన సంస్తకు చెందిన ఒక డాక్టర్ ఆ గ్రామంలో హిస్ట్రెక్టమి (గర్భ సంచుల తీసివేత)చేయించుకున్న స్త్రీలతో పని చేస్తున్నారు. ఆ సమావేశానికి దాదాపు 100 మంది మహిళలు హాజరయ్యారు. అందరూ హిస్ట్రెక్టమి చేయించుకున్న వాళ్ళే. తప్పు తప్పు చేయించుకున్న వాళ్ళు కాదు.భయానో నయానో ఒప్పించి ఒక విధంగా బలవంతపు ఆపరేషన్లకి గురిచేయబడినవాళ్ళు. కాన్సర్ వస్తుందని,పిల్లలు పుట్టాక దాని అవరంలేదు అని చెప్పి,ఇంకా రకరకాల కారణాలు చెప్పి వాళ్ళ గర్భసంచుల్ని కోసేసారట. ఒక్కొక్కళ్ళు తమ కధల్ని మాకు వినిపించారు. ఒకామెకి మరీ ఘోరంగా 19 ఏళ్ళకే తీసేసారు. ప్రస్తుతం వాళ్ళందరూ రకరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నారు. నేను చెప్పిన డాక్టర్ అవిశ గింజలతో వాళ్ళకి వైద్యం చేస్తున్నారు. నేను వాళ్ళకి పోషకాహారం గురించి చెప్పాను.
6 comments:
చాలా దారుణం :(
daarunam
emtaa anyaayam kadaa!
చాలా దారుణం .ఈ విషయం ఒక టీవీ ప్రోగ్రాంలో చూశాను ..ఒక గైనకాలజిస్ట్ వారికి అవగాహన కలిగిస్తూ కౌన్సిలింగ్ చేస్తున్నామని చెప్పారు .
అర్థం కాలేదు.
పిల్లలు పుట్టిన తరువాత గర్భ సంచీ తీసేస్తే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?
అసలు ఆ డాక్టర్ ఎందుకలా చేశాడు ?
There will be lot of side effects.. and this is done by 'Arogya Shree' scheme.. Some hospitals to milk money.
Post a Comment