శుభాకాంక్షలు.


ఉత్తరం
పుస్తకం
ప్రియ నేస్తం సాన్నిహిత్యం
చెట్టు చేమ
చుట్టూ నీళ్ళు
చూపు ఆనినంత మేరా పచ్చదనం
ఎత్తైన కొండలూ
ఎరుపెక్కిన తూరుపు దిక్కు
ఎప్పుడూ నవ్వే పెదవులు
ఏదైతే ఏమిటిలే అంటూ
నల్లేరు మీద బండిలా నడిచిపోయే జీవితం
ఎవరో వస్తారు ఏదో చేస్తారు లాంటి ఉదాసీనతలకు
బై బై చెప్పేసి
నువ్వే ఒక ఉద్యమం
నువ్వేఒక మార్పు సంకేతం
నూతన సంవత్సరాన ఇదే నా సందేశం
ఇవే నా  శుభాకాంక్షలు.

Comments

చిన్న కవితలో మనోప్రపంచాన్ని చూపించారు...;)
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
다시한번 said…
http://youtu.be/zXKV78VERio

I have already com.
సాయి said…
చాలా బాగుంది...
jeevani said…
సత్యవతి గారూ దయచేసి మీరు కమెంట్ మోడెరేషన్ పెట్టండి