హిందూ మహిళలు |
హిందూ మహిళలు |
నాతో వచ్చిన పిల్లలు |
మహిళలకు ప్రవేశం లేదని చెప్పే బోర్డు |
దర్గా దగ్గర నేను |
దర్గా ముఖ ద్వారం |
నల్ల మట్టికుండల్ని అమ్మే సుగుణమ్మ |
ఇంట్లో నా సహచరుడు కూడా లేడాయే.
ఒక్కదాన్ని ఏం చేయ్యాలా అని ఆలోచిస్తుంటే ఎటైనా లాంగ్ డ్రైవ్ కి వెళదామా అనిపించింది.
జహంగీర్ దర్గాకి వెళ్ళాలని నిర్ణయించాను.
మా బంగ్లా లో ఉండే పిల్లల్ని కూడా వెంటేసుకుని పదకొండింటికి నేనే డ్రైవ్ చేస్తూ బయలుదేరా.
జహంగీర్ దర్గా హైదరాబాదుకి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
షం షాబాద్ దాటాక కొత్తూర్ దగ్గర ఎడంవైపు తిరిగి ఐదు కి.మీ లోపలికళ్ళాలి.
రోడ్డు బావుంది.ఓ గంటలో దర్గా చేరాం.జనంతో కిటకిట లాడుతోంది.
జనాలు భాజా భజింత్రీలతో ఊరేగింపుగా వస్తున్నారు.
ఈ దర్గాలో ముస్లిం ల కన్న హిందువులు ఎక్కువగా కనబడ్డారు.
దర్గా లోపలికి మహిళలకి ప్రవేశం లేదంటూ బోర్డులు పెట్టారు.
అంటే దర్గా బయట వారికోసం ద్వారం ఉంది.లోపలికి రానివ్వరు.
కానీ విచిత్రంగా తమని రానివ్వని దర్గాకి మహిళలే ఎక్కవ రావడం కనిపించింది.
జనాలు దేవుళ్ళుగా కొలిచే వాళ్ళు కూడా లింగ వివక్షతని చూపించడం ఎంత దారుణమో కదా!!
దర్గా సంగతి వదిలేస్తే నేను ఎప్పటి నుండొ కొనుక్కోవాలనుకుంటున్న నల్ల మట్టి కుండలు,దాకలు,పాలుకాచుకునే కుండలు బోలెడన్ని కొనుక్కొచ్చుకున్నాను.నా నేస్తం గీతని కూడా నాతో రమ్మన్నాను కాని తనకి కుదరలేదు.అయినా ఉన్న పళంగా బయలుదేరడానికి అందరూ నాలాగా
కాళ్ళల్లో చక్రాలు కట్టుకుని కూర్చోరు కదా.
తన కోసం కూడా ఓ సెట్ నల్ల కుండలు కొన్నా.
నల్ల మట్టి దాకలో చేపల కూర వండాలి.పొయ్యి మీద కాదు లెండి.
అదెలా వండాలో తర్వాత చెబుతాలెండి.
ఆ అన్నట్టు మరిచా దర్గా దగ్గర వేటలు తెగుతున్నాయ్.ఘుమ ఘుమ లాడుతూ ఉడుకుతున్నాయ్.
ఏదైనా టెంట్లో దూరి పోయి భోజనానికి కూర్చుందామా అనిపించింది కానీ పొయ్యిమీద డేగిశాలు మూడు,నాలుగింటిక్కానీ దిగవట.
లాభం లేదనికుని,కుండల్ని కార్ లో వేసుకుకుని నగరం వేపు పయనమాయ్యం. రెండున్నరకంతా ఇంట్లో ఉన్నాం.
ఓ సండే రోజు ఉత్సాహంగా గడపాలంటే జహంగీర్ దర్గా కి వెళ్ళొచ్చు.
6 comments:
మస్జీద్‌లు, దర్గాలకి పోవడం అభ్యుదయవాదం ఎలా అవుతుంది? మస్జీద్‌లలోకి స్త్రీలని అనుమతించొచ్చు అని హదీస్‌లో వ్రాసి ఉన్నా ఇండియాలోని ఏ మస్జీద్‌లోనూ మహిళలని రానివ్వడం లేదు. అరబ్ దేశాలలో కొన్ని మస్జీద్‌లలోకి మహిళలని రానిస్తారు కానీ అక్కడ మగ భక్తులనీ, ఆడ భక్తులనీ వేర్వేరు చోట్ల కూర్చోబెడతారు.
నేను దర్గా కెళ్ళింది దణ్ణం పెట్టుకోవడానికి కాదు.
అక్కడ మాత్రమే దొరికే అద్భుతమైన నల్ల మట్టి పాత్ర్లకోసం.
మనుషులు పెట్టిన నిబ౦ధనలకు, దేవుళ్ళని ప్రశ్నిస్తున్నాము ఏమో ? :)
కానీ విచిత్రంగా తమని రానివ్వని దర్గాకి మహిళలే ఎక్కవ రావడం కనిపించింది.
---------------
అక్కడ మాత్రమే దొరికే అద్భుతమైన నల్ల మట్టి పాత్ర్లకోసం
వచ్చారు.
I missed to come with you dear.Nalla kundallo vandukundama kalisi
I missed to come with you dear. nallamatti kundallo vanudukundama kalisi
Post a Comment