తారామండల పూల వనంలో తనివితీరా.....


యమ రష్ గా ఉండే లుంబిని వనం పక్కనుండే(పార్కింగ్ ప్లేస్ )తారామండల పూల వనం.
ఆకాశ మల్లెలని తారామండల పూలంటారని నాకు ఇటీవలే తెలిసింది.మా ఊర్లో అయితే కారప్పూలని(కారం వాసనేస్తాయి కదా)కాడమల్లెపూలని అంటారు.
సరే.శనివారం చల్లటి మబ్బులు పట్టి,చిరుజల్లులు కురిసే వేళ మేమిద్దరం (గీత, నేను)తారామండల పూల వనంలో ప్రవేశించాం.
ఎవరి కళాత్మక హృదయ స్పందనో కానీ బోలెడన్ని కాడమల్లి పూల చెట్లు నాటి,వాటి చుట్టూ చక్కగా రచ్చబండలు కట్టించారు.
మేము ప్రతి సంవత్సరం ఈ తోటలోకి వెళతాము.
హాయిగా ఓ రచ్చబండ మీద కూర్చుంటే ఆయాచితంగా,ఎంతో ఆత్మీయంగా మీ మీద ఆకాశమల్లెల జడివాన కురుస్తుంది.సువాసనలు వెదజల్లుతూ అలా మన మీద పూలు కురుస్తుంటే,పక్కన ప్రియ నేస్తం కబుర్లు చెబుతుంటే ఓహ్!అదెంత అద్భుతమైన అనుభవమో,ఒక్క సారి ఆ చెట్లకింద కూర్చుంటేనే అర్ధమౌతుంది.మేము బోలెడన్ని పూవులేరి,మాలలల్లిమెళ్ళో వేసుకున్నాం.తనివి తీరా పూలతో కబుర్లాడి,మా మీద రాలుతున్న పూలకి బై చెప్పి బయటకొచ్చాం.

Comments

Nice.. క్రిందటేడు కూడా చూశాను మీ పోస్ట్, ఇలాగే వెళ్లినట్టు ఫోటోలు పెట్టారు.
Anonymous said…
భలే చక్కటి ప్లేస్ గురించి చెప్పారు. థాంక్స్.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం