"ఫ్రెష్" మ్మార్కెట్ట్ల వెనక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి
పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది.భాగ్యనగరంలో ఫుడ్ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్ బజార్లను మింగేసాయి.జెయింట్లు, బిగ్ బజార్లు వచ్చిఫుడ్ బజార్లను దెబ్బ తీసాయి.ఇపుడు తాజా కూరగాయలు, పండ్లు అందిస్తామంటూ తాజాగా మార్కెట్లో ప్రవేసించిన "ఫ్రెష్" సూపెర్ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పడ్లు,పువ్వులు అమ్ముకుని బతికే వాల్ల పొట్టల మీద చావు దెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్ దుకాణాల్లో ఏ.సి. లు పెట్టి, తూచుదు మిషన్లు పెట్టి తక్కువ ధరలఖె కూరలు,పండ్లు అనే ప్రకటనలు గుప్పించడంతో మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఈ దుకాణాల వేపు మళ్ళ్పోతున్నరు.ఎంతో ఆర్భాటంగా పెట్టిన రైతు బజార్లు ఎందుకూ కొరగానివిగా తయారవ్వబొతున్నయి.వీధుల్లో తొపుడు బళ్ళ మీద, తలల మీద బుట్టలు పెట్టుకుకి పళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు జీవనోపాధిని కోల్పోయే ప్రమదపుటంచున నిలబడి వున్నరు.ఇల చిన్న వ్యపారాల ద్వార కూరలు అమ్ముకునేది మహిళలే అనంది వాస్తవం. ఈ మహిళల పరిస్తితి అగమ్యగోచరంగా తయారైంది.వారి కుతుంబాలు ఆకలికి గురవ్వల్సిన దుస్థితిలోకి నెట్టేయబడుతున్నరు.
ఇటీవల ఒక మిత్రురాలు చెప్పిన విషయం నన్ను భయకంపితురాలను చేసింది. సికిందరాబద్ చుట్టుపక్కల వందల సంఖ్యలో పళ్ళు అమ్ముకునేవారున్నారు.ద్రఖ, అరటి పండ్లు లాంటి హిదరాబాదుకు ప్రత్యేకమైన పండ్లను వూరికి తీసుకెళ్ళ్డం అందరికి అలవాటు. నా మిత్రురాలు వాళ్ళ అమ్మగారికి ఇవ్వడం కోసం ద్రాక్ష పళ్ళ కోసం ఆచుట్టుపక్కలంతా వెతికిందట.చివరకి ఓ మూల ద్రాఖ పళ్ళు అమ్ముతున్న మహిళ కనపడిందట." ఏంటమ్మా! మార్కెట్ నిండా ద్రాక్ష పళ్ళొచ్చయి. ఇక్కడ లేవేంటి అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం-ఈల బళ్ళ మీద పళ్ళమ్మ కూడదంట.పెద్ద పెద్ద దుకాణాలొచ్చాయి.అక్కడే కొనుక్కోవాలట అందరూ.ఫ్రెష్ దుకాణాల్లో ఫ్రెష్గ దొరుకుతున్నయి. మీరెందుకిక్కడ. ఇక్కడ పళ్ళమ్మడానికి వీల్ల్దని పోలీసులు తరిమేస్తున్నరట.అందరూ పెద్ద పెద్ద షాపుల్లో కొనుక్కుంటే మేమెలా బతకాలి?మా బతుకులేం కావాలి?అని కళ్ళ నీళ్ళు పెట్టుకుందట.
ఈ ప్రశ్న ద్రాఖ పళ్ళమ్ముక్నే ఆ మహిళదే కాదు.వందలాది, వేలాది మంది మహిళలది.మరో చోట ఆకుకూరలు అమ్ముక్నే రాజమ్మ ప్రస్న నన్ను ఎంతో దుఖనికి గురిచేసింది.ఆమె దగ్గర నేను ఆకు కూరలు రోజూ కొంటాను.ఆమె అమ్ముకునే స్థలానికి ఎదురుగానే ఫ్రెష్ మార్కెట్ వెలిసింది.జనం అక్కడ క్యూలు కట్టారు.ఆకుకూరలు కొనడానికి వెళ్ళినపుడు" ఏమ్మ మీరు కూడా రేపటి నుండి అటే పోతారా?నిన్న నా ఆకుకూరలన్ని కుళ్ళిపోయాయి.ఏ వేళ కూడా ఇంకా ఎవరూ ఇటు రాలేదు.ఈ రోజు కూడా కుళ్ళిపోతాయి..మరి నేనెట్టా బతకాలి.ణా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? మా కడుపులు కొట్టడానికే ఈ మర్కెట్లొచ్చాయి. చావు తప్ప నాకు మరో మర్గం కనబడ్డం లేదు"కన్నీళ్ళతో అడిగింది. నా దగ్గర సమాధం లేదు.
మన దేశంలో చిల్లర వర్తకం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది.అధిక ఆదాయాన్నిచ్చే ఈ చిల్లర వర్తకంపై విదేశీయుల కన్ను పడింది.ఇందులో ప్రవేసించడానికి అమెరికాకు చెందిన ఎన్నో బహుళ జాతికంపెనీలు సిద్ధమవుతున్నయి.ఒక్క అమెరికయే కాదు జర్మనీ, బ్రిటన్ కు చెందిన కంపెనీలు రడి అవితున్నాయి.దేశీయ కంపెనీలైన రిలయన్స్, హెరిటేజ్ లాంటివి తమ సూపెర్ మార్కెట్లు తెరిచాయి.ఎరేట్లు తక్కువగా వున్నయంటూ జనం ఇక్కడ కొనడానికి ఎగబడుతుండంతో వాటి చుట్టుపక్కల వుండే చిన్న దుకాణాలన్ని మూతపడే ప్రమాదం పొంచి వుంది.ఇప్పటికే కొన్ని మూత పడ్డాయి. రజమ్మ లంటి వాళ్ళు ఈ కొండల్ని ధీ కొట్టలేరు.ఫలితం వాళ్ళ దుకాణం మూత పడడం.రాజమ్మ జీవనోప్ధి కోల్పోయి వీధిన పడుతుంది.వందల్లో, వేలల్లొ రజమ్మలు, రాజయ్యల పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుంది.తోపుదు బండి మీద కూరగాయలమ్ముకునే రజయ్య కోపంతో మండిపోతూ" ఫోన్లు అమ్ముకోండీ,పెట్రోలు అమ్ముకోండీ,విమానాలమ్ముకోండీ. మా కడుపులకింత అన్నం పెట్టే కూరగాయలు, పళ్ళు కూడా మీరే అమ్ముకుని సొమ్ము గడిస్తే మేమేమవ్వలి? మాబతుకుళేం కావాలి?అంటూ కేకలేసడు.చిన్న వర్తకంలోకి పెద్ద కంపెనీలను అనుమతించే ముందు ప్రభ్త్వం ఇంతైనా ఆలోచించిందా?ఎవరికో వ్పాధి దొరుకుతుందని, శంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని,వస్థువులు చవగ్గ దొరుకుతాయని సమర్ధించుకుంటూ వేలాది మంది జీవనోపధి మీద చావు దెబ్బ కొద్తున్న విషయం ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి.ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిన అవసరం చాల వుంది.
5 comments:
ఈ కార్పొరేటు చిల్లరకొట్లు సాధారణ అమ్మకం దారుల జీవనోపాధిపై దెబ్బ కొట్టడం మొదలైంది. వాళ్ళ దగ్గర వస్తువులు చవగ్గా దొరుకుతాయనేది కల్ల. బడుగు వర్తకులను రంగంలోంచి తరిమేసాక, అప్పుడు చూపిస్తారు వాళ్ళ తడాఖా. ప్రభుత్వాలను నడిపే వాళ్ళు ఈ కార్పొరేట్లకు దాసులు. సామాన్యుల వెతలు వారికి పట్టవు. గతంలో నా బ్లాగులో ఈ విషయమై చర్చ జరిగింది.
నేనైతే, ఆ చర్చలో స్పందన గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకేభవిస్తాను..
http://chaduvari.blogspot.com/2007/01/blog-post_24.html#comment-4040648904587704741
ఐనా మహిళలు అంత తొందరగా మోసపోరు. నేను ఫ్రెష్ కెళ్ళి చూసా.. కొన్ని విదేశీ కూరగాయలు ఉన్నాయి. కాని మిగాతా వన్నీ ధరలు ఎక్కువే. బలిసినవాళ్ళు వేళ్ళే మార్కెట్లు అవి. మధ్యతరగతి వాళ్ళు కిరాణా దుకాణాలు ,కూరగాయల బండ్లు వదలరు. ఇవన్నీ కొత్తలో రద్దీగా ఉంటాయి అంతే. అన్నీ ప్రకటనలతో మోసం చేయగలం అనుకుంటారు. కాని జనం అంత పిచ్చోళ్ళు కాదు అని తెలుసుకోరు.
మేమైతే హైదరాబాదులో ఈబళ్ళవాళ్ళ, సైకిల్ వాళ్ళ, చిన్న కిరాణా వాళ్ళ వేషాలకి చాలా పరేషానయ్యాం. మా చింతలబస్తీలో అయితే కూరలకేళ్తే చాలా భయపడ్తూ వెళ్తాం. ఒకసారి ఏరుకుంటూంటే వాడు నీకమ్మను పో అని అరుపులు. వాడిచ్చినవే తీసుకోవాలని వాడి హుకుం. ఆపొగరు హైదరాబాద్ స్పెషలేమో. ఎప్పూడూ తూకంతక్కువే. పైగా అడిగితే దెబ్బలాట. ముసలివాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. ఎంత మాటొస్తే అంత మాట్లాడెయ్యడం. పచారీ కొట్టుకెడితే ఇసుక, రాళ్ళూ. అలాగని పెద్ద షాపులకెళ్తే అక్కడా క్వాలిటీ సమస్యే. వినియోగదారుడే అసలైన నష్టజాతకుడు.
ఈ ఫ్రెష్ మార్కెట్ల వల్ల మొదట బాధ పడేది ఇలాంటి చిల్లర వర్తకులు,తరువాత మనలాంటి వినియోగదారుడు.సత్య సాయి గారన్నట్టు ఇలా బుట్టల్లో పెట్టుకు అమ్మే వాళ్ళు చాలా దారుణం గా ప్రవర్తిస్తున్నారు.వినియోగదారులు వాళ్ళ ప్రవర్తన భరించలెక కూడా ఇలాంటి మార్కెట్లకి ఆకర్షితులవుతున్నారేమో?
Post a Comment