Friday, June 25, 2021

కథల మాస్టారికి తుది వీడ్కోలు


2017 లో వ్యక్తిగతమైన పని మీద వైజాగ్ వెళ్ళాను.అప్పటికప్పుడు శ్రీకాకుళం వెళ్ళి కారా మాస్టారు గారిని చూడాలనిపించింది.
టాక్సి బుక్ చేసుకుని ఒక్కదాన్ని బయలుదేరాను.
వైజాగ్ లో ఉన్న ఉమ నాతో ఎందుకు రాలేదో,అసలు తనకి చెప్పానో లేదో నాకు గుర్తు లేదు.
జయ వాళ్ళ సహచరుడికి బాలేదనే చూడడానికి వైజాగ్ వెళ్ళాను కనుక తను రాలేదు.
బయలుదేరే ముందు ఫోన్ చేసాను కానీ మాస్టారు ఎత్తలేదు.
శ్రీకాళం లోనే ఉన్నారు కదా అనే ధీమాతో బయలు దేరాను.
సగం దూరం పైనే వెళ్ళిపోయాను.అప్పుడు మాస్టారు ఫోన్ చేసారు.
తాను ప్రయాణం లో ఉన్నానని,డాక్టర్ కి చూపించుకోవడానికి వైజాగ్ వెళుతున్నానని చెప్పారు.
ఆయన అటునించి నేను ఇటు నుంచి ప్రయాణం లో ఉన్నామన్న మాట.
నేను చెప్పాను మీ కోసం నేను శ్రీకాకుళం బయలుదేరాను.
నేను ఫలానా చోట మీ కోసం వెయిట్ చేస్తాను అని ఆయనతో ప్రయాణం చేస్తున్న అతనికి నేనున్న ప్రాంతం పేరు చెప్పి ఎదురుచూసాను.
వారి కారొచ్చింది.
మాస్టారుతో మాట్లాడాను.
నేను మీతో మీ కారులో వస్తాను అని అడిగాను.
రామ్మా అని పిలిచారు.
నా కారు ఖాళీగా అనుసరించింది.
మాస్టారుతో అలా ప్రయాణం చెయ్యడం ఎంత బావుందో.
ఎన్నో విషయాలు మాట్లాడారు.కొన్ని నేను రికార్డ్ చేసాను.
ఆయనతో పాటు హాస్పిటల్ కి వెళ్ళాను.అక్కడ కొంతసేపు గడిపి నా ఫ్రెండ్ జయ వాళ్ళింటికి వచ్చేసాను.
అబ్బూరి చాయాదేవి,కొండపల్లి కోటేశ్వరమ్మ,కాళీపట్నం రామారావు మాస్టారు లాంటి అపురూప వ్యక్తులతో ఉండే ఇలాంటి చిన్న అనుభవాలు ఖచ్చితంగా నా జీవితాన్ని వెలిగించిన సందర్భాలే.
వారి వ్యక్తిత్వపు వెలుగులు నా మీద ప్రసరించిన అపురూప క్షణాలే.
కారా మాస్టారు గారికి కన్నీటి నివాళి.
Uma Nuthakki, Rompicharla Bhargavi and 52 others
5 Comments
1 Share
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...