Friday, June 25, 2021

మేరీడ్ టూ భూటాన్" పుస్తకం.

 2016 లో విజయనగరం వెళ్ళినప్పుడు ఉమా నూతక్కి చక్కని పుస్తకం బహుమతి గా ఇచ్చింది. లిండా లీమింగ్ రాసిన "మేరీడ్ టూ భూటాన్" పుస్తకం.

నాకు చక్కటి బహుమతి అంటే అది ఓ మొక్కో లేక ఓ బుక్కో అంతే.
అంతకన్నా విలువైనవి నాకు ఇంకేమీ లేవు.
నేను వస్తువుల గురించి మాట్లాడుతున్నా.
నన్ను ప్రేమించే ప్రియులు చాలా మంది ఉన్నారు.
ప్రియులు అంటే ప్రియమైన వారు.బాయ్ ఫ్రెండ్స్, ప్రియుల్లో వాళ్ళూ ఉన్నారు.
నన్ను ప్రేమల్లో,స్నేహాల్లో ముంచెత్తే వారి గురించి వాళ్ళ ప్రేమల గురించి మరో సారి చెబుతా.
చెప్పాలి...మనిషి కి ప్రేమ ఎంత అవసరమో చెప్పాలి.
ఒక్క మనిషి చుట్టూ అల్లుకునే ప్రేమ ఎంత సంకుచితమో,
ఎంత తాత్కాలికమో కూడా చెప్పాలి.
మీ జ్ఞాపకం... ఎంత మంది పెదవి అంచు మీద చిరునవ్వుగా మెరుస్తుందో మీకు తెలుసా.
కలవక్కరలేదు...మాట్లాడక్కర లేదు..
జస్ట్ ...మీ జ్ఞాపకం...మీ తలంపు..చిరుగాలి తరగలా మీ ప్రియుల చుట్టూ ప్రేమని పుప్పొడిలా రాల్చడం గురించి మీకు ఎవరైనా చెప్పారా? అలాంటి అనుభూతిని ఎవరికైనా మీరు కలిగించారా?
నన్ను నిత్యం అలా ప్రేమించే వాళ్ళు
నా ప్రేమని ఆస్వాధించేవాళ్ళు,ఎంతమందని చెప్పను...చెప్పలేను ఆ లెక్క.
ఇది చదివాకా వాళ్ళు తప్పకుండా వాళ్ళ భావాలను పంచుకుంటారు.
సరే....నేను రాయాలనుకున్నది వేరు ..రాస్తున్నది వేరు.
"మేరీడ్ టు భూటాన్" పుస్తకం గురించి కదా మొదలు పెట్టాను.
ఒక్కోసారి నా అక్షరాలు ఇలాగే తమకిష్టమైన చోటుకి పరుగులు తీస్తుంటాయ్.
అమెరికాకి చెందిన లిండా లీమింగ్ అనే ఆమె...భూటాన్ తో ప్రేమలో పడి...ఒక భూటానీ ని పెళ్ళి చేసుకుని హిమాలయాల సౌందర్యం...ఆకుపచ్చ లోయ అందాలు..అక్కడి ప్రజల జీవన విధానం గురించి అద్భుతంగా రాసిన పుస్తకం.
ప్రపంచ దేశాలన్ని ఆర్ధికాభివృద్ధి "అభివృద్ధి"కి కొలమానం గా చూపెడితే భూటాన్ రాజు మాత్రం భూటాన్ ప్రజల "ఆనందస్థాయి" ని "అభివృద్ధి"గా నిర్ణయించడం అది ఐక్య రాజ్య సమితి లో కూడా ఆమోదం పొందడం గమనించాల్సిన అంశం.
భూటాన్ ప్రజల ఆనందానికి కారణం ఏమిటా అని లిండా అన్వేషిస్తుంది.
ఆ రహస్యం ఏమిటా అని మీరు అన్వేషించాలంటే పుస్తకం చవాల్సిందే.
ఈ పుస్తకం చదివాకా భూటాన్ వెళ్ళి రావాలని నేను నిర్ణయించుకున్నాను.
వెనక్కి రాగలనో...లిండా లాగా అక్కడే ఉండిపోతానో వెళితే కానీ తెలియదు.
నా అంతిమ ప్రస్థానం హిమాలయాలే అన్నది ఖచ్చితం.అవి ఇండియాలో హిమాలయాలా మరింకో దేశమా అన్నది నేనే తేల్చుకోవాలి.
నేను 2012 లో ఆనందమంటే ఏమిటి...సంతోషం ఎక్కడుంటుంది...అంటూ వెతుకుతూ ఓ పుస్తకం రాయడం మొదలు పెట్టాను.
దానికి "హేపినెస్ ప్రాజెక్ట్" అని పేరు పెట్టాను.చాలా రాసాను.ఇంకా రాస్తున్నాను... వెతుకుతున్నాను.
ఈ వెతుకులాట మన లోపలి ప్రపంచం లోకి నడుస్తుంది.
ఈ అన్వేషణ మన మూలాల్లోకి వెళుతుంది.
నిజాయితీగా వెతికితే ఒక్కోసారి మనం నిల్చున్న భూమి కదిలిపోవచ్చు.
అంతవరకూ మనం సంతోషం గా అనుకుంటున్నది అసలైన ఆనందం కాదని తెలిసి ,భ్రమలు బద్దలవ్వొచ్చు.
కానీ ఈ అన్వేషణ చాలా లోతుగా సాగినప్పుడు ..
మనకి ఏది నిజమైన ఆనందాన్ని ఇస్తుందో అర్ధమౌతుంది.
నిజమైన....అబద్ధమైన హా.. హా.. హా... ఎస్... అబద్ధమైన ఆనందం కూడా ఉంటుంది.
వస్తు ప్రేమ ...వాటిని సొంతం చేసుకోవడం లో ఒక వికారమైన అనందం ఉంటుంది.
దేనినైనా...వస్తువునైనా...మనిషినైనా స్వంతం చేసుకోవడం
నాకే స్వంతం అనుకోవడం లో అస్సలు ఆనందం లేదని అర్ధమై మనం చాలా దుఖానికి గురౌతాం.
మనిషిని ప్రేమతోనో ,ఆరాధనతోనో కట్టేసుకోవడం..ఒక ఇరుకులోకి జారిపోవడం...
వాళ్ళకి ఊపిరాడకుండా చెయ్యడం లో అస్సలు సంతోషం ఉండదు.
ఖలీల్ జీబ్రాన్ చెప్పినట్టు రెండు విడి విడి స్థంబాల్లా ఎవరి అస్థిత్వం తో వాళ్ళు ఉండంలో ఉన్న అందం మనకి ఓ పట్టాన అర్ధం కాదు.అంతా కలగలిపేసుకుని....కంగాళీ చేసుకునే వరకు మనకు నిద్రపట్టదు.
ఒకరికి ఇంకొకరం అనేది కొంత కాలమే సంతోషాన్నిస్తుంది..
ఆ తర్వాత ఒకరికి ఇంకొకరు జిరాక్స్ కాపీల్లాగా తయారై ఆ బంధం నిస్సారమైపోవడం గమనిస్తాం.
చెప్పానుగా... ఆనందాన్వేషణ అదీ నిజమైన ఆనందాన్వేషణ చాలా కష్టమనిపిస్తుంది... కానీ ....
దాన్ని పట్టుకోగలిగితే జీవితం చిద్విలాసంగా...వైవిధ్యంతో సాగిపోతుంది.
కొన్నింటినే ప్రేమిస్తాను..కొంతమందినే ప్రేమిస్తాను అంటూ పరిధులు గీసుకుంటే మన ఆనందం ఆ పరిధుల్లోనే పరిభ్రమిస్తుంది.
విశ్వమానవ ప్రేమ ...విశాల ప్రకృతి ప్రేమ...ఇవి మాత్రమే శాశ్వతానందాన్ని ఇస్తాయని నాకు అర్ధమైంది.
ఎన్నింటినో జల్లెడ పడితే ఈ ఫలితం వచ్చింది.
నా దృష్టి లో అల్టిమేట్ అంటే ఇదే...
భక్తులకు అల్టిమేట్ అంటే బహుశా జన్మ రాహిత్యం..స్వర్గ ప్రాప్తి.
నేను ఈ రెండింటినీ నమ్మను. ఎందుకంటే ఇవి లేవు కాబట్టి.
నాకు పునర్జన్మల మీద ఇంత కూడా నమ్మకం లేదు ...కానీ నాకు చెట్టు గానో...సముద్రం గానో...హిమాలయాల్లాగానో..మా గోదావరి లాగానో పుట్టాలనుంది.
నాకు జన్మ రాహిత్యం అక్కరలేదు.
నేను నా అనంద కారకాన్ని వెతికి పట్టుకున్నాను....
మా గోదారొడ్డున ఓ రెల్లుపాక వేసుకుని ఆకాశం కింద చుక్కల వెలుగులో నా ప్రియులందరికీ పంచాలి కదా....
May be an image of text that says 'MARRIED TO BHUTAN How One Woman Got Lost, Said I Do.' and Found Bliss LINDA LEAMING'
Uma Nuthakki, Prasuna Balantrapu and 25 others
6 Comments
1 Share
Like
Comment
Share

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...