Friday, June 25, 2021

ఈ బిడ్డ చేసిన తప్పేంటి ??


మాస్క్ ఎక్కువసేపు పెట్టుకుంటే చాలా తలనొప్పి వస్తోంది .అందుకే ఈ రోజు ఉదయం కాకుండా మధ్యాహ్నం మేడ్చల్ వెళ్ళాను.కొంచం సేపు ఉండి వచ్చెయ్యాలని ప్లాన్.టెంట్ లో కూర్చున్నాను.అపర్ణ,కవిత పులి,ఉష బంధం,ఇంకా చాలామంది మితృలు కలిసారు.వాళ్ళు ఉదయం నుండి ఫుడ్ సర్వింగ్ లో ఉన్నారు.
నేను ఎవరితోనో మాట్లాడుతుంటే ఒకాయన వచ్చి ఎం ఆర్ వో గారు పిలుస్తున్నారు అని చెప్పాడు.ఏంటా అని వెళితే మేడం 7 రోజుల బిడ్డతో ఒకామె అక్కడ రోడ్డు మీద దుమ్ములో కూర్చుని ఉంది. ఆమె కోసం వెహికల్ అరేంజ్ చెయ్యగలరా అని అడిగారు.ఈ లోపు కానుపు
జరిగి 7 రోజులే అయిన పచ్చి బాలింత నడుచుకుంటూ మా వేపు వచ్చింది.మేము వెంటనే ఆమెని శ్త్రీ శిశు అభివృద్ధి శాఖ వారి డెస్క్ దగ్గరకి తీసుకెళ్ళాము.ఆ పసికందు ఒంటిమీద ఏమీ లేదు .ప్లాస్టిక్ కవర్ లో చుట్టారు.మీ దగ్గర టవల్స్ లేవా అంటే లేవు అన్నారు వాళ్ళు.నేను మా డ్రైవర్ కి కాల్ చేసి ఈ రోజే ఉతికి నా సీట్ మీద పరచిన తెల్ల టర్కీ టవల్ తెప్పించి బిడ్డని అందులో చుట్టాము.
వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసి,ఏదైనా ప్రయివేట్ వాహనం దొరుకుతుందేమో వేట మొదలు పెట్టాం. ఎం ఆర్ వో గారిని అడిగాను.మీరే ఏదైనా వెహికల్ బుక్ చేయండి నేను డబ్బు చెల్లిస్తాను అని చెప్పాను.ఆయన ప్రయత్నించారు.కానీ దొరకటం లేదు.అక్కడే ఉన్న ఇండస్ మార్టిన్ మితృడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ రాం సింగ్ గారితో చెప్పాను. ఆయన వెంటనే నేను వెహికల్ అరేంజ్ చేస్తాను అని ఆయన ప్రయత్నం మొదలు పెట్టారు.మొదట వాళ్ళు నాగ్పూర్ అని చెప్పారు.కానీ వాళ్ళు వెళ్ళాల్సింది గడ్చిరోలి జిల్లాలోని ఒక గ్రామం.లెక్కవేస్తే 700 కిలోమీటర్లు వచ్చింది.రాను పోను 1400 వందల కిలోమీటర్లు.రానూ పోనూ కలుపుకుని 20000/ వేలు అవుతుందని చెప్పారు. నేను ఓకే అన్నాను.టెంట్లో ఉన్న కొంతమంది కూడా కంట్రిబ్యూట్ చేసారు.
రాం సింగ్ గారు వెహికల్ దొరకబట్టారు.అప్పటికే 8 అయిపోయింది. 7 గంటలకి కర్ఫ్యూ.నేను వెళతాను మీరు పంపించండి నేను మని గూగుల్ పే చేస్తాను అంటే మేడం మీరు ఉండండి,వెహికల్ వస్తోంది.
అంటే ఉండిపోయాను.
ఓ పావు గంటకి ఇనోవా వచ్చింది.హమ్మయ్య అనుకుని వాళ్ళకి ఫుడ్ పేకెట్స్ అన్నీ బండిలో పెట్టించి
అందరం వాళ్ళకి బై బై చెప్పాం.
ఎం ఆర్ వో గారి ద్వారా పోలీస్ పర్మిషన్ ఇప్పించి వినోద్( ఇనోవా డ్రైవర్) అన్ని జాగ్రత్తలు చెప్పి,నిద్ర వస్తే ఆగమని, ఏమి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చెయ్యమని చెప్పి వాళ్ళకి వీడ్కోలు చెప్పాం.
నేను ఇంటికి చేరేటప్పటికి తొమ్మిదైంది.
కానీ ఈ రోజు దొరికిన తృప్తి ,ఆనందం ముందు ఇంకేమీ సాటి రావు.ఎం ఆర్ వో మేడ్చల్,రాం సింగ్ గారూ భలే దొడ్డ మనుష్యులు.అందరికీ ధన్యవాదాలు.
7 రోజుల బిడ్డ ఈ రోజు నన్ను భలే పరుగులు పెట్టించి, చక్కగా బండెక్కి అమ్మ వొళ్ళో హాయిగా బజ్జుంది.
Mirapa Madhavi, Kondaveeti Gopi and 14 others
2 Comments
Like
Comment

No comments:

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...