Tuesday, May 22, 2007

తల్లుల దినం పెట్టమని ఇక్కడి తల్లులెవరూ అడగలేదు.ఎవడో పెట్టిన ఆ దినాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశంలోని తల్లులందరి మీద అవాకులు చెవాకులు రాసిన కుసంస్కారులకు ఓ దణ్ణం.ఈ దాడి లో పాత్ర వహించిన సోదరీమణులకు మరిన్ని దణ్ణాలు.నిజమే నవమాసాలూ మోసి మిమ్మల్ని కన్నారు,పెంచారు, మీరు ఏడిస్తే వాళ్ళూ ఏడ్చారు,మీరు నవ్వితే వాళ్ళూ నవ్వారు.మీ ఉచ్చ గుడ్డల్ని ఉతికి, మీ ఎంగిలి మూతుల్ని తుడిచి,మీకు రోగమొస్తే రాత్రంతా మేలుకుని కంటికి రెప్పలా కాచుకున్నదుకు అహహ !ఏమి గొప్ప బహుమానం ఇచ్చారండీ. శహభాష్.
తల్లుల్ని ఉతికి ఆరెయ్యడానిని,మీ కచ్చ తీర్చుకోవడానికి స్త్రీవాదుల మీద మీ నోటికొచ్చినట్టు మాట్లడారే? మీకసలు స్త్రీవాదమంటే ఏమిటో తెలుసా? స్త్రీవాదం ఏమిచెప్పిందో మీలో ఎవరైనా చదివారా?
చదవకుండా ఎలా మాట్లాడతారు?
తల్లి తండ్రుల్ని తిండి పెట్టకుండా తన్ని తగలేస్తున్న ఈనాటి పిల్లల ఏలాంటి భావజాలాన్ని ఒంట పట్టించుకుంటున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్ధమైంది. జన్మ నిచ్చిన తల్లిని సైతం షరతులకు లోబడే గౌరవించే ఇలాంటి పుత్ర రత్నాన్ని కన్న ఆ తల్లికి చేతులెత్తి మొక్కాల్సిందే

5 comments:

spandana said...

సత్యవతి గారూ,

మీ బాధను మీలోనే దాచుకోకుండా పంచుకున్నందుకు అభినందనలు.

ఒక చెడ్డవాడు చనిపోయినప్పుడు కూడా అతను చేసిన మంచి గురించే చెప్పుకుంటాం. అది సంస్కారం. తల్లుల గొప్పదనాన్ని/ప్రేమను స్మరించుకోవలిసిన రోజును అలా వుపయోగించుకోవడం కుసంస్కారం.

మంత్రాలతో చింతకాయలు రాల్చేవారికి స్త్రీవాదం తెలుస్తుందంటే మంత్రాలకు చింతకాయలూ రాలుతాయి.

--ప్రసాద్
http://blog.charasala.com

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

సత్యవతిగారూ !

అంబానాథ్ గారి గురించేనా మీ బాధ ? ఆయన చెప్పిందీ మీరు రాసినదీ ఒకటి కాదు. వ్యక్తిగతంగా emotional అవ్వడం మానేసి పదిమంది గురించి ఆలోచించే intellectual గా చూడండి. ప్రతి నూతన సంవత్సరాది రోజునా గత అనుభవాలు నెమరువేసుకుని భవిష్యత్తు కోసం New Year resolutions తీసుకుంటాం. అంబానాథ్ ఎవరినీ దూషించలేదు. ఎవరూ మాట్లాడని సమస్యల్ని అంబానాథ్ గారు ప్రస్తావించారు.ఆయనకి తోచిన పరిష్కారం ఆయన చెప్పారు. అందుకాయన్ని అభినందించడం మానేసి అసహ్యంగా తిడతారెందుకు ? We are women . We are infallible. We are angels. అంటూ ఊరికే మొండివాదానికి దిగకండి. మీరు ప్రస్తావించినది పసిపిల్లల దశలో తల్లి పిల్లల్ని చూసుకునే విధానం గురించి. అంబానాథ్ గారు చెబుతున్నది-కొందరు బాధ్యతారహితులైన తల్లుల విషయంలో ఆ treatment చివరి దాకా కొనసాగట్లేదని తల్లులు మధ్యలో రంగుమారుస్తున్నారని. ఆయన రాసిన టపా కింద వ్యాఖ్యలు రాసినవారెందరో అది నిజమేనని సాక్ష్యమిచ్చారు. ఎవరు కుసంస్కారులు ? మీరే ఆలోచించండి. తన గురించి ఒక వ్యక్తి వ్యక్తిగతం దాడులకి పాల్పడ్డాడని తెలిసీ తిరిగి పల్లెత్తు మాట కూడా అనకుండా "ఆయన బ్లాగు, ఆయనిష్టం, ఏమైనా రాసుకోవచ్చు మనకెందుకు పోనివ్వండి" అన్న అంబానాథ్ గారిదా ? నాకు నువ్వొద్దు నీ వ్యాఖ్యలొద్దు అంటున్నా వినకుండా ఆయన వెంటపడుతున్నవారిదా ?

ఏదో తెలీని పాతపగ అసూయ ద్వేషం మనసులో పెట్టుకుని అంబానాథ్ ని నిష్కారణంగా వెంటాడుతున్న/ బురద జల్లుతున్న చరసాల ప్రసాద్ గారిమీద నాకు గౌరవం నశించింది. మీకు దేవుడు ఇష్టం లేకపోతే పూజించకండి. మీలాటివారు నూటికి ఇద్దరు ముగ్గురికంటే లేరు. కాని ఆ నమ్మకాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. అనవసరంగా మనుషుల్ని hurt చెయ్యకండి. మీకిష్టం లేకపోతే ఆయన బ్లాగు చదవడం మానెయ్యండి. అది మీ చేతులోనే ఉంది. అనవసరంగా ఎవరినీ ద్వేషించొద్దు.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

సత్యవతి గారూ,
స్త్రీ వాదమంటే ఆయనకు తెలుసా అని అడిగారు ఆయనకే కాదు చాలా మందికి - స్త్రీలకి, పురుషులకి-కూడా తెలియదు (ఆ ఉద్యమం లో ఉన్న వాళ్ళకు తెలుసా అని సందేహం కలిగిన సందర్భాలున్నాయి). మీరు శ్రమ తీసుకుని ఒకసారి తెలియచేయండి. కొన్ని అపోహలు కొంతమందికైనా తొలగచ్చు.

అంబానాథ్ గారు చెప్ప్పినది సరి కాదని మీ అందరి అభిప్రాయం. అలాగే అనుకోండి. డానికి ప్రసాద్ గారు, మీరు, మీరు చెప్పిన సోదరీమణులు ప్రతిస్పందించిన పద్ధతి సరైనది కాదని నా అభిప్రాయం. అంత వ్యక్తిగతంగా తీసుకోవల్సిన అవసరం లేదు. ఎవరైనా లోపం ఉంది అని చెప్పినప్పుడు, ఒకసారి ఆత్మ విమర్ష చేసుకోవడం, సదరు వ్యక్తి చెప్పినది తప్పని తేలితే మనమనుకున్న దారిలో పోవడం, లేదా ఆ వ్యక్తి చెప్పినదాంట్లో ఏదైన నిజం ఉంటే మనం కావల్సిన సంస్కరణలు చేపట్టడం సరియైన పద్ధతి. అంతే కాని, వాంతులొస్తున్నాయని ఒకరు, పిచ్చి పట్టిందని ఒకరు, తుక్కు తుక్కుగా కొట్టాలని ఒకరు ఇలా రకరకాలుగా వ్యాఖ్యానాలు చెయ్యడం ఏ ఉద్యమానికి, వ్యక్తిత్వానికీ వన్నె తేదు. మీఅభిప్రాయాలు, మీరు అనుకొంటున్నది absolute truth అని అంత గాఢవిశ్వాసమా?

శ్రీనివాసరాజు said...

మీది పగోజి.. మాది పగోజి..

హ హా హా..
ధ్యాంక్సండి..

చదువుతూ ఉండండి.. :-)

Hari Mallepally said...

bloggulu chadivi kooda janalu inthagaa react avuthaarani naaku thelidu.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...