Friday, May 11, 2012

సృజనాత్మకత ఉట్టిపడే అబ్బూరి చాయాదేవి గారు


 ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, "తనమార్గం" కధల సంపుటికి సాహిత్య అకాడెమి అవార్డ్ పొందిన అబ్బూరి చాయా దేవి గారు ఇటీవల బాగలింగంపల్లి లోని తన ఇంటిని అమ్మేసి కొండాపూర్ లోని చండ్ర రాజేస్వర రావ్ ఫౌండేషన్ వృద్ధాప్య కేంద్రంలో చేరారు. బాగలింగంపల్లి లో చక చకా తిరుగుతూ అన్ని పనులూ చేసుకుటూ తిరిగేవారు.
ఓ రోజు హఠాత్తుగా నిర్ణయం తీసుకుని ఇల్లు అమ్మేసి కొండాపూర్ వచ్చేసారు.
భూమిక ఆఫీసు ఉన్నది బాగలింగంపల్లి లోనే కాబట్టి తరచుగా ఆఫీసుకు వచ్చేసేవారు.నేనూ రెగ్యులర్ గా వాళ్ళ ఇంటికెళ్ళేదాన్ని.
ఆవిడ షిఫ్ట్ అయ్యాకా ఒక సారి వెళ్ళాను కానీ ఆవిడ అప్పటికి రూం సర్దుకోలేదు.
ఈ రోజు సాయంత్రం చల్లగా వాన పడుతున్నవేళ చాయా దేవి గారిని చూడ్డానికి వెళ్ళి నా కళ్ళను నేను నమ్మలేక పోయాను.
తన రూం నూ ఎంత  అద్భుతంగా అలంకరించుకున్నారో మీరే చూడండి.
ఎనభైలలోకి ప్రవేశిస్తున్న ఆవిడ  కళా హృదయం,సృజనాత్మక శక్తికి జేజే లు చెప్పి తీరాలి.
అక్కడికెళ్ళిన ఈ నెల రోజుల్లో ఆవిడ ఎన్నో బొమ్మలు చేసారు.మదర్ థెరిస్సా,రవీంద్రనాధ్ ఠాగూర్,గురజాడ లాంటి ప్రముఖుల బొమ్మలు తయారు చేసారు.
చాయా దేవి గారు చేటలో చేసిన చాట భారతం చూసి తీరాలి.
కేంద్రం వారిచ్చిన పరుపును చూడండి ఎంత కళాత్మకంగా అలంకరించారో.
తన రూం ముందు తన పేరు,పోస్ట్ బాక్ష్ చూడండి.
స్పూర్తిదాయకమైన ఆవిడ జీవన శైలి అబ్బురపరుస్తుంది.అనుసరించాలనిపిస్తుంది.
నాకు ఎంతో ఆత్మీయురాలైన చాయా దేవి గారితో అందమైన ఆవిడ గదిలో ఓ గంట సేపు గడిపి నేను మా ఇంటికి బయలుదేరాను.
కొంత మంది తామెక్కడున్నా పరిసరాలను తమకు కనుగుణంగా మలుచుకుంటారు.
అలాంటి వారిలో అబ్బూరి వారు అగ్రగణ్యులు.








9 comments:

శ్రీలలిత said...

అద్భుతం...

nsmurty said...

సత్యవతి గారూ,
అద్భుతం. కొందరు పరిసరాలకి ఒదిగిపోతారు. అదొక రకమైన కళ. దానికి వ్యక్తిలో మార్పు కావాలి. కొందరు ఎక్కడున్నా పరిసరాలని తమకు అనుగుణంగా మలుచుకుంటారు. దానికి వ్యక్తిగత క్రమశిక్షణ, నేర్పు కావాలి. మీరు చెప్పినమాట సత్యం. కొందరిని అనుసరించవలసిందే. అలాంటివాళ్ళు అరుదుగా కనిపిస్తారు.
అభివాదములతో

రాజ్యలక్ష్మి.N said...

"కొంత మంది తామెక్కడున్నా పరిసరాలను తమకు కనుగుణంగా మలుచుకుంటారు."

నిజమేనండీ అలా వుండగలగటం కూడా ఒక అదృష్టమేమో..
మాకు కూడా అందమైన ఆ పరిసరాలను చూపించినందుకు థాంక్సండీ..

జ్ఞాన ప్రసూన said...

chaayaadevigaaru aasramaaniki vellaaraa? alaati vyaktulu aasramamlo vundatam aasramaanike gouravam. US vachchemundu aameni kalavaalanukonnanu kani kudaraledu. ivaala aameni,bommalni chooste haappygaa anipinchindi.satyavati garu thanks

మరువం ఉష said...

సత్యవతి గారూ, ఎప్పుడు ఏ ఊసు విన్నా అపురూపమే ఛాయాదేవి గార్ని గూర్చి.

సామాన్య said...

హోం కి వెళ్ళే ముందు చాయా దేవి గారితో మాట్లాడాను .హైదరాబాద్ కి వచ్చినప్పుడు కలవాలి అనుకున్నా .మీ ఫోటోస్ చూడగానే వెళ్లి చూసిన ఫీల్ కలిగింది. ఆ రూం చూడగానే సెంట్రల్ యునివర్సిటీ లో నా రూం గుర్తొచ్చింది. మనం హాస్టల్ కి వెళ్ళినట్టే అమ్మ హాస్టల్ కి వెళ్ళినట్లు వుంది .

మేడం మా అమ్మాయి తరపు నుండి మీకు కృతజ్ఞతలు .దాని కొత్త ఫాలోయర్ ఎవరో ,ఎంత గొప్ప వారో చెప్పాను .చాలా ఆనంద పడింది . థాంక్ యు .

Sushumna Rao said...

"ఈ లోకం లో ఉన్నదంతా నాకు వ్యతిరేకం, ఉన్న వాళ్ళంతా నాకు శతృవులే,అసలు నాకు మంచిచేసే వాళ్ళే నా మంచి ని కోరుకునే వాళ్ళూ లేనే లేరు ఈ లోకం పాడు లోకం" అని అనుక్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తిట్టీ పోస్తూ కాలాన్ని వృధా చేసుకునే ఎంతో మందికి చేరాల్సిన గొప్ప పోస్ట్ ఇది సత్యవతి గారు! అలాగే మీరన్నట్టూ" కొంత మంది తామెక్కడున్నా పరిసరాలను తమకు కనుగుణంగా మలుచుకుంటూ ఉంటారు" అలాంటి వారిలో అబ్బూరీ ఒకరు. ఆవిడ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం!

Ramani Rao said...

చాలా చాలా చాలా బాగుంది ఆవిడ జీవన శైలి. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేది కూడా.. నాకు అన్నిటికన్నా నచ్చినది చాట భారతం, రూం ముందు తనపేరు పోస్ట్ బాక్స్ అలంకరణ

"కొంత మంది తామెక్కడున్నా పరిసరాలను తమకు కనుగుణంగా మలుచుకుంటారు."
_________________________

yes 100% true

PRASANTH ABBURI said...

ma bamagaru ki adbootha maina kala hrudhyam undhi. naenu vala intilo chala chusanu. avada ki manavadu ainandhu ku garvapaduthuna :) :) ma bama grau ni intha baga internet dwahara chupinanduku BOOMIKA PATHRIKA valaki dhanayavadhalu

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...