Sunday, June 26, 2011

జైళ్ళతో నా అనుభవాలు.


నేను చాలా కాలంగా వివిధ జైళ్ళను సందర్శిస్తూ ఉన్నాను.
మొట్టమొదట నేను వెళ్ళిన జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్.
ఆ తర్వాత సందర్శించినది ఢిల్లీలోని ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్ జైలు.ఓ రోజంతా తీహర్ జైల్లో ఉండి మరీ చూసాను.
మూడవది విశాఖపట్టణంలోని అందమైన పరిసరాల్లో ఉండే విశాఖ సెంట్రల్ జైల్.
నాలుగవది ఇటీవలి కాలం లో రెగ్యులర్ గా విజిట్ చేస్తున్న చంచల్ గూడా మహిళా జైలు.
ఈ నాలుగు జైళ్ళ గురించీ రాయాలని చాలా కలంగా అనుకుంటున్నాను.
ఈ రోజు ఈ వారం వీక్ మేగజైన్ లో వివిఐపీ లు తీహార్ జైల్లో ఏంచేస్తున్నారు?అనే ఆసక్తికరమైన కధనం చదివాకా తీహార్ గురించి నా అనుభవాలు రాయాలనిపించింది.
నేను 1985 లో ప్రభుత్వోద్యోగుల సమ్మె సందర్భంగా అరెష్ట్ అయ్యాను కాని జైల్లో లేను.పోలీస్ కంట్రోల్ రూం లో నేరస్తుల మధ్య ఓ రాత్రి గడిపాను.మర్నాడే బెయిల్ దొరికింది కాబట్టి జైల్లో చిప్ప కూడు తినలేదు.
మొదట రాజమండ్రి జైల్లో నా అనుభవాలు రాస్తాను.

3 comments:

ఆ.సౌమ్య said...

తప్పకుండా రాయండి....జైల్లో ఉన్న వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది...మీ అనుభవాలు రాయండి.

Praveen Mandangi said...

ఆ మధ్య మావోయిస్టులు ఉదయగిరి సబ్-జెయిల్‌పై దాడి చేసి ఖైదీలు తప్పించుకుపోయినప్పుడు నాకూ, నా కెనడా స్నేహితురాలికీ మధ్య చర్చ జరిగింది. అప్పుడు నా స్నేహితురాలు ఇలా అంది "మన దేశంలో డబ్బున్నవాళ్ళు ఎలాగూ జైళ్ళకి వెళ్ళరు, వెళ్ళినా బెయిల్ మీద విడుదల అవుతారు, జైళ్ళలో ఉండేది చిల్లర నేరాలు చేసిన పేదవాళ్ళే కనుక జైలుపై దాడి చెయ్యడం తప్పుకాదు" అని. పదుల సంఖ్యలో ఖైదీలు పట్టే జైలులో వందల సంఖ్యలో ఖైదీలని పెట్టడం జరుగుతోంది. మన పాలకులకి ఖైదీలు మనుషుల్లా కాకుండా సంతల్లో లారీలు ఎక్కించబడే గొడ్లలా కనిపిస్తారు.

Praveen Mandangi said...

మహిళా ఖైదీల గురించి ఈ వీడియో తయారు చేశాను: http://videos.teluguwebmedia.in/58732816

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...