హైదరాబాద్ నగర పోలీస్ ష్టేషన్ల పరిధిలో దాదాపు 250 మంది రక్షక్ పోలీసులు పనిచేస్తున్నారు.
వీరు నాలుగు చక్రాల వాహనాల్లో, ద్విచక్ర వాహనాల్లో(వీరిని బ్లూ కోట్స్ అంటారు)
పెట్రోలింగ్,బందోబస్తు,లా అండ్ ఆర్డర్,ట్రాఫిక్ జాం మొదలైన విధుల్లో ఉంటారు.
రోడ్ల మీద సమస్యల్లో ఉన్న మహిళలు కనబడితే వారితో ఎలా వ్యవహరించాలో,వారిని ఎక్కడకు పంపాలో వీరికి తెలియదు.ఇళ్ళల్లో హింస జరుగుతున్నట్టు కనబడితే,హింసకు గురౌతున్న మహిళను ఎలా ఆదుకోవాలి,ఎక్కడకు పంపాలి అనే అవగాహన లేదు.
మహిళలతో ఎంత సున్నితంగా మెలగాలనే జెండర్ స్పృహ వీరికి అస్సలు లేదు.
గృహ హింస చట్టం గురించి గాని,రక్షణాధికారుల వ్యవస్థ గురించి కానీ,ప్రభుత్వ వసతి గృహాల గురించి గానీ వీరికి
అవగాహన లేదు.
సిటి పోలీస్ కమీషనర్ ఏ.కే ఖాన్ గారితో ఈ అంశమై చర్చినపుడు మీరు అందరూ రక్షక్ లకూ జెండర్ శిక్షణ నివ్వండి అన్నారు.
నిన్న మొదటి బాచ్ కి ట్రయినింగ్ ఇచ్చాము.అలాగే హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ,ప్రభుత్వేతర సపోర్ట్ సిష్టంస్ సమాచారంతో చిన్న బుక్ వేసి వారికి కిచ్చాము.
60 మంది పోలిసులు హాజరయ్యారు.
హాఫ్ డే ట్రయినింగ్ విజయవంతంగా జరిగింది.
6 comments:
మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో మహిళలు కేవలం 2% ఉన్నారు. 33% రిజర్వేషన్ నిబంధన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎన్నడూ అమలు కాలేదు. మగ పోలీసులకి మహిళలతో ఎలా వ్యవహరించాలో ట్రెయినింగ్ ఇస్తే ఇలా?
మీ కృషి చాలా అభినందనీయం ..రక్షణ వ్యవస్థ లో ఉన్న వారికీ స్వచ్చంద సంస్థల గురించి...కనీస విషయ పరిజ్ఞానం తెలియడం చాల అవసరం. లేకపోతే..ఆపదలలో ఉన్న మగువల పరిస్థితి.. పోలీస్ స్టేషన్ ల లో.. మరింత దారుణంగా.. మారే.. అవకాశం ఉంటుంది. మరిన్ని..తరగతులు నిర్వహించి వివరాలు పంచుకుంటారని..ఆశిస్తున్నాను. ..
పాలకులు మనుషులకు ఒకటి లేదా రెండు సంవత్సరములు ట్రైనింగ్ ఇచ్చి జంతువులుగా మార్చి ప్రజలలోకి వదిలితే మీరు వారిని మనుషులుగా మార్చుటకు ఒకటి లేదా రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తే ఏమి లాభం...?
పోలీస్ డిపార్ట్మెంట్‌లో మహిళల సంఖ్య 2% కంటే ఎక్కువ లేనప్పుడు పోలీసులకి జెండర్ ట్రెయినింగ్ ఎంత ఇస్తే ఏమి లాభం?
అంతెందుకు, మహిళా పోలీస్ స్టేషన్‌లో మగ ఎస్.ఐ.ని నియమించిన ఘటన విజయనగరంలో జరిగింది. ఈ విషయం పై అధికారులని అడిగితే తెలియక అలా చేశామని సమాధానం చెప్పారు.
జెండర్ ట్రెయినింగ్‌పై నేను వీడియో తయారు చేశాను: http://videos.teluguwebmedia.in/58708244
Post a Comment