Tuesday, June 14, 2011

ప్రేమ భాష్యం


ఒకరినొకరు ప్రేమించండి
అయితే మీ ప్రేమను ఆంక్షాగ్రస్తం కానీకండి
మీ ఇరువురి ఆత్మల తీరాల మధ్య
కదిలే సంద్రం కావాలి మీ ప్రేమ
ఒకే ప్రేమ చషకాన్ని ఒంపుకునేకన్నా
ఒకరికొరకై ఒకరు
వేర్వేరు మధుపాత్రలు
నింపుకోవడంలోనే ప్రేమ ఉన్నది
మీకున్నది చెరిసగం పంచుకు తినడంలో సౌఖ్యమున్నది
అలాగని ఒకే కంచంలో భుజించనక్కర లేదు
కలిసి సాగించే గాన న్రుత్యాలు స్రుజించే మేలిరకం హాయిలో
ఏకాంత విరహ సౌఖ్యాన్ని విస్మరిచరాదు సుమా!
ఒకే శబ్ద సౌందర్యాన్ని నిర్మించే వీణ తీగలు సైతం
విడి విడిగానే స్పందిస్తాయి కదా!
మనసు విప్పి మాటలు చల్లుకోవడం మహత్తరంగా ఉంటుంది
కానీ మనసు నిచ్చి పుచ్చుకోవడం అన్నది అర్ధం లేని మాట.
మనందరి ఉద్వేగాలకు,ఉల్లాసాలకు మూలాధారమైన
గుండె మనుగడ మన చేతిలో లేదన్నది నిజం కదా!
ఒకరికొకరు తోడయి సమస్యల సహారాను
సరదా సమీరాలను కలిసి స్వీకరించండి
అయితే
నిలిపి ఉంచే మూల స్పంభాలు సైతం
విడి విడిగానే ఉంటాయి చూసారు కదా!
ఆకుపచ్చని ఆరోగ్యాన్ని వెదజల్లే మర్రి చెట్టు
వేప వ్రుక్షం పరస్పర చాయలో పరిమళాలు ఒలికించవు కదా!

- ఖలీల్ జీబ్రాన్

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

మంచి పరిచయం...మేడం.. ధన్యవాదములు.

Anonymous said...

ప్రేమ ప్రేమిస్తుందంతే ! తర్కించదు, ఆలోచించదు. తన గురించి అసలు ఆలోచించదు. అందుకే అది ప్రేమ అన్నారు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...