మనీషా మహానందంగా స్కూల్ కి

మనీషా ని ఈ రోజు 8200/-రూపాయలు ఫీజు కట్టి కీస్ హై స్కూల్ లో 7 వ క్లాస్ లో జాయిన్ చేసాను.
ఆ పిల్ల ముఖంలో కనబడిన సంతోషానికి ఖరీదు కట్టే శక్తి నాకు లేదు.
సంతోషం చిప్పిల్లే ఆ ముఖం లోని వెలుతురు నాకు ఎనలేని తృప్తినిచ్చింది.
నేను పిల్లల్ని కనలేదు.పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన అనుభవం లేదు.ఎంతో మందికి చదువు కోసం సహాయం చేసాను కానీ నేనే ఒక పిల్లని ఈ రోజు జాయిన్ చేస్తుంటే గమ్మత్తుగా అనిపించింది.
నేను మనీషాని జాయిన్ చేసి బయట కొస్తుంటే ఎవరో ఆవిడ మా పాపకి కూడా ఫీజ్ కడతారా అని అడిగినపుడు నా నోట మాట రాలేదు.
ఎంత మంది పిల్లలు చదువుకు దూరమౌతున్నారో తలుచుకుంటే దుఖం వస్తుంది
ప్రభుత్వాలు చేయాల్సిన పనులు వ్యక్తులుగా ఎంత మంది చెయ్యగలుగుతారు??

Comments

శ్రీ said…
మంచి పని చేసారు.
vanajavanamali said…
సత్యవతి గారు ..చాలా మంచి పని చేసారు. మీ ఆనందం ..ఆనందంగా ఉంది.
excellent...great job!
ప్రతి మనిషికి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి, అవే మంచి చేయలనుకోవడం, మంచి చేయడం ... అందులో మీరు రెండో కోవకి చెందారు.. ఇక పోతే చాలా మందికి సమాజానికి ఎంతో కొంత సహాయం చేయలనుకొంటారు. కాని అది ఏ రకముగా చేయాలో అర్దం కాని పరిస్దితిలో ఉండిపోతారు. అందులో కొంత మంది మాత్రమే తాము అనుకొన్నది చేతల రూపంలో చూపిస్తారు... నిజానికి ఎవరిని ఏ విషయములోను గొప్ప అని అనుకోను.... కాని ఈ రోజు మిమ్మల్లి మాత్రము గ్రేట్ అని అనకుండా ఉండలేకపోతున్నాను... ఎందుకో తెలుసా మీరు చేసిన ఒక సహయము గురించి.... అది చిన్నదవని, పెద్దదవని..... పరుల కోసము చేసేది ఏదైనా అది నిజముగా దేవుడికి దగ్గరకు వెళ్ళినట్టే.......
Swathi said…
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాలయాపన చెయ్యకుండా మీరు చేసిన ఈ పని మరెందరికో మచి దారి చూపినట్టు వుండి. మీకు మనస్పూర్తి గా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనీషా కి బంగారు భవిష్యత్తు వుండాలని మనసార కోరుకుంటున్నాను.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం