Tuesday, June 21, 2011

ఇదేం ప్రేమ రోగం!అంటు రోగం లా ఉంది.

ఈ రోజు ఉదయం నుండి భూమిక హెల్ప్ లైన్ కి వచ్చిన కేసులు చూస్తుంటే,వింటుంటే మనసు పచ్చి పుండు లాగా సలుపుతోంది.
నాకు డిప్రెషన్ వచ్చేలా ఉంది.
ఉదయాన్నే ఓ భార్యా భర్తా ఇద్దరు చిన్నపిల్లలు వచ్చారు.
"నా కూతురిని అత్తింట్లో ఉరేసి చంపేసారు.నాలుగేళ్ళ ఈ పిల్లవాడు కళ్ళారా అంతా చూసాడు.ఎలా చంపారో పోలీసులకు చెప్పాడు.మహిళా పోలీస్ ష్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన నాలుగు రోజుల్లో చంపేసారు.నా కూతురు మమ్మల్ని ఎదిరించి ప్రేమ పెళ్ళి చేసుకుంది."
అమ్మమ్మ,తాతయ్యల వేపు చూస్తూ కూర్చున్న చిన్నారులు.
రెండు గంటలు గడిచాక ఓ తల్లి కూతురూ వచ్చారు.కూతురుకి 20 ఏళ్ళుంటాయ్.6 నెలల గర్భంతో ఉంది.
ఆరు నెలల (అప్పటికే గర్భం)క్రితం ప్రేమించిన వాడిని దండల పెళ్ళి చేసుకుంది.
నువ్వు నాకిపుడొద్దు.నాకు ఇంకో అమ్మాయి మీద ప్రేమ కలిగింది.నేను ఆమె ని పెళ్ళి చేసుకుంటాను అని ఆ మొగుడు ఈమెని గెంటేసాడు.
మధ్యహ్నం దాటాక హెల్ప్ లైన్ కి ఓ కాల్ వచ్చింది.ఓ తల్లి మాట్లాడింది.
నా కూతురు ప్రేమ పెళ్ళి చేసుకుంది.ఇద్దరు పిల్లలు.నా అల్లుడు మా పక్క ఊర్లో ఉండే మరో ఆమెని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడు.ఆమెకి ముగ్గురు పిల్లలు.పెళ్ళాన్ని,పిల్లల్ని వదిలేసి నా అల్లుడు మొగుణ్ణి ముగ్గురు పిల్లల్ల్ని వదిలేసి ఆమే ఊరొదిలి వెళ్ళిపోయారు.
నా సమస్య ఏంటంటే నా అల్లుడు ఫోన్ చేసి నా కూతురిని రమ్మంటున్నాడు.
నాకు నీ మీదా ప్రేమ ఉంది.ఆమెనీ ప్రేమిస్తున్నాను.నువ్వు వచ్చెయ్ అంటున్నాడు.ఏం చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు"
మరో భయంకరమైన కేసు.ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ భర్త తన భార్య వక్షోజాలు చాలా పెద్దగా ఉన్నాయని వేధించి ఆమెకి ప్లాస్టిక్ సర్జరి చేయించాడు.
ఆ సర్జరి తర్వాత ఏమయ్యిదో,ఏ మందులు వికటించాయో ఆమె రెండు కిడ్నీలు పాడైపోయాయి.
డయాలసిస్ లేకుండా బతకలేని స్థితికొచ్చింది.
ఆమె అల్లంటి కండిషన్ లో వదిలేసి మొగుడూ హైదరాబాద్ వచ్చేసాడు.
ఆ పిల్ల పెళ్ళినాటీ ఫోటోలు చూపించి ఇంత బావుండేదాన్ని.
ఎంత ప్రేమించానో వీడిని అంటూ ఏడ్చింది.
రోజూ ఇలాగే మా చెవుల్లోను,మా కళ్ళ ముందు దుఖ సముద్రాలు పొంగిపొర్లుతుంటాయి.
గాయాల నదులు ప్రవహిస్తూంటాయి.
ప్రేమ ఇంత దుఖాన్ని ఇస్తుందా??
ఇదేం ప్రేమో అర్ధం కాక జుట్టు పీక్కోవాల్సి వస్తోంది.
ప్రేమలో,ప్రేమ పెళ్ళిళ్ళల్లో కూడా స్త్రీలు ఇంతటి భయానక హింసని అనుభవించడం నన్ను డిప్రషన్ లో ముంచుతోంది.

22 comments:

శరత్ కాలమ్ said...

ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం.

Anonymous said...

హ్మ్....

Praveen Mandangi said...

మా తాతగారి ఊరి కరణం వాళ్ళ అబ్బాయి తన సొంత మరదలిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన తరువాత కట్నం కోసం వేధించాడు.

Anonymous said...

ప్రేమ ఒక భ్రాంతి - పెళ్ళి ఒక వాస్తవం- జీవితం ఒక సత్యం.

SrIRam

KumarN said...

కేవలం కామెంట్ల సెక్షన్ లో ప్రేమ-పెళ్ళి మీద వ్యాక్యాలు చూసి, ఇదేదో జోక్స్ లాగున్నాయి అని నాకు తోచిన జోక్ చెప్దామని ఇటొచ్చాను కాని, ఈ పోస్ట్ చదివేసరికి హృదయం బాధతో నిండిపోయింది.

మీరు చేస్తున్న battles కీ, హెల్ప్ కీ ఆ దేవుడు సదా అండగా ఉండాలని కోరుకుంటూ....

ఆ.సౌమ్య said...

ప్చ్....ఏం చెప్పాలో అర్థం కావట్లేదు :(

Praveen Mandangi said...

కాలేజి ప్రేమలు - ఒక ట్రాష్ : http://radicalfeminism.stalin-mao.in/50492442

Praveen Mandangi said...

సొంత మరదల్ని పెళ్ళి చేసుకుని కట్నం కోసం కొట్టిన కరణం గారి అబ్బాయి గురించి ఇందాక చెప్పానే, అతను మా పక్క వీధిలోనే ఉంటాడు. వాడి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్నా వాడు తన భార్యని ఎన్నడూ ప్రేమగా చూడలేదు. ఇంటిలో భార్య ఉండగా పక్కింటి స్త్రీలపై ఆకలి చూపులు చూడడం వంటివి చేసేవాడు. వాడు ఓసారి వాళ్ళ పక్కింటావిడని ఏడిపించాడని ఆవిడ భర్త వాడి పెంపుడు కుక్క పిల్లని తీసుకెళ్ళి దాచెయ్యడం, వాడికీ, పక్కింటాయనకీ మధ్య గొడవ జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం, మా ఊరి కరణం గారి అబ్బాయే కదా అని మా నాన్నగారు పోలీసులని రిక్వెస్ట్ చేసి రాజీ కుదిర్చి వాడ్ని విడిపించడం జరిగింది. ప్రేమించి పెళ్ళి చేసుకుని పెళ్ళి తరువాత పక్క దారి పట్టిన ఆ చెత్తగాడికి మా నాన్నగారు ఎందుకు సపోర్ట్ ఇచ్చారా అని నాకు అప్పుడే అనిపించింది.

karthik said...

>>ఎంత ప్రేమించానో వీడిని అంటూ ఏడ్చింది
నేను మనుషుల మధ్యనే ఉన్నానా అని డౌట్ వస్తోంది :( :(

వెన్నెల్లో హాయ్ హాయ్ said...

u r the inspiring person to me. don't be depressed.

శ్రీనివాస్ said...

ఆడవాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి మాట్లాడేస్కుని అలా చేసిన వాళ్ళలో ఒక్కడిని పట్టుకుని చార్మినార్ సెంటర్ లో ఒక వందమంది ఆడాళ్ళు కాళ్ళతో తొక్కి తొక్కి చంపేస్తే ముందు ముందు చేయాలనుకున్న వాళ్ళలో కనీసం 60% మంది భయపడతారు. అలా ఏదైనా ప్లాన్ చేయండి మా వైపు నుండి సంపూర్ణ సహకారం అందిస్తాం. ఎంతకాలం రాసుకుని ,చదువుకుని బాధపడతాము చెప్పండి.

Praveen Mandangi said...

ప్రేమ మధురం, ప్రియుడు కఠినం
ప్రేమ సుందర స్వప్నం, పెళ్ళి భయానక అనుభవం
ప్రేమించేటప్పుడు గుర్తు రావు కులం కట్నాలు, పెళ్ళైన తరువాత గుర్తొస్తాయి అవన్నీ
ప్రేమ నాటకం, పెళ్ళి అనేది నాటకానికి ముగింపు

rajiv raghav said...

దీనిపై నా అభిప్రాయాలను నా బ్లాగ్ లో చూడగలరు.....

వనజ తాతినేని/VanajaTatineni said...

ప్రేమ అనేది అబద్దం. పెళ్లి అనేది జీవితం లో..ఓ..భాగం. పెళ్లి అనేది జీవితాంతం అనుకున్న వారి కి.. అది అబద్దం అని ఇలాటి సంఘటనలు చెబుతుంటే హృదయం బండబారిపోతుంది. మనుషులకన్నా జీవితాన్ని జీవనాన్ని ప్రేమించడం నేర్చుకోవాలని చెప్పడం బాగుంటుంది.కదా.

లలిత (తెలుగు4కిడ్స్) said...

"మనుషులకన్నా జీవితాన్ని జీవనాన్ని ప్రేమించడం నేర్చుకోవాలని చెప్పడం బాగుంటుంది.కదా."
ఈ మాటలు చాలా బాగా చెప్పారు.
ఒక్కసారిగా తెరలు తొలిగిపోయి దారి స్పష్టంగా కనిపిస్తున్నట్టు అనిపించింది ఈ మాటలు చదువుతుంటే.
మంత్రంలా మననం చేసుకుంటున్నాను చదివినప్పట్నుంచీ.

కృష్ణప్రియ said...

నిజంగానే.. చాలా బాధ గా అనిపిస్తోంది మీరు చెప్పిన వారి గురించి ఆలోచిస్తుంటే.. ముఖ్యం గా చంపబడ్డ/డయాలసిస్ మీద బ్రతుకు తున్న అమ్మాయిల కథ.

ఇక మోసగింపబడి, వదిలి పారిపోయిన భర్తలు ఉన్న మిగతా ఇద్దరికీ కనీసం మిగిలిన జీవితం ఉంది.. ఆ భర్తలు ఉన్నా, తుమ్మితే ఊడే ముక్కుల్లాంటి వారే.. I am glad they left already. వారికి మీరిచ్చే సలహా/చేయూత గురించి మీకు అభ్యంతరం లేకపోతే తెలుసుకోవాలని ఉంది.

Anonymous said...

I beg to differ.

Loving life without loving people is pure fiction and next to impossible. Those loving their own life without loving those around them will soon be found out and shunned by others.

Love is not object-specific. Once it is there, it will be there on everybody and everything. Especially, you can' t love and enjoy your life without loving the people around you. Most commit suicide after they find themselves absolutely unable to love or being loved/ wanted by anyone around them.

Mauli said...

ఈ ముగ్గురు కాకు౦డా ఇ౦కె౦దరు ఉన్నారో. కాని ఇలా బాధపడుతూ మగవాళ్ళనే ని౦దిస్తూ పోదామా?

lalithag said...

"Loving life without loving people is pure fiction and next to impossible."
I thought it was the other way.
To me it did not sound like loving self.
When we love life, value life, the way we love people will be better in my opinion. In the name of loving people, we are hearing about incidents of taking other's life and one's own life and losing one's self.
It is said "love does not hurt."
In all the cases above, it does not seem like love from the other person.
Those who think they have loved and are victims of love - thinking from their perspective, it made sense to me that when anyone thinks they are in love, they have to understand their feelings from the perpsective of loving life.
When we discuss 'expressions', we can go on and on arguing about them.
I wrote what I felt. For some reason, it borught clarity to my thoughts.
All this discussion does nothing tohelp those poor victims Satyavati garu mentioned in the article.
While she is actively working on such cases, the information she shared here serves the purpose of making us think about life and people around us and hopefully understand better and participate better. This is how it affects me as a reader. This is my opinion.

Anonymous said...

ఇది ఆడా మగా గొడవ కాదు. ఈ కాలపు సమాజ విలువలకు అనుగుణంగానే నడుచుకుంటున్నారు అందరూ ! అంతే !

Praveen Mandangi said...

ఇది ఆడ-మగ ప్రశ్నే నాయనా. ఒకవేళ ఆడది మగవాడ్ని మోసం చేస్తే "కలికాలం, కలికాలం, ఆడవాళ్ళు బరితెగించేస్తున్నారు" అని అంటారు.

maa godavari said...

నా ఆవేదనని అర్ధం చేసుకుని స్పందించిన మితృలందరికీ ధన్యవాదాలు.
నేను ఈ టపా రాయడం వెనక ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న విపరీత ధోరణులు, ఆ పదాన్ని బ్రష్టు పట్టిస్తున్న వైనం చాలా దుఖాన్ని కలిగిస్తోంది.
ఇంక పెళ్ళి పేరుతో ఈ రోజు యువత జూదం ఆడుతుందేమో అనిపిస్తోంది.
దేని పట్లా సీరియస్ నెస్ ఉండడం లేదు.
ఒక ఆదర్శం,ఒక అభ్యుదయం,ఒక ఆశయం లేని యువతను మన విద్యా వ్యవస్థ తయారు చేసి సమాజం లోకి వదిలేస్తోంది.మానవ సంబంధాల పట్ల గౌరవంలేని, ఆర్దృత లేని పిల్లల్ల్ని పెంచుతున్నాం మనమే. ప్రతీదీ టేకిట్ ఈజీ.ప్రేమని,పెళ్ళిని,భార్యని,భర్తని,సమాజాన్ని దేనినీ సీరియ గా పట్టించుకోని,పట్టించుకోడానికి ఇష్టపడని మనుష్యుల్ని తయారు చేస్తోంది మీడియా.
నిజానికి ఈ రోజు పిల్లలు అన్నింటికి ఎక్స్ పోజ్ అవుతున్నారు.అయితే ఈ ఎక్స్పోజర్ వాళ్ళకి జీవితాన్ని నిర్వహించుకునే కళని అందివ్వడం లేదు.
జీవితాన్ని ప్రేమించడం,చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించడం,సమాజం పట్ల తన బాధ్యతని ప్రేమించడం,మానవ సంబంధాల పట్ల బాధ్యతగా మెలగడం- ఈ చదువు వాళ్ళకు అండం లేదు.
వాళ్ళకి తేలిగ్గా అందుబాటులో ఉన్నవి వస్తు సముదాయమే.బ్రాండెడ్ వస్తువులు, కొత్త కొత్త సెల్ ఫోన్ లు,మోటర్ బైకులు పెద్ద పెద్ద కార్లు ఒక వర్గానికి తేలిగ్గా అందుబాటులోకి వచ్చాయి.
వీళ్ళకి మనుష్యుల మీద కంటే వస్తువుల మీదే ప్రేమ.
గ్రామ ప్రాంతాలకి కూడా ఇది పాకుతోంది.
అదే నా బాధ.
@కృష్ణ ప్రియ గారూ హెల్ప్ లైన్ పని చేసే పద్ధతి గురించి మళ్ళీ రాస్తాను.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...