Saturday, August 7, 2010

నిన్న రాత్రి నేనో కల కన్నాను

ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల
నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం
చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి
ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద
నేనొక అడుగు ముందుకెయ్య లేదు
నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు
సమానంగా అడుగుల లయలో
ఏకబిగిన నడుస్తున్నాం
ఏవేవో అడ్డంకులులు
ఎవరెవరివో ఆర్తనాదాలు
సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు
ఆడపిల్లల శవాల దృశ్యాలు
హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద
మగమౄగాల దాడులు
చదువుకునే చోట చీడపురుగుల చీదరం
ఇంటిబయట ఎంతటి అభద్రతో
ఇంటి నాలుగ్గోడల మధ్య అంతే అభద్రత
నువ్వూ నేనూ చేతిలో చెయ్యేసి
నడుస్తున్నాం కదా
మన మధ్య ఇటీవలి కాలంలో
ఇంత సయోధ్య ఎలా కుదిరిందో ఇంత ప్రజాస్వామిక వాతావరణం
ఎలా సంభవించిందో
మన మాటల్లోనే దొర్లుతోంది
హింస లేని జీవితమంటే
ఇంటా బయటా ప్రజాస్వామిక సంబంధాలుండాలంటే
అన్నింటా సమాత్వం నెలకొల్పాలంటే
అది నువ్వూ నేనూ కలిసి సాధించాల్సిందే
నన్నొదిలేసి నువ్వెళ్ళిపోయినా
నిన్నొదిలేసి నేనెళ్ళిపోయినా
మనం ఒంటరి దీవులమే అవుతాం
ఎవరికి వారౌ స్వార్ధపరులమే అవుతాం
మనం పక్క పక్కనే నడుస్తూ
ఎన్ని కలలు కంటున్నాం
ఎన్ని కొత్త ఆలోచనలు చెస్తున్నాం
అన్నింటా సమానత్వం అని నేనంటుంటే
నువ్వు సై అనడం
అబ్బో నీ మీద నా కెంత ప్రేమని
నువ్వింత మారాక నాతో సై అన్నాక
అంతా జాంతా నై అనేచోట
నువ్వింత ప్రజాస్వామికంగా మారి
పురుషస్వామ్యం పడగ మీద కొట్టాకా
నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించడమే నా పని
ఇంటిలో, పొలంలో,ఫ్యాక్టరీలో
ఒక్కటేమిటి స్థిర చర వనరుల్లో
సగభాగమివ్వడడమే
అన్ని రకాల హింసలకు చెల్లు చీటి
అని నువ్వంటుంటే నా చెవుల్ని
నేనే నమ్మలేకపోయాను
నిన్ను వాటేసుకుని ముద్దుపెట్టుకోకుండా ఉండగననా
నీ మాటే నా మాటా
పద పోదం దండోరా వెయ్యడానికి
నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను

అన్ని వనరుల్లో సమాన వాటా
అన్ని రిజిస్ట్రేషన్లల్లో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే
ఇదే మన కొత్త నినాదం
ఇదే మన సరికొత్త ఎజండా

28 comments:

శ్రీలలిత said...

కలిసి నడుస్తున్నామని వచ్చినది కలే
కలిసి నడవగలమన్నది ఒక భ్రమ
ఏమో..తరవాతి తరం నడవగలదేమో
కాని ఈ తరం మటుకు కలగనడమే చేయగల పని
లేకుంటే లేమల పట్ల ఇన్నిరకాల హింసలా...
నిజంగానే ఈ కల నిజమయితే
భూలోకమే స్వర్గ మయిపోదా..
కాని..
ఆశ వదలొద్దు
ప్రయత్నిద్దాం...
ఎప్పటికైనా...ఇంకెప్పటికైనా
కలిసి నడుద్దామనే ప్రయత్నిద్దాం..
మనం నలిగిపోయినా సరే
తర్వాతి తరానికి నున్నటి బాటను వేద్దాం...

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఆస్తి, ఆదాయంలాంటివి వ్యక్తిగతం ఏ ప్రజాస్వామ్య దేశంలో నైనా ! ఒకఱి కష్టార్జితమైన ఆస్తినీ, ఆదాయాన్నీ వారు బతికుండగానే ఇంకొకఱి పేరిట బలవంతంగా పెట్టమని/ పంచుకోమనీ చెప్పే దేశాలు గానీ చట్టాలు గానీ ఎక్కడా లేవు. ఎందుకంటే అది వ్యక్తిస్వేచ్ఛకి విరుద్ధం. అది ఆడవాళ్ళ స్వేచ్ఛకూడా విరుద్ధమే. విడాకులు తీసుకుంటే అప్పుడేం చేయాలి ?

నాకొక చిన్నసందేహం. మీరు నిజంగానే స్త్రీ పురుషుడితో సమానమని భావిస్తున్నారా ? అలా భావించేట్లయితే మగవాడి సంపాదన కోసం, ఆస్తుల కోసం ఎందుకు ఆశపడ్డం ? మీక్కావాల్సినది మీరే (అడవాళ్ళే) కష్టపడి సంపాదించుకోవచ్చు కదా ? సంపాదించుకోగలరు కదా ? ఈ వివాహవ్యవస్థ ఈ రూపంలో ఉన్నంతకాలమే ఈ ఆస్తుల గోల. అసలు వివాహాలే మానేసే రోజొస్తుంది, జర్మనీలో మాదిరి. అప్పుడెవఱి ఆస్తుల కోసం ఆశపడతారు ? ఎలా ఆశపడతారు ?

చూడబోతే ఫెమినిస్టులకు మగవాడి ఆదాయం మీదా ఆస్తుల మీదా ఉన్న ప్రేమ అతని మీద లేదనిపిస్తున్నది. అతను ఏ శంకరగిరిమాన్యాలు పట్టినా ఫర్వాలేదు. ఆడవాళ్ళకి మాత్రం అతని ద్వారా అస్తులొచ్చిపడాలి. ఎంత స్వార్థం ! ఎంత అమానుషం. మగవాడి జీవితంలో ఒక్క భార్యే కాదు, ఎంతోమంది ఆశ్రితులుంటారు. తల్లి, తండ్రి, చెల్లి, అన్నదమ్ములు, స్నేహితులు, సేవకులు - వాళ్ళందఱినీ కాదనుకొని భార్య ఒక్కదానితోనే అన్నీ పంచుకోవాలా ? ఎంత సంకుచిత దృష్టి ! మగవాడి సర్కిల్, పరిధి పట్ల ఎంత చులకనభావం !

మీ వయసెంతో నాకు తెలియదు. మీరు ఇంత కాలం జీవించి ఏం జీవితసారం గ్రహించారో నాకు తెలియదు. స్త్రీపురుషులు అన్యోన్యంగా ఉండడానికి కావాల్సినవి సమానత్వాలూ, ఆస్తులూ కావు. అవి వారి మధ్య అగాధాల్ని మఱింత పెంచుతాయి. అసలు కావల్సినవి ఒకఱి మీద ఒకరు బేషరతుగా ఆధారపడ్డం. యథాలాపంగా ప్రేమించడం. ఆ ప్రేమని ఎలా పెంచాలో అది ఆలోచించండి. ఆస్తులు పెంచాలని కాదు.

--తాడేపల్లి

Anonymous said...

మీ టపాని తాడేపల్లిగారు అర్థం చేసుకున్న విధానం నిజమేనా ? ఏం లేదు, నాకీ టపా అర్థం కాక అడుగుతున్నానంతే !

మగవాళ్ళు ఆడవాళ్ళని కట్నం అడిగితే అది నేరం అన్నారు. మరి మీరిప్పుడు ఏకంగా ఆడవాళ్ళకి మగవాళ్ళ ఆస్తిలో సగం రాసిచ్చేస్తే బావుంటుందని కలలు గంటున్నారు. ఇది నేరం కాదా ? నేననుకోవడం ఇలాంటి ప్రపోజల్స్ ఎవఱికీ మంచివి కాదని. చాలామంది మగవాళ్ళు ఉద్యోగాలు మానేసి భార్య ఆస్తి పెట్టుకొని బతికేసే రోజులొస్తాయి.

Anonymous said...

బతికేసే రోజుల సంగతలా ఉంచండి రెడ్డిగారూ ! ఆ ఆస్తి కోసం ఆ ఆడదాన్ని/ మగవాణ్ణి రెండోవారు, లేదా వాళ్ళ బంధువులు చంపేసే రోజులొస్తాయేమో ఎవరికి తెలుసు ! దయచేశి మా కోసం కొంచెం మంచి కలలు కనండి సత్యవతిగారూ !

maa godavari said...

నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను
అన్ని వనరుల్లో సమాన వాటా

Anonymous said...

ఏమిటో, ఏ కాలంలో ఉన్నారో మీరు ? పెళ్ళికే గ్యారంటీ లేని రోజులివి. పెళ్ళయి అయిదేళ్ళు కాకుండానే నూటికి పాతికమంది విడాకులు తీసుకుంటున్నారీ దేశంలో ! ఏ భరోసాతో సమానంగా పంచుకుంటారు ? ఎవరి బతుకు వాళ్ళది. ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి. ఎవరి ఆదాయాలు వాళ్ళవి. ఎవరి ఆస్తులు వాళ్ళవి.

ఆర్థికవ్యవస్థ కూడా స్థిరంగా ఉండట్లేదు. ఈరోజున్న కంపెనీలు రేపుండడం లేదు. ఈ రోజున్న ఉద్యోగం రేపు కూడా ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ డోలాయమానానికి తోడు మన సొంత వ్యక్తిగత ఆస్తుల్లోను ఆదాయాల్లోను బతికుండగానే పార్ట్‌నర్లు కూడానా ? ఈ పార్ట్‌నర్లు మన దగ్గర తినేవాల్లే తప్ప మనకు పెట్టేవాళ్ళు కారు. వాళ్ళ చేతుల్లోకి అవి వస్తే వాళ్ళ బుద్ధి మారిపోదనే గ్యారంటీ ఏమీ లేదు.

చెరిసగం అనుకోవడం - భార్యాభర్తలు వాళ్ళలో వాళ్ళు వాళ్ళవాళ్ళ కన్వీనియన్సు ప్రకారం, కన్విక్షన్ ప్రకారం పరస్పర అవగాహనతో దూరదృష్టితో ప్రణాళిక వేసుకోవాల్సినది. ఒకరు చెప్తే జరిగేది కాదు. అది కల్చరల్ అవ్వాలి. లీగల్ ? లాభం లేదు. మగవాణ్ణి ఒక ఆడదానికి కొడుకుగానో, ఇంకొక ఆడదానికి భర్తగానో చూసే ధోరణి సరైనది కాదు. వీటన్నింటికంటే ముందు అతనొక రక్తమాంసాలు గల ప్రత్యేక వ్యక్తి. ఒక మనిషి. అన్ని మానవహక్కులూ, పౌరహక్కులూ గల ఎంటిటీ. అతని కష్టసుఖాల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అతని సుఖసంతోషాల మీదనే ఆడదాని సుఖసంతోషాలు ఆధారపడి ఉన్నాయి ఇప్పటికీ.

Your dream is bound to be a failure. Because the family is just a family but not a chit fund company or a political party. Family should run on love only, but not on individuals' claim to rights or financial dividends. Factors other than love will destroy the family. Money should be incidental to the family life. It should not be the main criterion or condition. The average male is already fed up with the outside world which is extremely commercial and therefore exploitative. Now, his only source of solace, peace and happiness is his wife and children. If these people too turn commercial with the help of laws, he has nowhere to go. He will simply stop marrying and procreating anyone. It is already happening in European countries.

అయినా అందరి మీదా ఒకే రకమైన విలువలు రుద్దడానికి మనమెవరం ? కుటుంబవిషయాల్లో సమాజజోక్యం లేకపోతే బావుంటుంది. (ప్రభుత్వజోక్యం కూడా). అప్పుడే ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా నిజమైన వ్యక్తిస్వేచ్ఛ వికసించేది. మన వ్యక్తిగత విషయాల్లో సమాజజోక్యం ఉన్నంతకాలమూ మనం ఇంకా పదహారో శతాబ్దంలో బతుకుతున్నట్లే లెక్క.

maa godavari said...

"నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను
అన్ని వనరుల్లో సమాన వాటా"

నేను మగవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళకి రాసిమ్మని ఎక్కడ అన్నానో కొంచం చెబుతారా?
అయినా ఆస్తులు,వనరులు,ఇళ్ళు, వాకిళ్ళు మగవాడొక్కడికే చెందుతాయా?
భారత రాజ్యాంగమే అన్నింటా,అనీ రంగాల్లోను సమానత్వం ప్రసాదించింది.
భారత ప్రభుత్వం స్త్రీ పురుషులిద్దరికీ సమాన ఆస్తి
హక్కు చట్టబద్దం చేసింది.
మీరు చట్ట వ్యతిరేకంగానే కాదు, రాజ్యంగ వ్యతిరేకంగా వాదిస్తున్నారు.
అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని నా ఇంట్లోంచి ఫో,దిక్కున్న చోట చెప్పుకో అంటూ సంస్కార హీనంగా ప్రవర్తించే మగవాళ్ళకి ప్రతినిధుల్లాగా మాట్లాడే ముందు ఒక్క సారి,ఫామిలీ కోర్టుకో, మహిళా పోలీస్ స్టేషన్ కో వెళ్ళి చూడండి.
ముగ్గురో నలుగురో పిల్లల్ని కనేసి వాళ్ళని గాలికొదిలేసి భర్తల్ని, మనోవర్తి ఇవ్వమంటూ తిరిగే భార్యల్ని మీరు ఎప్పుడైనా చూసారా?
కన్న తండ్రి తన ఆస్తినంతా కొడుకుల కోసం దాచిపెట్టి కూతుళ్ళకు కట్నం పేరుతో కొంత బిచ్చమేస్తాడు.అదైనా పోనీ ఆ ఆడపిల్ల పేరు మీద ఉంటుందా అంటే ఉండదు.అల్లుడు మింగేస్తాడు.
ఈ భ్రష్ట సమాజం ఆడపిల్లల్నిచదువుకోనివ్వదు,సంపాదించుకోనివ్వదు.
(మొగుడు గారు ఇష్టపడితేనే ఏదైనా)
పెళ్ళికోసం, పిల్లల కోసం అన్నీ వదిలేసుకుని ఇంట్లో పడుండే భార్యలు భర్తల మోసాలకు గురై పిల్లలతో సహా బతుకు వీధినబడితే ఆ తప్పెవరిది?
అలా వాళ్ళను దిక్కులేని వాళ్ళుగా,దీనులుగా,భరణం అడుక్కునే వాళ్ళుగా తయారు చేసింది ఎవరు?
కన్న వాళ్ళా? క ట్టుకున్నవాడా? సమాజమా? చట్టాలను అమలు చేయలేని ప్రభుత్వాలా?
వాస్తవాలు అర్ధం చేసుకోకుండా అవాకులూ చవాకులూ రాసే వాళ్ళా.
వాదనలు వాదనల కోసం కాక వాస్తవాల ఆధరంగా,మహిళలపై పెరిగిపోతున్న
జాతీయ నేరాల చిట్టా ని గణనలోకి తీసుకుని మాట్లాడితే బావుటుంది.

maa godavari said...
This comment has been removed by the author.
సోదరి said...

భర్త భార్య పేరున ఆస్తి పెట్టడంలో తప్పేం లేదు. అది ఉమ్మడి ఆస్తి కాకపోయినప్పటికి.మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి ప్రమాదంలో చనిపోతే అతనెంతో ఇష్టపడిన భార్యకు (అతని కష్టార్జితం) ఆస్తిలో వాట ఇవ్వడానికి ఒప్పుకోలేదు అతని తల్లిదండ్రులు ఆమెకు పిల్లలు లేరనే సాకు చూపి .పిల్లలు ఉంటేనే ఆమెకు ఆస్తిలో కొంత భాగం ఇస్తారంట.

Unknown said...

బతికుండగా ఎవరూ తమ ఆస్తిని - అందులోను కష్టార్జితాన్ని ఇతరుల పేరిట పెట్టరు. అలా పెట్టడం ఎవరికీ మంచిది కాదు. అలా పెట్టాలని బలవంతం చేయడం అంతకంటే మంచిది కాదు. ఇవన్నీ కుటుంబాలలో మర్డరస్ పాలిటిక్స్ కి దారితీస్తాయి. ఇలాంటివి ఆయా వ్యక్తుల ఇష్టానిష్టానికి సంబంధించిన విషయాలు. అలాగే వదిలిపెట్టేయాలి వాటిని.

సత్యవతిగారూ ! మీ ఆవేదన అర్థం చేసుకోదగినదే. కానీ మీరు మీ ఆవేశంలో వ్యక్తులకు తమ వ్యక్తిగత కష్టార్జితాల మీద, వారసత్వాల మీద ఉన్న సహజ వ్యక్తిగత హక్కుల గురించి మర్చిపోతున్నారు. ప్రేమకైనా పెళ్ళికైనా, కుటుంబం కోసం త్యాగం చెయ్యడానికైనా మనిషిలో ముందు స్వచ్ఛందత, స్వేచ్ఛ ముఖ్యం. బలాత్కారం పనికిరాదు. అదీ గాక కుటుంబపోషణ అనేది కేవలం మగవాడి బాధ్యత కాదు. ప్రజాస్వామ్యంలో మనుషుల్ని వ్యక్తులుగా మాత్రమే గుర్తిసారు, వ్యక్తిగత ప్రతిభ, వ్యక్తిగత తప్పొప్పులూ ఇవే లెక్కలోకి వస్తాయి. అంతే తప్ప ఎవరినీ ఒక వర్గానికి, వంశానికి చెందినవారుగానో, ఒక వ్యక్తికి భర్తగానో భార్యగానో గుర్తించరు.

మీరు పైకి చెప్పినా చెప్పక పోయినా మీ వాదాన్ని బట్టి చూస్తే మీరు ఆడవాళ్ళ కోసం మగవాళ్ళ కష్టార్జితాన్ని ఆశిస్తున్నారనేది నిజమేమో అనిపిస్తున్నది. నిజానికి మీరు గమనిస్తే మగవాళ్ళ కష్టార్జితమంతా ఇప్పటికే ఆడవాళ్ళ కోసమే ధారపోయబడుతోంది. ఆ ఆడవాళ్ళు భార్య కావచ్చు, తల్లి కావచ్చు, కూతురు కావచ్చు. ఇంకా మీకేం కావాలి ? ఏదైనా వివాహవ్యవస్థలో భాగంగా మాత్రమే ఈ సమస్యలు తీరడానికి అవకాశముంది. మగవాడు కుటుంబంలో భాగంగా ఉండడానికి ఒప్పుకున్నంతకాలమే అతని వల్ల ఆడవాళ్ళకి లాభం. When he decides to walk out of the family system, all feminist laws will be useless. మగవాడిని ప్రేమగా చూసుకున్నంత కాలమే అతని మీద ఆడవాళ్ళకి హక్కు. అది లేకపోయినాక ఆడవాళ్ళని ఏ చట్టాలూ రక్షించలేవు. ఎందుకంటే ఈ చట్టాల్ని అమలుపరచాల్సింది కూడా ఫీల్డ్ లెవెల్ లో అంతిమంగా ఒక మగవాడే కదా. MRM కార్యకర్తల ప్రభావానికి లోనై వారు ఈ చట్టాల మీద విశ్వాసం కోల్పోయాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.

మగవాడిని ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం లేని, చూసుకోకపోయినా ఆడదానికి డబ్బు లభించే మార్గాన్ని మీరు వెతకదల్చుకున్నట్లున్నారు. కానీ అది సాధ్యపడదనుకుంటా. మగవాళ్ళెవ్వరూ ఒప్పుకోరు. చూశారుగా పై వ్యాఖ్యలు. మీరు దీని బదులు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడకుండా సొంతంగా డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడే activities గురించి రాయండి. మీ ప్రపోజల్ బావుంటుంది. ఎవరి విషయంలో ? అంటే - ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్న భార్యాభర్తలకి. అలా కాక ఒకరు సమ్పాదిస్తూ ఇంకొకరు కూర్చుని తినేవాళ్ళయితే అది దోపిడీగా పరిణమిస్తుమ్ది. అదీ గాక నా ఆభిప్రాయంలో - అరుదుగా మాత్రమే కనిపించే బహుకొద్దిమంది క్ర్రమశిక్షణారహితుల్ని దృష్టిలో ఉంచుకొని కోట్లాదిమందికి వర్తించే నియమాల్ని ఏర్పరచాలనుకోవడం మొదటికే మోసం తెస్తుంది. ఎందుకంటే ఈ అన్ని చట్టపరమైన బలాత్కారాల వల్లా భవిష్యత్తులో మగజాతికి ఆడజాతి మీద సానుభూతి నశిస్తుంది. (ఆల్రెడీ కొంత నశించిందనుకోండి) కానీ ఈ చట్టాలు రావడానికీ, అమలు కాగల్గడానికీ అసలు కారణం ఆడదాని మీద మగవాళ్ళకు ఉన్న సానుభూతే. దానికే ఎసరు పెట్టుకుంటే ఉపయోగమేముంది ?

మగవాళ్ళని పెళ్ళంటేనే మహాదోపిడి అని భయపడిపోయేలా చేయడం వల్ల ఆడవాళ్ళ సమస్యలు తీరవు. మగవాళ్ళు సంతోషంగా స్వచ్ఛందంగా తమ బాధ్యతలు నిర్వర్తించే వాతావరణం ఉండాలి. ఈ బలాత్కారం, దాని మీద బేసైన ఫెమినిస్టు చట్టాలు పనికిరావు. అవి మొదటికే మోసం తెస్తాయి. ఇప్పటికే కావాల్సినంత తెచ్చాయి.

Anonymous said...

నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను

అన్ని వనరుల్లో సమాన వాటా

-- మనకి ఇంకా రాలేదు కానీ కొన్ని దేశాలలో ఇది చట్టబద్దమే, మన దేశంలో కుడా ఇద్దరు కలిసి సంపాదించినది అని చూపించగలిగితే అది ఇద్దరికీ సమానంగా చెందుతుంది, ఇద్దరి పేర్ల మీద లేకపోయినా నేను చెప్పేది.

అన్ని రిజిస్ట్రేషన్లల్లో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే

--ఇది సబబే, కానీ

>>నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను

దీనికి నేను ఒప్పుకోను, పెళ్ళి అయ్యాక ఒక ఇరవై ఏళ్ళకి, నీకు విడాకులు ఇస్తున్నాను పో అంటే ఆ గృహిణి ఏమైపోవాలి? చట్టంలో ఉన్న లొసుగులు ఆధారం చేసుకోని ఒక ఇరవై ఏళ్ళు తిప్పొచ్చు, మరి అప్పటివరకూ?

అసలు ఇద్దరు కలిసి సంపాదించింది అనే కాకుండా; ఎవరు సంపాదించారు అనే దానితో సంభంధం లేకుండా ఇద్దరికీ వాటా ఉండాలెమో..

ఇక అసలు విషయానికి వస్తే, మీ కల చాలా బాగున్నది.

ఎంతవరకూ నిజం అవుతుందో మరి..అసలు కలను సాకారం చేసుకోవటం చేతల్లొనే ఉన్నదెమో..

Anonymous said...

>> అబ్బాయి ప్రమాదంలో చనిపోతే అతనెంతో ఇష్టపడిన భార్యకు (అతని కష్టార్జితం) ఆస్తిలో వాట ఇవ్వడానికి ఒప్పుకోలేదురు

సోదరిగారు
చట్ట ప్రకారం ఆస్థి పై సర్వ హక్కులూ భార్యకే చెందుతాయి. అతని కష్టార్జితం అన్నారు కాబట్టి.

లేనిచో, ఆ అమ్మాయి ఇంకో పెళ్ళి చేసుకునేవరకూ, కొన్ని సంధర్బాలలో ఆ అమ్మాయి జీవితాంతం పొషణ అత్తింటివారి భాద్యతే.

ఇప్పుడు కొత్తగా, ఆ అమ్మాయి తల్లి/తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ఐతే, ఆ అమ్మాయి ఇంకో పెళ్ళి చేసుకునేవరకూ/ఆ అమ్మాయి జీవితాంతం/ఆ అమ్మాయి ఉద్యోగం వచ్చే వరకూ తల్లి/తండ్రి పెన్షన్/ ప్రోఫిడెన్ట్ ఫన్డ్ వస్తుంది

Unknown said...

ప్రస్తుత భారతరాజ్యాంగం ప్రకారం ఆస్తి ఒక హక్కు కాదు. ఎవరైనా ఆస్తి సంపాదించుకుంటే ప్రభుత్వం అందుకు అడ్దు చెప్పదు. కానీ దాన్ని గ్యారంటీ కూడా చెయ్యదు. ప్రభుత్వం తమ ఆస్తిని కాపాడాలనీ, ఆస్తి ఇప్పించాలనీ డిమాండు చేసే అవకాశం ఎవరికీ లేదు. కానీ ఒకప్పుడు ఆస్తిహక్కు ఉండేది. ఇందిరాగాంధీ వచ్చి ఆ హక్కుని తొలగించింది.

భార్య నుంచి భర్తక్కూడా కష్టకాలంలో ఆస్తి సంక్రమించే మార్గమేదైనా ఆలోచించండి. మీ ప్రపోజల్ కి పూర్తి మద్దతు తెలుపుతా. లేకపోతే ఈ వన్-వే ట్రాఫిక్ చట్టాల వల్ల మగవారికి చాలా నష్టం జరుగుతోంది.

Praveen Mandangi said...

కేవలం ఆస్తి హక్కు వల్ల స్త్రీకి స్వేచ్ఛ రాదు. ఆస్తి ఆడదాని పేరు మీద వ్రాసి, అధికారం మాత్రం భర్తకో, తండ్రికో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆస్తి సంబంధాలు ఇలాగే ఉండాలనుకుంటున్నారా లేదా అస్తి సంబంధాలు మారాలనుకుంటున్నారా? తాడేపల్లి గారు చెప్పింది ఒక రకంగా నిజమే. ఆడది ఆస్తి కోసం మగవాడి మీద అధారపడడం సమానత్వం కాదు.

శ్రీనివాస్ said...

@ ప్రవీణ్ శర్మ ,

కేవలం ఆస్తి హక్కు వల్ల స్త్రీకి స్వేచ్ఛ రాదు. ఆస్తి ఆడదాని పేరు మీద వ్రాసి
-----------------------------------------

" ఆడవారి " అని సంబోధించడం నేర్చుకోండి.

Praveen Mandangi said...

నేను పురుషుడిని ’మగవాడు’ అని సంబోధించినప్పుడు అది పురుషులని కించపరిచే పదం అవుతుందా? కేవలం బాష ఒక ఇష్యూ కాదు. కొంత మంది స్త్రీలే పురుషులని వీధి కుళాయి తిట్ల కంటే హేయమైన తిట్లు తిడుతుంటారు. దాని కంటే ఇదే బెటర్ కదా.

పాయింట్ కి వద్దాం. ఆస్తిని స్త్రీ పేరు మీద వ్రాసి అధికారం భర్తకో, తండ్రికో ఇవ్వడం అంటే స్త్రీని డమ్మీని చెయ్యడమే.

Anonymous said...

ఆస్తిని స్త్రీ పేరు మీద వ్రాసి అధికారం భర్తకో, తండ్రికో ఇవ్వడం అంటే స్త్రీని డమ్మీని చెయ్యడమే.

---------

౧.చైనాలో చట్టాలు ఇండియాలో వర్తిసాయా?
౨. ఆస్థి ఒకరి పేరు మీద, అధికారం ఇంకొకరి పేరు మీద మైనర్ల విషయంలొనే వీలవుతుంది కదా? అసలు మైనర్ల వివాహం చెల్లుతుందా??

Praveen Mandangi said...

http://blogzine.sahityaavalokanam.gen.in/2010/08/blog-post_15.html

Anonymous said...

ఆడది అనే మాటేమైనా అన్‌పార్లమెంటరీ బూతు పదమా ? మరి మగవాడు అంటే బూతులా ధ్వనించడం లేదేం ? దయచేసి భాషలో లేని బూతుల్ని కొత్తగా కృతిమంగా సృష్టించకండి బాబూ ! ఉన్న బూతులతో తృప్తి చెందుదాం.

ఇహపోతే ఈ టపా విషయనికొస్తే ఇదేదో "బంగారుబాతుని బతికుండగానే కోసుకు తినేద్దాం" అనే టైపు ప్రతిపాదనలా ఉంది. ఆడది మగవాణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమని ఆస్వాదిస్తూ, అందుకు ప్రతిస్పందిస్తూ ఆమెని అతను జీవితాంతం పోషించాలి. మానవజాతి పుట్టినఫ్పటినుంచి ఈ ఏర్పాటు ఇలా తరతరాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇలా బతికుండగానే ఆస్తులు రాసివ్వమంటే కుటుంబంలో ఇహ మగవాణ్ణి లెక్క చేసేదెవరు ? అలా రాసిచ్చాక అతనొక చచ్చిన పీనుగుతో సమానమవుతాడు.ఆతను ప్రేమ కొద్దీ స్వచ్ఛందంగా చేసేవి కూడా చట్టానికి భయపడి/ లోబడి చేస్తున్నట్లే భావించబడుతుంది. అన్నీ ఉండి, అతని విలువ చాలా తగ్గిపోతుంది. కూతుళ్ళకి పెళ్లి చేసే బాధ్యత చట్టపరంగా తండ్రిది కాకపోయినా, అతను కేవలం ప్రేమ కొద్దీ ఆ బాధ్య్తని తలకెత్తుకున్నా కూడా "ఎవడి కోసం చేస్తావోయ్" అని ఎదిరించే కూతుళ్ళూ, భార్యలూ ఉన్నారు సమాజంలో ! వాళ్ళ చేతుల్లో ఇలాంటివి పెడితే ఇహ మగవాణ్ణి లెక్కచేస్తారా ? "మగవాడి సేవలకి ఎవరూ కృతజ్ఞత చూపించడం లేదు" అని ఇప్పటికే చాలామంది మగవాళ్ళు మనసులో బాధపడుతున్నారు, పైకి చెప్పకపోయినా ! ఇలాంటివి ఆచరణలో పెడితే వాళ్ళని కుటుంబంలోంచి బయటికి గెంటడమో లేక తానే శాశ్వతంగా వెళ్ళిపోవడమో తప్ప అతనికి వేరే దారి ఉండదు.

మనుషుల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా, వాళ్ళని కలలో కూడా ప్రేమించకుండా, వీసమెత్తు సేవ చేయకుండా వాళ్ళ ఆస్తుల్ని మాత్రం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకునే అనేక వెసులుబాట్లు ఇప్పటికే చాలా ఉన్నాయి మన law లో ! వాటి వల్ల కోట్లాదిమంది ముసలివాళ్ళు బాధితులయ్యారు, అవుతున్నారు. వాటిని ఎలా సంస్కరించాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మళ్లీ అలాంటి చట్టమే ఇంకొకటి కావాలా మీకు ? శభాష్ !

తాడేపల్లిగారన్నట్లు - ఆ మగవాడి మీదనే ఆధారపడి బతికే ఇతర కుటుంబసభ్యుల మాటేంటి ? వాళ్ళ హక్కుల సంగతేంటి ? అంతా ఆడదే పట్టుకెళితే వాళ్ళకెవరు రాసిస్తారు ఆస్తులు ?

Praveen Mandangi said...

లేని అర్థాలు తియ్యడం కొందరికి సాధ్యం. మైనర్లకి ఆస్తి హక్కు ఉండదు. మైనర్లు ఆస్తి డాక్యుమెంట్ల మీద సంతకాలు పెట్టినా అవి చెల్లవు. మేజర్ అయిన స్త్రీ పేరు మీదే ఆస్తి వ్రాసి అధికారం భర్తకో, తండ్రికో ఇస్తారు.

Anonymous said...

>>కూతుళ్ళకి పెళ్లి చేసే బాధ్యత చట్టపరంగా తండ్రిది కాకపోయినా

చట్టపరమైన భాద్యతే అని పోయిన సంవత్సరం సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పింది.

>>మళ్లీ అలాంటి చట్టమే ఇంకొకటి కావాలా మీకు ?

ఆస్థి మొత్తం స్వార్జితం ఐతే, ఐనా, కాకపోయినా, భార్యకి మొత్తం కట్టబెట్టడం అవదు, తల్లిదండ్రులకి హక్కు ఉన్నది, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం చట్టరిత్యా నేరం.

ఇంక నేను చెప్పింది, పురుషుడే ఇవ్వాలి అని అనలేదు గమనించగలరు, సమాన వాటా, సమాన హక్కు అని కుడా అనలేదు గమనించగలరు.

>>మైనర్లకి ఆస్తి హక్కు ఉండదు.

చట్టం != చలం
చట్టం నీ కధకాదులే నువ్వు చెప్పినట్టు ఉండటానికి

Anonymous said...

తాడేపల్లి, ఓబుళ్ రెడ్డి, ప్రవీణ్ శర్మ ల అభిప్రాయాలు సమజసంగా వున్నాయి.

కలల్లో కూడా ఆస్థులు, పంపకాలు వస్తుంటే ఆ ఇల్లాలికి ఆస్థిని ఇచ్చి సాగనంపటమే మంచిది.

Anonymous said...

చట్టబద్ధమైన బాధ్యతకీ చట్టపరమైన బాధ్యతకీ చాలా తేడా ఉంది. మొదటిదైతే తప్పనిసరి. రెండోదైతే, అది అతను చేసినా, చేయకపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోదని అర్థం.

ఇక్కడ సత్యవతిగారు ఏం చెబుతున్నప్పటికీ అది ఆచరణలోకొచ్చేసరికి అందరూ మగవాళ్ళ ఆస్తుల మీదే పడతారనేదాంట్లో సందేహం ఏమైనా ఉందా ?
తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం చట్టరీత్యా నేరం. బావుంది. కానీ వాళ్ళ ఆస్తుల్ని కోడలు పట్టుకెళ్ళడం మాత్రం న్యాయం. ఏం చెప్పారండీ బాబూ ! మీ ఆడవాళ్ళని తీర్పు చెప్పమంటే ఇలాగే ఉంటుందనుకుంటా. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేశిన కేసుల్లో కూడా కొడుకులకే శిక్ష పడుతున్నది తప్ప కూతుళ్ళ జోలికి ఎవరు వెళుతున్నారు, వాళ్ళు మంచి స్థితిమంతులైనా కూడా ! కానీ ఆస్తుల పంపకాలనేసరికి వాటి కోసం ఆ మగవాడి మీద పడిపోవడానికి అందరూ సిద్ధమవుతారు.

ఈ కోర్టు తీర్పులకున్న నేచురల్ వ్యాలిడిటీ ఏంటనేది నేను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉంది. ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కటి చెప్పి మన బుఱ్ఱ తినేస్తాడు. అతను చెప్పేదానికీ, పూర్వతీర్పులకీ, అక్కడ రాసున్నదానికీ ఏమీ సంబంధం ఉండదు. ఇది గాక అధికారంలో ఉన్న ప్రభుత్వం ఫెమినిస్టులకు అనుకూలమైతే ఫెమినిస్టు తీర్పులూ, హోమోసెక్సువల్సుకు అనుకూలమైతే హోమో తీర్పులూ వస్తూంటాయి. అవి కూడా ఒక న్యాయమేనా ? చంపేశారు.

Anonymous said...

కుమార్ దత్తా గారు, ప్రభుత్వం వేరు చట్టం వేరు కద, ఇంక మీరు అడిగినదానికి, కుతురి పెళ్ళి తండ్రి చేసి తీరాలటండి(చేయగలిగే స్థితిలో లేకపొతే గట్రా నాకు తెలియవు, తీర్పు ఇంకా చట్టం అవలేదు అనుకుంటా, కాబట్టి, కూతురి పెళ్ళి నిర్లక్ష్యం చెస్తే/ ఆ భాధ్యతనుంచి తప్పించుకో చూస్తే కుదరదు, ఇది తండ్రి దగ్గిర పెరగని పిల్లల్లకి ఐతే గట్టిగానే ఉన్నది, మరి, తండ్రి వన వాదనను వినిపించుకోవచ్చు, కావును చట్టపరమైన బాధ్యతే కావొచ్చు)

>>కూతుళ్ళ జోలికి ఎవరు వెళుతున్నారు

కూతుళ్ళకీ సమ భాధ్యత వున్నది, ఎవరు చేసినా తప్పే, (చట్టబద్దమైన).

>>వాళ్ళ ఆస్తుల్ని కోడలు పట్టుకెళ్ళడం మాత్రం న్యాయం.

కొడుకు సంపాదన మీద ఐతే తల్లిదండ్రులకి హక్కు వుంటుంది, కొడుకు చచ్చిపొతే, ఒకె వేళ ఆస్థి మొత్తం కోడలి మీద వున్నా అత్తామామల పోషణ, ఇతర కర్చులు కోడలివే (మనుమలవే, లేక ఆస్థి ఎవరికి రాస్తే వాళ్ళవే).

ఇక్కడ వచ్చిన చిక్కు, హక్కు/వాటా వుండదు, ఇప్పుడు కోదలు ఆస్థి మొత్తం తిసుకొని అత్తామామలని నిర్లక్ష్యం చెస్తే కోర్ట్ కి వెళ్ళి నెల నెల భరణం(సరైన పదం నాకు తెలియదు) పొందాలి, ఆ డబ్బు సరిగ్గా చెల్లించకపోయినా, దీని బదలు వాటా/ హక్కు కల్పిస్తే మంచిదెమో అని నా ఉద్దేశం, మరి దానిలో తప్పు ఒప్పులు ఆలోచించాలి మరి.

Anonymous said...

తారగారూ !

మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారు. మీరు లీగలిస్టుల్లా ఉన్నారు. లీగలిజమ్ ఒక అధమస్థాయి భావజాలం. దాన్ని మించి మనుషులు ఎదక్కపోవడం వల్లనే మన సమస్యలన్నీ. ఈ చట్టాలెవరు చేశారు ? మగవాళ్ళు చేశారు. మగవాళ్ళ మనసు మారిపోతే ఈ చట్టాలు కూడా మారిపోతాయి. అవునా ? ఇప్పుడు మగవాళ్ళ మనసుని ఈ చట్టాలకు వ్యతిరేకంగా మార్చడం కోసం MRM అనే ఉద్యమం నడుస్తున్నది. ఇలా మనసు మారిపోతే వయసు చెల్లే చట్టాల గొడవ నాకు అవసరం లేదు. ధర్మం అనేదొకటుంది. దాన్నే ఇంగ్లీషులో Natural Justice అంటారు. అది స్త్రీపురుష భేదాలని లెక్కలోకి తీసుకుంటుంది. అదే సమయంలో అది వాటికి అతీతమైనది కూడా. అది అందరినీ సమదృష్టితో మన్నిస్తుంది. అది అందరి పరిస్థితుల్నీ పరిగణనలోకి తీసుకుంటుంది. అందరి కష్టసుఖాల్నీ పట్టించుకుంటుంది. అది కావాలి నాకు.

వ్యక్త్రిగత ఐడియాలజీలతో సంకుచితంగా చేసే సెక్టేరియన్ వోట్ బ్యాంక్ చట్టాల్ని ఒక దశాబ్దం పాటు జనం నెత్తి మీద బలవంతంగా రుద్దగలం. మహా అయితే ఇంకో దశాబ్దం. ఆ తరువాత మన వల్ల కాదు. వాటి పరిణామాల్ని మనం ఫేస్ చెయ్యలేం. అంతే కాదు, జనం అంత పిచ్చోళ్లేమీ కాదు. ఆధునికజనం అసలే కారు. ఈ చట్టాలు ఇంతకుముందు లేవు. అంటే ఇకముందు ఉండవని అర్థం. మరి శాశ్వతంగా ఉండేదేంటి ? శాశ్వతంగా మిగిలేదేంటి ? ధర్మం !! అలా ఆలోచిద్దాం. దాని ప్రకారం చట్టాల్ని రూపొందించుకుందాం.

నేనొక దైవవిశ్వాసిని కనుక కొంచెం మతభాషలో చెబుతానండీ. ఏమీ అనుకోవద్దండీ.

Natural Justice ని అనుసరించి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతిజీవీ తన ఆహారాన్ని తాను వెతుక్కుంటున్నది. అందుచేత ప్రతిమనిషీ ఒక వయసొచ్చాక తన ఆహారాన్ని తానే వెతుక్కోవాలి. అంత వయసు లేనివారి పట్ల, అంత ఆరోగ్యం లేనివారిపట్ల మాత్రమే కుటుంబానికి గానీ, సంఘానికి గానీ, ప్రభుత్వానికి గానీ బాధ్యత. అంతేతప్ప వయసొచ్చి కాళ్లూ చేతులూ కళ్ళూ చెవులూ బావున్నవారు స్త్రీలైనా పురుషులైనా ఇతరుల ఆస్తుల కోసం, ఆదాయాల కోసం ఆశించడం చాలా అసహ్యమైన విషయం.

డబ్బు ఊరికే రాదు. ఇతరుల గురించి మనిషి తనను తాను హింసించుకుంటేనే వస్తుంది. ఆ డబ్బు సంపాదించాక ఆ హింస కనీసం అంతటితో అంతం కావాలని మనిషి కోరుకుంటాడు. మీరిలాంటి ప్రపోజల్సు తెస్తే ఆ హింస అతనికి కొనసాగుతుంది. ఆ పాపమంతా ఇలాంటి ప్రపోజల్స్ పెట్టినవాళ్ళకి తగుల్తుంది. స్వంత సంపాదన మనిషికి కొంత స్వేచ్ఛనిస్తుంది. కానీ ఇలాంటి ప్రపోజల్సులో ఆ కాస్త స్వేచ్ఛని కూడా హరించే ప్రయత్నం ఉంది. వేలాది సంవత్సరాల పురుషాధిక్య చరిత్రలో సైతం - మగవాళ్ళకెప్పుడూ రాని ఈ ఆలోచన మీకొచ్చిందంటే నాకనిపిస్తుంది - బహుశా మగవాడి మార్గదర్శకత్వంలోనే మానవజాతికి హాయి ఉందనీ, స్త్రీల మార్గదర్శకత్వంలో ఎక్కువ హింస ఉంటుందని ! నా అభిప్రాయం నా పరిశీలనాజనితం. తప్పయితే మన్నించండి.

ఆ ఇతరులు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు. వారి ధనాన్ని ఆశించడంలో డిగ్నిటీ ఏముంది ? మొరాలిటీ ఏముంది ? వాళ్ళంతట వాళ్ళిస్తే తీసుకోవాలి. లేకపోతే ఊరుకోవాలి. బలవంతంగా ఒకరి కష్టార్జితాన్ని, వారు ఎంత సన్నిహితులైనప్పటికీ, మీకెన్ని సమస్యలున్నప్పటికీ, మీరొక చట్టాన్ని కిరాయిగూండాని తెచ్చుకున్నట్లు తెచ్చుకున్నప్పటికీ వారికిష్టం లేకుండా దాన్ని ఆశించడాన్ని Natural Justice అంగీకరించదు. అది మహాపాపం అవుతుంది. ఆ పాపానికి తగ్గ ఫలితం ఉంటుంది. అది స్త్రీలని భవిష్యత్తులో మరింత బాధపెడుతుంది తప్ప బాగుచేయదు. మీరు దీనికోసం ఒక చట్టం తీసుకొస్తే అది సామూహిక పాపంగా పరిణమించి స్త్రీలంతా సామూహికంగానే అనుభవించాల్సి వస్తుంది. మగవారి కష్టార్జితం మీద, వారి చెమట మీద వారికే లేని హక్కు (వారికి మీరు డినై చేస్తున్న హక్కు, లేదా డివైడ్ చేస్తున్న హక్కు) మీకెక్కణ్ణుంచి వస్తుంది ? అదే, స్త్రీల ఆస్తుల్ని ఇతరులు (షేర్ గా నైనా సరే) ఆశిస్తే మీరు ఆమోదముద్ర వేస్తారా ? ప్రపంచంలో స్త్రీల హక్కులొక్కటే లేవండీ. ఇంకా చాలా రకాల మనుషుల హక్కులున్నాయి. ఇంకా చాలా లెవెల్సుకి కేటగరీలకు చెందిన హక్కులుంటాయి. వాటన్నింటినీ కూడా అర్థం చేసుకొని దూరం ఆలోచించండి.

మీ వాదనలో ఉన్న ఇంకొక అమాయకత్వం ఏమంటే - మగవాళ్ళని చట్టాలతో బైండ్ చేయగలమనుకోవడం. కానీ చూశారుగా చరిత్రలో - మగవాళ్ళు వాటికెప్పుడూ కట్టుబడలేదు.

Anonymous said...

>>మీరు లీగలిస్టుల్లా ఉన్నారు.

బాబోయి, ఇది నేను అసలు ఎప్పుడూ వినలేదు.
మీ మిగతా ప్రశ్నలకి జవాబులు చెప్పాలీ అంటే చాలా ఆలోచించాలి ఇప్పుడే ఏమీ చెప్పలేను మరి.

సోదరి said...

తార గారు మీరు చెప్పింది కరెక్టే కాని ఎన్నాళ్ళని కోర్టుల చుట్టూ తిరుగుతారు ఆడపిల్లను పట్టుకుని.పెద్ద కుటుంభాలలో విషయాలు తెలియవు గాని,భర్త నిర్లక్ష్యమో,లేకపోవడమో అనేక కారణాలతో పిల్లలతో కుటుంభ భారం ఎలా ఈడ్చాలో తెలియని మధ్యతరగతి కుటుంభాలు ఎక్కువ చూసాను.పైగా తెచ్చిన కట్నకానుకులు సైతం వారికి ఇవ్వకపోవడం వల్ల మరీ దిక్కులేని వారు అయిపోతున్నారు .కొన్ని సార్లు కోడుకులు చూస్తారని నమ్మకంతో ఉన్నవాళ్ళు భార్య పేరున ఆస్తి పెట్టక పోవడం వల్ల ముసలితనం లో ప్రతిదానికి చేయి చాచవలసిన తల్లుల వేదన వర్ణించలేము.అయితే ఈ చట్టాలు నిజంగా అవసరం ఉన్న వారికి కాక ,పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి పనికి వస్తాయి అనడం లో సందేహం లేదు కాని మెజార్టీ వర్గ సమస్యలను పరిగణకు తీసుకోవలసి ఉంది.
ఇక మగవాడు తన సంపాదన అంతా ఆడదానికే కర్చు పెట్టవలసి వస్తుంది భార్యనో,తల్లినో,కూతురి నో అనే వాదన లో పసలేదు.ఆ లెక్కన జీతం బత్యం లేని ఆడపిల్ల కష్టం కూడా ఆలోచించాలి. కోపతాపాలకు చోటు ఇవ్వకుండా ఏది అయితే మనపిల్లలకు,కుటుంభానికి మంచి అవుతుందో అది ఆలోచించాలి.

Anonymous said...

అవును, సోదరి గారు నిజమే

అన్నీ సరిగ్గా ఉన్నా, అన్నీ తెలిసినా, కనీసం ఇరవై ఏళ్ళు కోర్ట్ ల చుట్టూ తిప్పోచ్చు..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...