ఈ రోజు మళ్ళీ మహిళా జైలు చూడ్డానికి వెళ్ళాను.
నాతో పాటు హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అధారిటి సెక్రటరీ కూడా ఉన్నారు.ఇద్దరం కలిసి మొత్తం జైలు పరీక్షించాము.బారక్స్,వంట గది,కార్హానా,ఆసుపత్రి(జైల్లో పుట్టిన ముగ్గురు పసివాళ్ళున్నరు)అన్నీ చూసాము.ఖైదీలందరితోను మాట్లాడాం.వాళ్ళ కేసుల గురించి చర్చించాం.
చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళ కేసుల పరిష్కారం కోసం జైల్ అదాలత్ పెట్టాలని నిర్ణయమైంది.
ఖార్ఖానాలో చక్కటి డిజైన్లతో,మంచి రంగులతో చీరల మీద వర్క్ చేస్తున్నారు.
నేను చేనేత తప్ప వేరే చీరలు కట్టుకోను కాబట్టి కొనలేకపోయాను.ఎవరికైనా కావాలంటే చెప్పండి.
ఈ రోజు నాకు బాగా తౄప్తినిచ్చిన పనిని మీతో తప్పక పంచుకోవాలి.
ఒకామె ఆరునెలల గర్భంతో ఉంది.చిన్న దొంగతనం చేసిన నేరం మీద భార్యాభర్తలిద్దరూ జైలు పాలయ్యారు.ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల పెద్దలకి దూరమయ్యారు.మా అమ్మకు చెప్పండి అని ఆ అమ్మయి చాలా ఏడ్చింది.వీళ్ళు జైల్లో ఉన్నారని బయట ఎవ్వరికీ తెలియదు.ఆ అమ్మాయి ఇచ్చి న అడ్డ్రెస్
పుచ్చుకుని జైలు నుంచి అటే వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ పోయాను.
చాలా కష్టం మీద ఆమెని కాచీ గూడా రైల్వే ష్టేషన్ వెనక పట్టుకున్నాను.వాళ్ళ కూతురి పరిస్థి చెప్పి "ములాఖత్"కి వెళ్ళమని చెప్పాను.చాలా ముసలామె.ఒకటే ఏడుపు. ఎన్ని దన్ణ్ణాలు పెట్టిందో.
నాకు మాత్రం ఈ రోజు చాలా చాలా సంతోషమంపించింది.చాలా తృప్తిగా కూడా ఉంది.
5 comments:
idi bhagane vundi madam,inthaku mundu cheppinatlu aa pillavaadi vishayam emaindo kanukkunnaraa?aa thalli ,biddanu enduku arrest chesaaru.teliste cheppandi please
గాజుల గారు
నమస్కారం.ఇంతకు ముందు నేను రాసిన పిల్లవాడు నాకు దొరకలేదు.
నిన్న నేను ఆమె గురించి విచారించాను.ఆమె విడుదలై వెళ్ళిపోయిందని జైలర్ చెప్పారు.
ఆమె తన పిల్లవాడిని కలిసే ఉంటుందని ఆశిద్దాం.
hi very nice...first time choostunna mee blog..i want to talk to u personally is it possible?
Murali garu
Thanks.
yes you can talk to me.pl.call helpline no 1800 425 2908.They will give my mobile no.
మీ ప్రయత్నం చాలా బాగుంది. సత్యవతి గారు! చాలా సంతోషం..
Post a Comment