దిబ్బపాలెం దిబ్బ,గంగవరం గల్లంతు ఆహా!!! ఏమి దైవ భక్తి. శెభ్హాష్.

గంగవరం పోర్ట్ అభివృద్ధి పేరుతో దిబ్బపాలెం,గంగవరం గ్రామాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం,ఈనాటికి ఆ రెండు గ్రామాల నిర్వాసితులను రోడ్లమీడదే  బతకమంటూంది.


గంగవరం పోర్ట్ కాంట్రాక్టర్ ఎంత మిగుల్చుకున్నాడో కానీ బెజవాడ దుర్గకి 40 లక్షల విలువైన బంగారు హారం సమర్పించాడంట.

రెండు గ్రామాలకు చెందిన వేలాదిమంది కూడూ,గూడూ కోల్పోయి ఏడుస్తుంటే,ఇస్తామన్న ఉద్యోగాలూ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతుంటే,కాంట్రాక్టర్ గారి ఔదార్యం అబ్బో ఎంత వెగటు పుట్టిస్తుందో!!!!!


Comments

Praveen Sarma said…
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు
మానవ సేవే మాధవసేవ ..అన్నది ఇక్కడ వర్తించదు అనుకోవాలి .. అభివృద్ధి పేరిట జనజీవితాలని ఇక్కట్లపాలు చేసి.. లాభాలు ఆర్జించి "అమ్మకి" లంచం అన్నమాట."అమ్మ" ఎక్కడైనా ఇలాటి వారిని హర్షిస్తుందా !? ఇలాటి వాటిని గొర్రెలమందలాటి జనం దృష్టికి తీసుకువస్తున్న మీకు అభినందనలు...ధన్యవాదములు.. చెప్పగా చెప్పగా ,చూడగా చూడగా..అయినా ఆలోచనా విధానం లో.. మార్పు వస్తుంది..మీ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తూ.. మీ నుండి ఎంతో..నేర్చుకుంటూ
వాడి జిమ్మడి పోనూ అని నేననుకుంటుంటే
ఈ ప్రభుత్వం పడి పోనూ అని ఇంకోఆయన అనుకుంటున్నాడు
ఏది జరిగినా ఆ నిర్వాసితుల బ్రతుకులు మారేనా ..?
జనం సొమ్ము తిన్న వాడూ బానే ఉన్నాడు
అమ్మ కిరీటం తిన్న వాడూ బానే ఉన్నాడు
పాపభీతి అంటే ఏంటో ??
Praveen Sarma said…
పాపభీతి ఏ అవినీతిపరుడికి ఉంది? పది లక్షలు భోంచేసి పదివేలు హుండీలో వేస్తారు.

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం