Sunday, May 22, 2011

గోరంత దీపం కొండంత ధైర్యం




మధ్యాహ్నం పేపర్లు చదువుతూ యధాలాపంగా టివి వేపు చూస్తే గోరంత దీపం సినిమా వస్తోంది ఏదో చానల్ లో.
ఆ సినిమా చూసినపుడల్లా వాణిశ్రీ నటన అద్భుతమనిపిస్తుంది.
చివరి సీన్లో బాపు సరుగుడు కర్రతో మోహన్ బాబును కొట్టించిన దృశ్యం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
రాధా కళ్యాణం లాంటి సినిమాల్లో పరమ సాంప్రదాయంగా కనబడే బాపు గోరంత దీపం లో మాత్రం నీ వేపు కన్నెత్తి చూసేవాడిని నిలువునా చితక్కొట్టు అని చెప్పారు.
అలాగే తొలికోడి కూసింది అనే సినిమాలో కే.బాలచందర్ అత్యాచారం చెయ్యడానికి ఎవడైనా ప్రయత్నిస్తే వాడి మర్మావయవం మీ ఈడ్చి తన్నమని చెప్పాడు.
ఆ సినిమా లో హలం అనుకుంటాను ఒంటరిగా వెళుతూ ఉంటుంది.పోకిరీ వాడొకడు ఆమె వెంట పడతాడు.
ఆమె ఒరేయ్ వద్దురా.నా దగ్గరకు రాకు అంటుంది.కామం తో కళ్ళు మూసుకుపోయి వాడు ఆమెని చెట్టు వెనక్కి లాక్కెళ్ళతాడు.
మరు క్షణమే హమ్మో! అయ్యో! అంటూ రెండు చేతులూ తొడల మధ్య పెట్టుకుని పడుతూ లేస్తూ పరుగులు పెడుతుంటాడు.
ఇద్దరు గొప్ప దర్శకులు మహిళలు ప్రతి నిత్యం ఎదుర్కొనే రెండు సమస్యలకు ఎంత చక్కటి పరిష్కారం చూపించారు.
నీ మీద నీకిష్టం లేకుండా చెయ్యిపడితే తిరగబడ్డమే పరిష్కారం.
నాలుగు తన్ని నిన్ను నువ్వు రక్షించుకోవడమే పరిష్కారం.

హేట్స్ ఆఫ్ టూ బాపూ అండ్ బాలచందర్.

3 comments:

ComputerShow said...

hi
nice blog
1st-computer-info.blogspot.com

thank you

వనజ తాతినేని/VanajaTatineni said...

మేడం .. ఇంత స్పూర్తికరమైన రెండు దృశ్యాలు గురించి చక్కగా చెప్పారు. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని.. సత్యవతి గారు వాస్తవాలు తప్ప .. ఉత్తేజభరితంగా ఉండే సినిమా సన్నివేశాలని ,పాటల్ని ఉదహరించరు .. ఎందుకనో! అని . నిజం మీరు చెప్పింది... కొంచెం ప్రమాదం ఎదురవగానే వణికి పోయే స్త్రీలకి.. ఇలాటివి.. చెప్పాలి.. అభినందనలు..దర్శకులకి..... మీకు..కూడా..

Raj said...

బాగా చెప్పారండీ.. ఇకనైనా మహిళలు శక్తి స్వరూపిణీలు అయ్యేలా ఉత్తేజం కలిగించారు.. మీకు ధన్యవాదములు..

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...