ఇదే నా సరికొత్త ఎజండానిన్న రాత్రి నేనో కల కన్నాను

ఆహా ఏమి ఆ కల,ఎంత అద్భుతమైన కల
నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం
చేతిలొ చెయ్యేసి భుజం భుజం కలిపి
ఆకుపచ్చటి పచ్చిక బయిళ్ళ మీద
నేనొక అడుగు ముందుకెయ్య లేదు
నువ్వొక అడుగు ముందుకెయ్యలేదు
సమానంగా అడుగుల లయలో
ఏకబిగిన నడుస్తున్నాం
ఏవేవో అడ్డంకులులు ఎవరెవరివో ఆర్తనాదాలు
సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు
ఆడపిల్లల శవాల దృశ్యాలు
హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద
మగమౄగాల దాడులు
చదువుకునే చోట చీడపురుగుల చీదర
ఇంటిబయట ఎంతటి అభద్రతో
ఇంటి నాలుగ్గోడల మధ్య అంతే అభద్రత
నువ్వూ నేనూ చేతిలో చెయ్యేసి
నడుస్తున్నాం కదా
మన మధ్య ఇటీవలి కాలంలో
ఇంత సయోధ్య ఎలా కుదిరిందో
ఇంత ప్రజాస్వామిక వాతావరణం
ఎలా సంభవించిందో
మన మాటల్లోనే దొర్లుతోంది
హింస లేని జీవితమంటే
ఇంటా బయటా ప్రజాస్వామిక సంబంధాలుండాలంటే
అన్నింటా సమాత్వం నెలకొల్పాలంటే
అది నువ్వూ నేనూ కలిసి సాధించాల్సిందే
నన్నొదిలేసి నువ్వెళ్ళిపోయినా
నిన్నొదిలేసి నేనెళ్ళిపోయినా
మనం ఒంటరి దీవులమే అవుతాం
ఎవరికి వారౌ స్వార్ధపరులమే అవుతాం
మనం పక్క పక్కనే నడుస్తూ
ఎన్ని కలలు కంటున్నాం
ఎన్ని కొత్త ఆలోచనలు చెస్తున్నాం
అన్నింటా సమానత్వం అని నేనంటుంటే
నువ్వు సై అనడం
అబ్బో నీ మీద నా కెంత ప్రేమని
నువ్వింత మారాక నాతో సై అన్నాక
అంతా జాంతా నై అనేచోట
నువ్వింత ప్రజాస్వామికంగా మారి
పురుషస్వామ్యం పడగ మీద కొట్టాకా
నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించడమే నా పని
ఆడపిల్లలక్కూడా అన్నింటిలో
ఇంటిలో, పొలంలో,ఫ్యాక్టరీలో
ఒక్కటేమిటి స్థిర చర వనరుల్లో
సగభాగమివ్వడడమే
అన్ని రకాల హింసలకు చెల్లు చీటి
అని నువ్వంటుంటే నా చెవుల్ని
నేనే నమ్మలేకపోయాను
నీ  మాటే నా మాట కదా 
పద పోదం దండోరా వెయ్యడానికి
నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను
అన్ని వనరుల్లో సమాన వాటా
అన్ని రిజిస్ట్రేషన్లల్లో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే
ఇదే మన కొత్త నినాదం
ఇదే మన సరికొత్త ఎజండా

Comments

Anonymous said…
A dream for Dependent Feminism or Feminism for more and more dependence on man and permanent and legalised parasitic life for women. But these feministic games in the name of marriage are up. Men are waking up.

By the way, why are you reviving an stale post ?
Anonymous said…
ఒకే కుటుంబసభ్యులైనా సరే, ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఇది సృష్టిసూత్రం. ఇది ప్రకృతి నియమం. అంతే గానీ ఒకరి ఆస్తుల మీదా, ఆదాయాల మీదా కన్నేయడం ఏంటి ? అసహ్యంగా ఉండదూ నైతిక దృష్టితో చూసినప్పుడు ? కుటుంబంలో పరస్పరం ప్రేమ, నమ్మకం ఉండాలి. అవంటూ ఉంటే ఇలాంటి డబ్బుకోరికలు కలగవు. కుటుంబపెద్ద మీద ప్రేమా, విశ్వాసమూ, వినయమూ, విధేయతా చూపించాలి. అప్పుడు సర్వశుభాలూ ఒనగూడుతాయి. అన్నింటికంటే ముందు స్త్రీపురుషులకు మంచి పెంపకం, మంచి బాల్యం ఉండాలి.

ఇలాంటివి పెళ్ళినీ, ప్రేమనీ ఒక డ్రామాగా మార్చేస్తాయి. ప్రేమ, త్యాగం స్థానంలో స్వార్థమూ, పరహింస, తీరని ఆస్తుల/ఆదాయాల ఆకలి ప్రవేశిస్తాయి. కుటుంబాలు అనేక కుట్రలకు నిలయాలుగా మారతాయి. మొదట్లో కొద్దిమంది లాభపడతారు. కానీ తరువాతి సంవత్సరాల్లో పెళ్ళి అనే వ్యవస్థే లేకుండా పోతుంది. అసలుకే ఎసరు తెచ్చే ఆలోచనలు మనకొద్దు. మనం చూడాల్సింది - కుటుంబాలలో పరస్పర ప్రేమా, శాంతి ఎలా నెలకొల్పాలనేది. ప్రేమను ఎలా ప్రచారం చేయాలనేది. డబ్బుడీలింగ్సు కాదు. ఎందుకంటే కుటుంబం అనేది కేవలం ప్రేమ మీదనే ఆధారపడి నడిచే వ్యవస్థ. అదే దాని ఆక్సిజన్. ఆస్తులూ, ఆదాయాలూ కాదు.
Anonymous said…
This comment has been removed by a blog administrator.
Satyavati said…
నా బ్లాగ్ నా ఇష్టం.
నా ఇష్టమైనన్ని సార్లు రీ పోష్ట్ చేస్తాను.
తాడేపల్లి గారూ మీరెందుకు పదే పదే నా బ్లాగ్ లో కొస్తారు?
మీకు ఇష్టం లేకపోతే దయచేసి గోదావరి వేపు రాకండి.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి వరదొస్తే ఉప్పెనలా ముంచేస్తుంది.
@విశాఖన్ గారూ వహవ్వా!!
మీ ఉపన్యాసానికి, వల్లించిన సూక్తి ముక్తావళికి హేట్సాఫ్.
డబ్బు చుట్టూ తిరిగే ప్రపంచంలో
డబ్బు కోసం, ఆస్థుల కోసం ఆడపిల్లల్ని చంపుకునే సమాజంలో
కేవలం మీకు (మగవాళ్ళకి)డబ్బు కట్టబెట్టాలనే దుర్బుద్ధితో 80000 వేలమంది ఆడపిండాల్ని అమ్మ కడుపులోనే కరిగించేసిన పాషాణులున్న ఆంధ్ర రాష్ట్రంలో
సిగ్గు లేకుండా,భయం లేకుండా గుళ్ళ చుట్టూ ప్రదక్సిణలు చేసే "పుణ్యాత్ములు" ఇన్ని వేల మంది ఆడపిల్లల్ని చంపేసారే ఇలా మాట్లాడ్డానికి మీకు నోరెలా వచ్చింది.
ఆస్తులు, వనరులు,పొలాలు, ఫ్యాక్టరీలు మీ గుప్పిట్లో ఉండొచ్చు.మేము మాకూ ఆస్తులు కావాలంటే
నీతి సూత్రాలూ,నైతిక విలవలూకుటుంబ ప్రేమలూ, మన్నూ,మశానం అన్నీ వల్లిస్తారు.
దేశం మూత్తం మీద పది లక్షల ఆడపిల్లల్ని చంపేసినపుడు,ప్రతి రోజూ కట్నం కోసం కట్టుకున్నవాడే కాల్చేస్తున్నపుడు ఈ నీతి సూత్రాలు వల్లించడానికి మీ నోళ్ళెందు పెగలవు.
ఇది తప్పు. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలంటే మహిళల్ని గౌరవించాలి,వాళ్ళ హక్కుల్ని గౌరవించాలి,ఇద్దరూ సమానమే.అన్నీ సమానంగా ఉన్న నాడు అసమానతలు కుటుంబంలో లేని నాడు మీరు వల్లించిన ప్రేమలు,అభిమానాలు వెల్లివిరుస్తాయి.
లేకపోతే ఆడపిల్లల్ని చంపిన హంతకులతోటి,సహజీవనం చెయ్యడానికొచ్చిన భార్యని కట్నం కోసమో ,కొవ్వెక్కో కాల్చేసిన హంతకులతోటి పోరాటం చెయ్యాల్సిందే.
ఈ విషయాలను మాట్లాడని వాళ్ళు అన్యాయంగా చచ్చిపోయిన వాళ్ళ ఉసురు పోసుకోవాల్సిందే.
Raghav said…
LOOOOOOOOOOOL... ;)
Anonymous said…
This comment has been removed by a blog administrator.
Anonymous said…
This comment has been removed by a blog administrator.
Anonymous said…
Madam

I have nothing against persons or their blogs. My approach is point-wise.
bhumika said…
తాడేపల్లి గారూ
నాకూ ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదండి.
చదువుకున్నామని,సంస్కారమున్నవారమనీ సూటూ బూటూ,టై లాంటి ఆధునిక వేషధారణలో అలరారే వారి మనస్సులెందుకింత సంకుచితంగా ఉన్నాయబ్బా అనేదే నా బాధ.
వాస్తవాలు చూడ నిరాకరిస్తూ చెదురు మదురు సంఘటనలకి ప్రాధాన్యమిస్తూ, అడ్డదిడ్డంగా వాదించే వాళ్ళ గురించే నా ఆవేదన.

Popular posts from this blog

అమ్మ...అమెరికా

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అశోకం