Wednesday, May 4, 2011

హింసించే పురుషులూ జరభద్రం-గులాబీదండు వచ్చేస్తోంది.



ఒక జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొడానికి నేను ఇటీవల లక్నో వెళ్ళాను. నవాబీ సంస్కృతి అడుగడుగునా కన్పించే లక్నో గురించి నేను విన్నది వేరు. కన్నది వేరు.

ఎయిర్‌పోర్ట్‌ నుంచి సిటీలోకి వస్తూంటే కిలోమీటర్ల మేర నిర్మితమౌతున్న మెగా పార్కుల్ని చూసి టాక్సీ డ్రైవర్‌ని ”బయ్యా! ఏ క్యాహై” అని అడిగితే ‘మాయనగర్‌. మాయావతి నిర్మిస్తున్న కాన్షిరామ్‌పార్క్‌, అంబేద్కర్‌పార్క్‌’ అని ఒక ఛీత్కారపు గొంతుతో అన్నాడు. ”ఆమె జనం కోసం చేసిందేమీ లేదు. విగ్రహాలు పెట్టడం, వాటిని కూల్చడం మళ్ళీ పెట్టడం ఇదే పని” అన్నాడు కోపంగా. దారి పొడుగునా పెద్ద పెద్ద హోర్డింగులు. మాయావతి ఫోటోలు. మాయావతి విగ్రహాలు.

టాక్సీడ్రెవర్‌ చెప్పినట్టు ఇది లక్నోనా? మాయనగరా? అన్పించింది. నాకు ఆసక్తి కల్గించింది ముఖ్యమంత్రి మాయావతి మహా ప్రచార హోరు కాదు. మరెవరు? నేను ఉత్తర్‌ ప్రదేశ్‌ వెళితే తప్పకుండా కలవాలనుకున్న వ్యక్తి సంపత్‌పాల్‌ దేవి. లక్నో నుండి సమావేశంలో పాల్గోన్న మహిళల్ని అడిగాను. సంపత్‌పాల్‌ని కలిసే అవకాశముందా? అని. ఆమెని ఈ రెండు రోజుల్లో కలవడం కష్టమని ఆమె బుందేల్‌ఖండ్‌ జిల్లాలో వుంటుందని చెప్పినపుడు అయ్యో! అన్పించింది.

ఎవరీ సంపత్‌పాల్‌ దేవి? ఏం చేసిందని నాకింత ఆసక్తి ఏర్పడింది ఆమె పట్ల? భారతదేశంలోని అతిపేద జిల్లాల్లో ఒకటైన బుందేల్‌ఖండ్‌ జిల్లాలో పుట్టింది సంపత్‌. పన్నెండేళ్ళ వయస్సుకే ఐస్‌ క్రీమ్‌లమ్ముకునే వ్యక్తితో ఆమె పెళ్ళి జరిగింది. ఐదుగురు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె వయస్సు నలభై ఒకటి. తిరుగబడే లక్షణాలు ఆమె రక్తంలోనే వున్నాయి. చిన్నపుడు తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపడానికి తిరస్కరించినపుడు ఆమె గ్రామంలోని గోడలమీద, దుమ్మునిండిన రోడ్ల మీద రాస్తూ తన నిరసనని తెలియచెప్పింది. చేసేదేమీ లేక ఆమె గొడవ భరించలేక స్కూల్‌కి పంపారు. అయితే పన్నెండేళ్ళకే పెళ్ళి చేసి, భర్త ఇంటికి పంపేసారు. 13 సంవత్సరాలకే మొదటి బిడ్డకు తల్లయింది సంపత్‌.

కొన్నేళ్ళకి ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తగా ఉద్యోగంలో చేరింది కానీ ఆ ఉద్యోగం ఆమెకు తృఫ్తి నియ్యలేదు. ”నా కోసమే బతకాలని నాకు లేదు. ప్రజల కోసం పని చెయ్యాలని కోరిక” అంటుంది సంపత్‌పాల్‌. గ్రామంలోని స్త్రీలను ఐక్యపరిచి మీటింగ్‌లు పెట్టేది. భర్తల దౌర్జనాలకు గురై ఇళ్ళనుండి వెళ్ళగొట్టబడిన స్త్రీలు, భర్తలు రెండో పెళ్ళిళ్ళు చేసుకుని భార్యల్ని నిర్లక్ష్యం చేసి కేసులు, ఎందరో బాధిత స్త్రీలు ఈమె దగ్గరకు వచ్చేవారు. వీరందరి కోసం ఏమైనా చెయ్యాలని ఆలోచించిన సంపత్‌ ”గులాబీ గ్యాంగ్‌” కు రూపకల్పన చేసింది.

2006లో గులాబీ గ్యాంగ్‌, సంపత్‌పాల్‌దేవి ఆ గ్యాంగ్‌ లీడర్‌గా ప్రారంభమైంది. గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల్ని ఆదుకోవడానికి, తప్పుచేసిన భర్తల్ని నయనా భయానా సరిదిద్దడానికి ఈ గ్యాంగ్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం గులాబీగ్యాంగ్‌లో 20,000పైగా మంది సభ్యులుగా వున్నారు. ఏ ఇంట్లో నయినా హింస జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే గ్యాంగ్‌ సభ్యులు ఆ ఇంటికి వెళతారు. భార్యల్ని కొట్టే భర్తల్ని కలిసి, ఇకపై కొట్టరాదని హెచ్చరిస్తారు. భర్త వీళ్ళ మాట విన్నాడా సరే లేకపోతే పెద్ద పెద్ద వెదురు బొంగుల్ని తీసుకుని ఆ ఇంటికెళ్ళి నాలుగు దెబ్బలు తగిలించైనా దారికి తెస్తారు. ”నేను ఒక కర్రతో గ్రామంలో తిరుగుంటే మగవాళ్ళు భయపడతారు. వాళ్ళను భయపెట్టడానికే మేం కర్రలుపయోగిస్తాం. మేము ఎపుడూ ఇలాగే చేయం కానీ నా చేతిలోని కర్రహింసలకి దిగే పురుషుల మైండ్‌సెట్‌ని ఖచ్చితంగా మారుస్తుంది. నేను బలవంతుణ్ణి అని విర్రవీగే పురుషుడు మా కర్రకి తలవొంచాల్సిందే” అంటుంది సంపత్‌పాల్‌దేవి.

గులాబీ గ్యాంగ్‌ సభ్యుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. సంపత్‌పాల్‌ ఓ డొక్కు సైకిల్‌ మీద గ్రామాల్లో పర్యటిస్తూ, చెట్ల కింద మీటింగ్‌లు పెడుతూ, ఆ గ్రామంలోని సమస్యల గురించి చర్చిస్తూ, కొత్త సభ్యుల్ని ఆకర్షిస్తుంది. కుటుంబ హింసకి పాల్పడే భర్తల్ని సరిదిద్దే క్రమంలో ఆమె లెక్కలేనన్ని కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మీదున్న నేరారోపణలు ఏమిటంటే - చట్టవిరుద్ధంగా సమావేశమవ్వడం, ప్రభుత్వ అధికారులపై దాడి చెయ్యడం, అల్లర్లకి పాల్పడడం ఇలా ఎన్నో నేరాలు ఆమె మీద ఆరోపించబడ్డాయి. వీటన్నింటితోను, బాధిత స్త్రీలతోను ఆమె ఉద్యమం ముందుకెళుతోంది. బాధిత స్త్రీలు గులాబీదండు కార్యకర్తలుగా మారి తోటి బాధితులకి అండగా వుండడం ఈ గ్యాంగ్‌ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

గులాబీదండుకి, సంపత్‌పాల్‌కి మీడియా గొప్ప ప్రాధాన్యతనిచ్చి ప్రచారం కల్పించడం విశేషం. గులాబీదండుకి ఈ రోజు ఫ్రాన్స్‌ ఛాప్టర్‌ మొదలైంది. ఫ్రాన్స్‌ గులాబీకి సిసిలీ రొమానే నాయకత్వం వహిస్తూ ”నాకింకా కర్ర పట్టు కోవాల్సిన అవసరం రాలేదు. నా గులాబీ చీరను మాత్రం పారిస్‌ వీధుల్లో చింపి ప్రదర్శించాను” అంటుంది. బి.బి.సి లో సంపత్‌ మీద పెద్ద స్టోరీ వచ్చింది.

రాజకీయాల్లోకి రావాలని గానీ, డొనేషన్స్‌ సేకరించాలని గానీ సంపత్‌కు లేదు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయవతి ఒక దశలో సంపత్‌ తనకు రాజకీయంగా పోటీ అవుతుందేమోనని భయపడి గులాబీ దండును అంతం చేయాలని చూసి, కుదరక తన పార్టీలో చేరమని పిలిచినపుడు సంపత్‌ నిర్ధ్వంద్వంగా తిరస్కరించింది. మాయవతి అవినీతికి పాల్పడిందనేది సంపత్‌ ఆరోపణ. అవినీతి రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసే కన్నా వాటికి దూరంగా వుంటే మేలని ఆమె నమ్మకం.

” నా బలం బొంగు కర్రల్లో లేదు. గులాబీ దండు సభ్యుల్లో వుంది. ఏదో ఒక రోజు మేం ఢిల్లీని వొణికిస్తాం” అనే సంపత్‌ నిజంగానే ఏదో ఒకరోజు గృహహింసకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టొచ్చు.

భర్తలు (భరించేవాళ్ళు) కనుమరుగై కేవలం మొగుళ్ళే (హింసించేవాళ్ళు) మిగులుతున్న ఈ రోజుల్లో ఢిల్లీ సంగతి తర్వాత, గల్లీ గల్లీకో సంపత్‌ పుట్టాలి. వెదురు బొంగులో, ‘గోరంత దీపం’ సినిమాలోలాగా చింతబరికెలో పుచ్చుకుంటే తప్ప పెచ్చు మీరిపోతున్న హింసకి అడ్డుకట్ట వేయలేమోమో! రకరకాల హింసలకి పాల్పడుతున్న ”అత్యాధునిక” పురుషులూ జరభద్రం.గులాబీదండు వచ్చేస్తోంది.





26 comments:

Anonymous said...

సంపత్ దేవి కథ నిజంగానే చాలా మందికి ఆదర్శం. మగవారికి కూడా.

ఏదో ఒక రోజు భారత దేశములో మగవారు కూడా ఇలా చట్టాన్ని తమ చేతులోకి తీసుకోక తప్పేలా లేదు. ఆమె ఉన్న చోట చట్టం లేకపోవడం సమస్యైతే, చాలా చోట్ల.. ముఖ్యంగా ఒక మోస్తరు పట్టణాలను మొదలు కొని పెద్ద పెద్ద పట్టణాల వరకూ చట్టాలే సమస్యగా మారి పురుషుల జీవితాలను సర్వ నాశనము చేస్తున్నాయి. తమ సొంత ఇంటినూండి తాము వెలివేఅయ బడడానికి కారణ మవుతున్నాయి.

Anonymous said...

ఆకాశరామన్నగారితో ఏకీభవిస్తున్నాను.

చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలు ఇక్కడ వ్రాయక ముందే మీకు స్ఫురించి ఉండాలి. మగవాళ్ళు వ్యక్తిగతంగా చేస్తే హింస అయినది ఆడవాళ్ళు సామూహికంగా చేస్తే ఒక గొప్ప సంఘసంస్కరణ ఉద్యమం ఎలా అవుతుంది ? ఆడదాన్ని హింసించాలంటే ఆమెని కొట్టి తీఱాలా ? లేదా వార్నింగులతోనూ, కొట్టడాలతోనూ సంసారాలు బాగుపడతాయా ? మగవాళ్ళు ఒక మగదండు పెట్టుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి ? సరే, ఇది భార్యల్ని హింసించే మగవాళ్ళకోసం. మఱి భర్తల్ని హింసించే ఆడవాళ్ళక్కూడా ఇదే పద్ధతి అమలు పఱుద్దామా ? కొట్టడమూ, కొట్టించడమూ, కొట్టించుకోవడమూ కాదు గదా పెళ్ళిళ్ళ పరమార్థం ? ఇది ఒక సర్వసాధారణ విషయం అయ్యాక నష్టం ఎటువైపు ఎక్కువగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న చట్టాలు ఉనికిలోకి రావడం వెనుక సానుభూతి చాలా పెద్దపాత్ర పోషించింది.

నాకెందుకో ఒక మూల "ఈ పరిణామం కూడా ఒకందుకు మంచిదేనేమో" అనిపిస్తోంది. :)

Krishna K said...

భలే వారే , భర్తలను భర్తలని చెప్పుకోవటానికి నామోషీ అయ్యి "సహచరులు" అంటూ "గౌరవించే" సాధ్వీమణులు పెరుగుతున్న రోజులలో ఇంకా మొగుళ్ళు మిగిలేఉన్నారంటారా? :))

Anonymous said...

ఏదో ఒక రోజు కాదు ఆకాశ రామన్న గారు త్వరలోనే భారత దేశములో మగవారు కూడా ఇలా చట్టాన్ని తమ చేతులోకి తీసుకోక తప్పేలా లేదు. పేద కుటుంబాలలో జరిగే ఘటనలను (వరకట్నం , గృహ హింస) చూసి ప్రభుత్వాలు చట్టాలు చేయటం. చివరికి ఆ వర్గాల వారు డబ్బులు లేక కోర్ట్టుకి పోకుండా ఇలా ఎర్ర్ర దండు తో వారి సమస్యలను పరిష్కరించుకొంట్టున్నారు. కాని ఈ చట్టాలను అడ్డం పెట్టుకొని మధ్య, ఎగువ మధ్య తరగతి స్రీ లు, లాయర్లు పురుషులను బాగా యక్స్ ప్లాయిట్ చేయటం ఎక్కువైంది. ఈ రోజులలో కొంతమంది స్రీలు, వారి తల్లిదందృలు డబ్బులు కావలనుకున్నపుడు విడాకుల కేసు వేసి పురుషులను పీక్కతినటం గురించి అందరికి తెలిసిన విషయమే!
సమాజం తో ఎంతో మమైకమయ్యే సత్యవతి గారి లాంటి వారికి స్రీల వలన బాధపడె పురుషుల సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతూ ఉండటం ఇప్పటివరకు కనపడలేదా?

Praveen Mandangi said...

పురుషాహంకార గజ్జి కుక్కలు తాము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్పు కాదంటారు కానీ ఇతరులకి శ్రీరంగ నీతులు చెపుతారు.

maa godavari said...

నేను పురుషులందరినీ సంబోధించి రాయలేదు.
హింసకి పాల్పడే పురుషుల్ని మాత్రమే.
యుగాలుగా పురుషులు చట్టాన్ని అతిక్రమించి హత్యలు చేస్తూనే ఉన్నారు.
ఎన్నని చెప్పాలి.సతీ సహగమనం మొదలుకొని కట్నం హత్యలు, పెళ్ళి లో హత్యలు,ఇప్పుడు ప్రేమ హత్యలు,
ఇవన్నీ చట్టాన్ని అతిక్రమించి చేసినవే,చేస్తున్నవే.
హింసకి ఎవరు పాల్పడినా తప్పే.స్త్రీలు పురుషుల్ని హింసించే స్థాయికి వస్తే బోలెడు చట్టాలున్నాయి.వాడుకోండి.కేసులు పెట్టండి.కోర్టులకు లాగండి.
ఆకశరామన్న గారూ@ చట్టాన్ని మీ చేతుల్లో కి ఎప్పుడో తీసుకోవడం ఏంటి.ఇప్పుడు చేస్తున్నది అదేగా.
చట్టాలొచ్చాయని వగచే బదులు అసలు ఆ చట్టాలు రావాల్సిన అవసరమెందుకొచ్చింది అని ఆలోచించరే.
ఎప్పుడొ రొడ్డ కొట్టుడు వాదనలేనా?
జరుగుతున్న పరిణమాలు అర్ధం చేసుకోరా?
రామా నో రమానో@ గానీ మీ అవగాహనా రాహిత్యానికి చాలా బాఘ వేస్తోంది.
హింస, వరకట్నం,గృహ హింస పేద కుటుంబాల్లో నే జరుగుతాయంటే దీన్ని మించిన అబద్దం ఇంకోటి లేదు.నానా హింసలకి పాల్పడుతున్నది మధ్య,పై మధ్య తరగతి కూడా.
స్త్రీల వలన బాధపడే పురుషుల శాతం ఎంత??
ఇండియన్ పీనల్ కోడ్ లో బొలెడు సెక్షన్లున్నాయి. వాడుకోండీ.
ఎవరైనా హింసల్ని ఎందుకు భరించాలి? స్త్రీలైనా పురుషులైనా సరే???

maa godavari said...

ప్రవీణ్ శర్మ గారూ
ఒకే వాక్యంలో పురుషాహంకారులకు జలక్ ఇచ్చారు.అయితే మనం సంస్కారవంతమైన భాషనే వాడదాం.

Malakpet Rowdy said...

ఇంకేం? శుభం! ఆడంగులంతా ఒకవైపు కర్రలతో మగంగులంతా ఒకవైపు కత్తులతో చేరిపోయి కొట్టేస్కోండి. ఎవరు బలవంతులైతే వాళ్ళే గెలుస్తారు, ఓడిన వాళ్ళు వాళ్ళ్ అమాట వింటారు. దెబ్బకి ఈ గొడవలుండవ్!

Anonymous said...

సత్యవతి గారూ,

నేను కూడా స్త్రీలందరి గురించి రాయలేదు కదండీ. చట్టాల్ని తమ స్వార్థ ప్రయోజనాలకోసం, మగవాడికి "గుణపాఠం"(?) నేర్పడం కోసం వాడుకునే స్త్రీల గురించి మాత్రమే రాస్తున్నాను.

<< యుగాలుగా పురుషులు చట్టాన్ని అతిక్రమించి హత్యలు చేస్తూనే ఉన్నారు.

అంటే, ఇక మా వంతు ఆ కష్టాలన్నీ మీరు పడండీ అంటారా? అసలు యుగ యుగాల స్త్రీలకు, ఇప్పుడున్న మీకు ఉన్న సంబందమేమిటండీ.. ప్రతీదానికీ యుగ యుగాలదాకా వెల్లిపోతారు? అలానే, యుగ యుగాలుగా హిన్సించిన పురుషులకూ మాకూ ఉన్న సంబంధమేమి? వారి చేసిన తప్పులకు ఈ కాలములో గృహహింస లాంటి Draconian Laws కి మేము ఎందుకు బలవ్వాలి? సతీ సహగమనానికి, వరకట్న హత్యలకు పాల్పడిన వారిని శిక్షిస్తే కాదనేది ఎవరు? ఎటొచ్చీ అవి దుర్వినియోగమయ్యి అమాయకులు పెద్ద సంఖ్యలో బాధితులుగా మిగులుతున్నారు మొర్రో అంటే.. తర తరాల కష్టాలు లెక్కలు చూపించి, ఇప్పుడు జరుగుతున్న దాన్ని సమర్ధించ చూస్తేనే సమస్య.

మేము చట్టాలొచ్చాయని వగచడం లేదండీ సత్యవతిగారూ, ఆ చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని విలపిస్తున్నాము. రెండింటికీ తేడా తెలీకపోతే చేయగలిగింది ఏమీలేదు. రొడ్డ కొట్టుడు వాదణలతో స్త్రీలు మాత్రమే గృహహింసకు లోనవుతారని స్త్రీవాదులు చేసే అసత్య ప్రచారాలను నిరసిస్తున్నాము. అది కూడా తప్పంటే, మమ్మల్ని ఆ హింసను అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పడమే.

చట్టాలు చేసేప్పుడూ చెప్పిన ఉద్దేశ్యాలకూ, ఒక సారి ఆ చట్టాలు అమలులోకి వచ్చి దుర్వినియోగమవుతున్నప్పుడు వాటిని అరికట్టకపోవడములో ఉన్న ఉద్దేశ్యాలకీ తేడా నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను.

స్త్రీలు హింసిస్తే, అనేక చట్టాలున్నాయి వాటిని ఉపయోగించుకోండి అంటున్నారు. మరి, అంత గొప్ప చట్టాలు అక్కడుండగా స్త్రీవాదులు 498A, DV Act లాంటి Draconian Lawsని రూపొందించాల్సిన అవసర మేముందండీ? స్త్రీలను కూడా వాటినే ఉపయోగించమని చెప్పొచ్చు కదా?

ఇప్పుడైనా మేము చెప్పేది ఏమీలేదు, దుర్వినియోగం చేయడం కూడా గృహహింస కిందకే వస్తుంది. కాబట్టి, అది చేస్తున్న వారిని గృహహింస చేస్తున్న వారితో సమానంగా శిక్షిచండి. అంతే. దూర్వినియోగం చేయడం అంటూ ఉండదు.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

సత్యవతి గారికి తెలియదేమొ ఈ దేశం లో కోర్ట్టు కేళితే న్యాయం జరగడానికి ఎంత కాలం పడుతుందో అని. 120 కోట్ల జనాభా గల ఈ దేశంలో బతకటానికి యుద్దం చేయవలసి వస్తుంటే, ఇంకా కోర్ట్టు చుట్టు తిరుగుతూ సంపాదించింది లాయర్లకు సమర్పించుకొని వీధిన పడాలని మీ ఉద్దేశం కాబోలు.
అదికాక నేనెక్కడా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారి గృహాలలో హింస లేదు అని రాయలేదు. మీరు చెప్పిన చట్టాలను ఉపయోగించుకొని మధ్య,ఎగువ మధ్యతరగతి మగ వారిని పీక్కతినటం గ్లొబలైసేషన్ తరువాత మొదలైన కొత్త వ్యాపారం. మొన్నా ఆమధ్య తెలుగు పేపర్లో చదివాను పురుషులపై పెట్టిన కేసులలో 80% కొట్టివేయబడ్డాయని. అన్ని తప్పుడు కేసులను పురుషుల పై బనాయించి వారిని, వారి తల్లిదండ్రులను మానసికం గా హింసించాలనే దుర్బుద్ది ఆడవారికే ఎక్కువగా ఉన్నదని తెలుస్తునాది. చదువుకొని తెలివి మీరిన ఇటువంటి అతివలను వెనక వేసుకొచ్చే మీలాంటివారు కనీసం మగ వారి సమస్యలను మానవత్వం తో చూడటం లేదు. ఆ కోణం లో మీరు చూసి ఉంటే, తప్పుడు కేసులు పెట్టారు అని తెలిస్తే, కేసులు పెట్టిన స్రీ/పురుషుల కి శిక్షలు ఉండాలని పట్టుబట్టేవారు. కాని ఆపని మీలాంటి వారు ఎక్కడా చేయట్లేదు కారణం స్రీలే అన్యాయాలకు ఎక్కువగా పాల్పడుతూ ఉండటం .
మీకు ప్రవీణ్ గురించి ఎంత తేలుసో నాకు తెలియదు గాని. ప్రవీణ్ వ్యాఖ్యని బ్లాగులోకం లో ఎవరైనా స్వాగతిస్తే వారికి ఉన్న విలువ తగ్గుతుందని మీరు తెలుసుకొంటే మంచిది

Praveen Mandangi said...

క్షమించాలి, వాళ్ళని కుక్కలతో పోలిస్తే కుక్కలు సిగ్గుపడతాయి. శునకరాజములకి విశ్వాసం ఉంటుంది కానీ మగమహారాజులకి విశ్వాసం ఉండదు.

Kathi Mahesh Kumar said...

గులాబీ గ్యాంగ్ గురించి అపర్ణ మల్లాది చెప్పినప్పుడు చిత్రంగా అనిపించింది. కానీ మొత్తం విన్నతర్వాత అవసరమే అిపించింది. చట్టాలు పనిచెయ్యని రాష్ట్రాల్లో ఇలాంటివి తప్పవు.

Praveen Mandangi said...

చట్టాలు ఏ రాష్ట్రంలో పని చేస్తున్నాయి కత్తి? మన దేశంలో అవి కేవలం నీటి మీద వ్రాతలే కదా.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Satyavati gaaru,

hmm.. whatever is the cause, someone taking the law into their own hands is something that leaves a sour taste in my mouth. When the Law itself or inspite of the law, someones existance is threatened and human rights are violated, law can be taken into hands only as a temporary measure.

But please, glorify the fighting spirit and commitment of the people. But do not glorify the idea of గులాబీ గ్యాంగ్‌ as such. Gulabi Gang, Salwa Judum, religious goons all of them are same and are a threat to democracy and rule of law.

@ Praveen Sarma gaaru

>> చట్టాలు ఏ రాష్ట్రంలో పని చేస్తున్నాయి కత్తి? మన దేశంలో అవి కేవలం నీటి మీద వ్రాతలే కదా.

We are not that bad. But I agree there are a lot of issues and injustices. ఒకవేళా మీరన్నట్టే ఉన్నా, మన పోరాటం చట్టాలని పని చేయించడం మీద జరగాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీకోవడానికి కాదు.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

LBS తాడేపల్లి గారు,

>>ఇప్పుడున్న చట్టాలు ఉనికిలోకి రావడం వెనుక సానుభూతి చాలా పెద్దపాత్ర పోషించింది.

హ్మ్.. చాలా చట్టాలు థీరిటికల్ గా సమర్ధించలేనివే కానీ, వాటి వెనక ప్రాక్టికల్ అంశాలు ఉన్నాయి. సానుభూతి కాదుగానీ ప్రస్థుత పరిస్థితులకనుగుణంగా వచ్చాయని చెప్పుకోవచ్చు.

A man and woman are equal. a law cannot diffrentiate between them. But if you take the social conditions into consideration, a man who is separated from his wofe has a better chance for survival than a woman who is separated from husband.

Until civil society shows the maturity the laws are bound to have some bias. When there is bias, there will be some people who suffer.. Lets hope we as a society change ourselves and see a day when there is no diffrentiation.
కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పినట్టు, మనుషులు సంస్కారవంతులయితే చట్టాలతో పనేలేదు. మనుషుల్లో సంస్కారం లోపించినప్పుడు చట్టాలు చెయ్యక తప్పదు.

maa godavari said...

"కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పినట్టు, మనుషులు సంస్కారవంతులయితే చట్టాలతో పనేలేదు. మనుషుల్లో సంస్కారం లోపించినప్పుడు చట్టాలు చెయ్యక తప్పదు."
వీకెండ్ పొలిటీషియన్ గారూ
ఈ సంస్కారం,సెన్సిటివిటి లోపించడం వల్లే ఈ రోజు కుటుంబాల్లో ఇన్ని ఘర్షణలు.
కర్రలు తీసుకుని కొట్టుకోమని నేను చెప్పడం లేదు.
హింస పెచ్చుమీరిన చోట బాధితులు ప్రత్యమ్నాయాలు వెతుక్కుంటారు.దీనికి ప్రభుత్వాల వైఫల్యమే ప్రధాన కారణం.
మీ సంస్కారానికి అభినందనలు.

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

@Weekend Politician,

Until civil society shows the maturity the laws are bound to have some bias. When there is bias, there will be some people who suffer.. Lets hope we as a society change ourselves and see a day when there is no diffrentiation.

these kind of three-fold Utopian dreams are good, when we are writing some poetry (No offense). When it comes to reality, we can't achieve at least 1% of it without our fight against the atrocities committed by both parties (The So called oppressor and oppressed classes)

If we look at the history, No civil society ever shown the maturity that we dreamed off and may not shown in the future too. All it can show is a blatant shift from one state to another state. The only thing that existed in past and exists in future is fight against atrocities committed by one on other.

If we leave this as it is, the oppressor become oppressed and vice versa but we can't achieve that matured civil society.

Anonymous said...

And no need to say, We may achieve the matured civil society with our continuous fighting against the evil. But not that "we can get rid off the evil once we attain matured civil society" it will never happen in this way.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

ఆకాశరామన్న,

I think you did not understand what I wrote.

I am not saying that we should abondon struggle against injustice. Did I ever say that?

What I am trying to say in simple is,

1. Due to practical reasons some laws will have bias.
2. We need to struggle and also reform ourselves to remove the bias in the laws
3. I can understand the underlying reasons and appreciate the fight and struggle but I won't encourage people taking law into their own hands.

Civil society will not become a matured one or an ideal one. The point is the society keeps on making progress in that direction. Just because there is no end to it, we can not simply conclude that all this is useless.

Don't you think the human societies world over are making improvements and are getting better with each century? I think they are.

That's the simple message I am trying to convey. Now wake up from your Hallucinations (No offense intended from my side too)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

And Yes, we need to say that Evil or Good are relative terms based on the collective wisdom of the society.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

hmmm.. upon review, I think it is better to rephrase my sentence to prevent misunderstanding..

"Lets hope we as a society change ourselves and see a day when there is no need for diffrentiation in the laws."

Anonymous said...

@weekend politician,

I did understand what you wrote. But, if it is not what you intended to write, it's O.K.

My intention to that reply is simple. No one will tolerate this injustice until the so called matured civil society attained.period.

It may occur or may not occur. If we use the word practical, we better stay away from this word "matured civil society" which never attained by any civilization in the history and may not attained in future by our civilization too.

Anonymous said...

I am not saying that we should abondon struggle against injustice. Did I ever say that?

Well, if that matters, you never even said that we need to struggle to end the evil in all forms.

1. Due to practical reasons some laws will have bias.

I hope,you are not asking men to suffer endlessly in the name of practical reasons. Because, when the word practical introduced in the context, we can't find anyone who are ready to be suffered by others.

And what about the punishment for the misuse of the laws. Leaving those misusers Scott free wrecks the society. It is like, remedy is more lethal than the actual problem. What's you say about this?

We need to struggle and also reform ourselves to remove the bias in the laws..

If these 2nd and 3rd points appeared in your previous comment, my response would not be like that. May be, a simple communication gap created unnecessary rift. :)

That's the simple message I am trying to convey. Now wake up from your Hallucinations (No offense intended from my side too)

No offense taken, even if it is intended. And I am just replying to a comment, taking the meaning of it bit by bit, without assuming too much either in negative direction or positive direction.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

Sadly, my questions still remain unanswered. Besides, we are being abused in filthy language. Using filthy language against us and, in turn calling us "ahamkaaris" - It is all highly amusing and exposes the hollowness of feminism.

We are being abused for asking questions. We are being called male chauvinists for our appeal to recognize even men as human beings who deserve human rights and dignity just like women.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...