Wednesday, May 18, 2011

పెళ్ళిళ్ళ బజార్లో ఇంకా నిర్లజ్జగా వరవిక్రయాలు.

కాళ్ళకూరు నారాయణ రావు గారు "వరవిక్రయం" నాటకం రాసి దాదాపు 90 ఏళ్ళయ్యింది.
అందులో నాయకురాలు కాళింది.

"కట్నమే కోరివచ్చిన ఖరముతోడ
దగుదునని కాపురము సేయు కంటే
బెండ్లియే మానుకొని మగబిడ్డవలె
తల్లిదండ్రుల కడ నుడుత తప్పిదంబే?"
అంటుంది.

కట్నం కోరే పెళ్ళికొడుకులనూ,కట్నాలకు,లాంచనాలకూ బేరాలాడె పెళ్ళికొడుకు తండ్రులను ఊద్దేశించికాళింది తండ్రి ఇలా అంటాడు.

"....... అబ్బాయి పెండ్లితో నప్పుసప్పులు తీర్చి
నిలవ సేయగ జూచు నీచులార
ముడుపులుగొని తెచ్చి ముంగలనిడుదాక
పల్లకి ఎత్తని పశువువులారా
ఏమి యన్యాయ మిదిపూర్వమెన్నడేని
వరుల నిటు విక్రయించు వారు గలరే??
పుణ్యతరమైన మన పుణ్యభూమి యందు
గటగటా నరమాంస విక్రయయము దగునే!"

బుద్ధి తెచ్చుకున్న కాళింది అక్కను వివాహం చేసుకోవడనికి ముందుకొచ్చిన వరుడు

"కట్నాలకై పుస్తకములు చేగొని  పాఠ
శాలలకేగెడు చవటలారా!పిలిచి కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన వారి
కొంపలమ్మించెడి కుమతులారా
అల్క పాంపులెక్కి అవి ఇవి కావలె
నని శివమాడెడి అధములారా
ఎంత పెట్టిన తిని యెప్పటికప్పుడు
నిష్టురోక్తులే పల్కు నీచులారా"

భర్తకి మామగారికి బుద్ధి చెప్పిన కమల కాళింది అక్క

"....... కోరిన వెల ఇచ్చి కొని తెచ్చుకున్న
దాసులకు దాస్యము సేయు సుదతులారా
మీ వివాహములకై మీ వారు రుణముల
పాలౌట గని యోర్చు పడతులారా
ఎంచి చూడగ స్త్రీ జాతి కింత కన్న
గౌరవము లేమి ఇల మరి కలదే?చాలు
జాలు నికనైన పౌరుష జ్ఞానములను
గలిగి మెలగుడు సత్కీర్తి గనుడు"

విజ్ఞులు,మేధావులు,ఆధునికులు, పురుషవాదులు,ఆధునిక,అమానవీయ
వర విక్రయం గురిచి ఎందుకు మాట్లాడరో!!!!!!!
ఆనాడే ఆ మహానుభావుడు నరమాంస విక్రయమని ఈసడించినా
అత్యాధునిక యువకులు తమని తాము వేలకి, లక్షలకి, ఒండొకచోట కోట్ళని తమని తాము సిగ్గు శరం,ఆత్మాభిమానం,ఆత్మగౌరవం లేకుండా అమ్ముకుంటున్నారే???
మమ్మల్ని మేము అమ్ముకోం.మీ అమ్మాయికి మీ అబ్బాయికిచ్చినట్టు ఉనందాంట్లో పంచి ఇవ్వండి.ఉభయులకూ గౌరవంగా ఉంటుంది అని ఎందుకు అనడం లేదు.
ఎందుకు??????????????????????




















7 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

ఇంకొక శాతాబ్దానికైనా బిలియన్ రూపాయల ప్రశ్న ..ఇది.. ప్రశ్నిస్తే పోయేది ఏం లేదు..అడగడం ..స్త్రీల హక్కు మాత్రమె కాదు.. అక్క చెల్లెళ్ళు,ఆడ పిల్లలు ఉన్న.. పురుషుల గొంతుకలు విప్పినరోజే.. ఈ ప్రశ్నకి బలం.

నాగప్రసాద్ said...

వరకట్నం విషయంలో నాది ఎప్పుడూ ఒకటే వాదన. కట్నం ఇచ్చేది మగవాళ్ళే, పుచ్చుకునేది మగవాళ్ళే. కట్నం డబ్బులు సంపాదించడం కోసం సాధకబాధలేవో మగవాళ్ళే పడతారు అన్నది నా పాయింట్. కాకపోతే, మీరు ఒకటే కోరవచ్చు, పెళ్ళయ్యాక అదనపు కట్నం కోసం డిమాండ్ చెయ్యకండి అని అంతే. పెళ్ళికి ముందు కట్నం అడిగితే తప్పేంటి? ఇవ్వగలిగితే చేసుకుంటారు లేకపోతే లేదు అంతేకదా!

Anonymous said...

anduke .. papam aadapilla puttagaane vaddu anukuntunnaru ..inkaa ..

Anonymous said...

The possible solutions

1) No (limited) inheritance (land, money, wealth) from generation to generation. AND/OR

2) Equal distribution of wealth among all Children. AND/OR

3) 75% of tax on inheritance (all forms) AND/OR

4) Life (long) imprisonment for people who stash Indian wealth in other countries (Swish, etc) AND/OR

5) Two children policy AND/OR

6) Strict implementation of anti-dowry laws AND/OR

7) Social/cultural reforms AND/OR

8) Empower Women financially AND/OR

8) Pass laws to implement inheritance through women only.

Praveen Sarma said...

కట్నం ఇవ్వాల్సి వస్తుందనే ఆడపిల్లలు కడుపులో పిండంగా ఉండగానే అబార్షన్ చెయ్యించుకుంటున్నారు. కట్నం అనేది డబ్బున్నవాళ్ళకి స్టేటస్ సింబల్ కానీ మిడిల్ క్లాస్‌వాళ్ళకి భారం.

Anonymous said...

పాపం కొందరికి కట్నం తీస్కొవాలని ఉండదు. కాని వాళ్ళకు ఉన్న అప్పులు తీర్చుకొడనికి కట్నం తెస్కుని అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని అప్పుల్లొకి నెడతారు.

Praveen Sarma said...

మా బంధువొకతన్ని అతని సొంత మరదలికి ఇచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళైన తొమ్మిది రోజులకే కట్నం కోసం పుట్టింటికి పంపేశాడు.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...