వెన్నెల్లొ హాయ్ హాయ్-సూపర్ డూపర్ చాంద్అబ్బ! చంద్రుడు నిజంగానే సూపర్గున్నాడు.
ఏమి వెన్నెల కురిపిస్తున్నాడు.ఎంత హొయలు పోతున్నాడు.
తిలక్ అమృతం కురిసిన రాత్రి ఇల్లాంటి చంద్రుణ్ణే చూసి ఉంటాడు.
లాహిరి లాహిరి పాటలో కూడా ఇలాంటి చంద్రుడే.
నేను లఢాఖ్ లోని లేహ్ కొండల్లో చూసింది ఇలాంటి చంద్రుణ్ణే.
మా సీతారామపురంలో ఆరుబయట మంచాలేసుకుని పడుకునే రోజుల్లొ ప్రతి పున్నమికి చూసింది ఇల్లాంటి చంద్రుడినే.
టాంక్ బండ్ మీద ఫోటో తియ్యబోతే ఇదిగో ఇలా బంగారు రంగు జీళ్ళపాకంలా వచ్చింది ఓ ఫోటో.
కావాలంటే చూడండి.

Comments

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం