టైడాలో జంగల్ బెల్స్ -తనువూ మనసూ తన్మయమైన వేళ
నేనో మూడు రోజులపాటు అన్ని శబ్దాలకూ దూరంగా కేవలం పక్షుల శబ్దాలను మాత్రమే వింటూ గడిపాననంటే మీరు నమ్ముతారా?

నమ్మాలి మరి.విశాఖ నుంచి అరకు అరకు నుంచి టైడా.
టైడా గురించి మీరు విన్నారా?
జంగల్ బెల్స్ గురించి విన్నారాపోనీ.
విశాఖ నుంచి డెబ్భై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో అందమైన కొండలు లోయల మధ్య టైడా ఉంది.
ఏపి టూరిజంవాళ్ళు గొప్ప టేస్ట్ తో కట్టిన అథిధి గృహాల సముదాయం ఉంది.
దూరదర్శన్లు, దూరవాణులు పనిచెయ్యని ఏకైక ప్రదేశం.
గొప్ప నిశ్శబ్దం,చిక్కటి అడవి లో ఆ నిరామయ స్థితిని అనుభవించాల్సిందే.
నిండు అమావాస్య రోజున ఆ అడివి అందాన్ని నక్షత్రాల వెలుగులో చూడాల్సిందే.
చెవులు పగిలిపోయే నగర శబ్దకాలుష్యాన్ని భరిస్తున్న మనం
జంగల్ బెల్స్ లో కేవలం పక్షుల పాటలనే వినడం అబ్బో ఆ ఆనందాన్ని వర్ణించడం సాధ్యం కాదు.
ఫోన్ తోనే పుట్టినట్టు,టివీని మెళ్ళో వేసుకుని బతుకుతున్నట్టు
భ్రమ పడుతున్న జనాలకి అంతటి నిశ్శబ్దం భరిచడం కష్టమే.
ఉదయాన్నే ఎన్ని రకాల పక్షులు సామూహిక గాన కచేరి పెట్టాయని.
కళ్ళు మూసుకుని కూర్చుంటే చాలు చెవులు తన్మయమైపోతాయి.
జంగల్ బెల్స్ నా గుండెల్లో గణగణ మోగుతున్నాయ్.
ఇంతకన్నా రాయలేని,తనివితీరని స్థితిలో తరించిపోతూ....

Comments

Good to know about this facility. Thanks for sharing.

You could have mentioned the procedure to book guest houses here. Also, are these GH available throughout the year or only certain seasons. What is best time to go there, e.t.c.
SHANKAR.S said…
నిశ్శబ్దం లో ఉండే అందం అనుభవించాలంటే ఇది సరైన ప్లేసండీ. అన్నిటికన్నా నాకు నచ్చిందేంటంటే మొబైల్ సిగ్నల్స్ లేకపోవడం. ఆ మొబైల్ అనే రాక్షసిని వదిలేసి ప్రపంచం తో సంబంధం లేకుండా హాయిగా ఎంజాయ్ చేయచ్చు. రాత్రి పూట గేట్ దాటి అలా ఆ రోడ్ మీద నడుస్తుంటే భలే ఉంటుంది (మేం కావాలని పౌర్ణమి టైం లో వెళ్లాం) :)

అన్నట్టు ట్రెకింగ్ చేసారా?
ఇందు said…
వావ్! నేను ఈ ప్లేస్ చూసానండీ అరకు వెళ్ళేటప్పుడు....గుడిశెలులాగా ఉండే థీంతో ఏపీటీడీసీవారు కట్టారు కదా! కానీ అక్కడ బస చేయలేదు.మీరు అద్రుష్టవంతులు :) అలాంటి ప్రదేసాలు చాలా అరుదుగా ఉంటాయి :)

Popular posts from this blog

‘వైధవ్యం’ – రసి కారుతున్న ఓ రాచపుండు

అమ్మ...అమెరికా

అశోకం