Tuesday, November 2, 2010

జండర్‌ స్పృహ లోపించిన సర్వోన్నత న్యాయస్థానం

అక్టోబరు 20 యావత్‌ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా  ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో సాధారణ పౌరులో, సామాన్య వ్యక్తులో దీనికి కారణం కాదు.అలాగని సామాన్య వ్యక్తులు చెయ్యెచ్చని అర్ధం కాదు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ మహిళల్ని ''ఉంచుకున్నవాళ్ళు''గా వ్యాఖ్యానించి, స్త్రీలని భార్యలుగా, ఉంచుకున్నవాళ్ళుగా, ఒక్క రాత్రి గడిపి వెళ్ళిపోయే వాళ్ళుగా విడదీసి వ్యాఖ్యానించింది. వివాహానికి వెలుపల బతుకుతున్న కోట్లాది మంది గుండెల్ని గాయపరచడమే
 కాక చాలా తిరస్కార భావంతో అవమానపరిచింది. ముష్టి రూ. 500 భరణం కోసం పచ్చియమ్మాళ్‌, వేలుసామికి 'ఉంచకున్నది'గా ముద్ర వేయించుకోవలసి వచ్చింది. కలిసి బతికామని, తనకు భరణం ఇప్పించాలని న్యాయస్థానాలను ఆశ్రయించిన ఆమె భయంకరమైన ముద్రను భరించాల్సి వచ్చింది.

ఈ తీర్పును వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్‌ మార్కండేయ కట్జు, జస్టిస్‌ టి.ఎస్‌.ఠాగూర్‌లు తాము 21 వ శతాబ్దంలో బతుకుతున్నామనే స్పృహని కోల్పోయి 'కీప్‌' అనే పదాన్ని వాడి, తమకి జెండర్‌ సెన్సిటివిటీ లేదని నిరూపించుకున్నారు. మహిళల్ని కించపరచడంలో, అవమానపరిచే వ్యాఖ్యల్ని చెయ్యడంలో వీరే ఆద్యులు కారు. అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంగనాధ మిశ్రా కూడా అపర మనువులో మాట్లాడి, కోట్లాది స్త్రీల క్రోధాగ్నిని చవి చూసి, తోక ముడిచి క్షమాపణ చెప్పాడు. ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్లు, పుచ్చిపోయిన భావాలతో, పురుషాంకారంతో ఈ ఇరువురు పునరపి... అంటూ మళ్ళీ మహాపరాధం చేసారు. నిండు కోర్టులో నిరసన తెలిపిన ఇందిరా జైసింగును నిలువరించే సాహసం చేసారు. తాము వాడిన పదాల గురించి ఆమె చేసిన ఆక్షేపణని పట్టించుకోకుండా 'కీప్‌' కాకపోతే 'కంకుబైన్‌' అనొచ్చా అని ఆమెనే అడిగి తమ అహంకారాన్ని వెల్లడి చేసుకున్నారు. మహిళల్ని అవమానించడానికి వీళ్ళకి ఎవరు అధికారమిచ్చారు? ఒక న్యాయమూర్తో, మరో వైస్‌ ఛాన్సలరో, ఇంకో మత పిచ్చివాడో తమ కిష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వేల సంవత్సరాలుగా ఉచ్చులు బిగించి, ఇనప కచ్చడాలు తగిలించి మహిళల బతుకుల్ని శాసించిన పితృస్వామ్య భావజాలానికి ప్రతినిధులుగా ఇంకా ఇంకా అణిచివెయ్యాలని కుట్రలు పన్నుతున్న వీళ్ళు అత్యున్నత స్థానాలో అలవారడం ఎంత అవమానకరం?

నిన్నటికి నిన్న ఒక వైస్‌ ఛాన్సలర్‌ హిందీ రచయిత్రలను 'వేశ్య' అని దూషిస్తూ తన కండకావరాని వ్యక్తం చేసాడు. హిందీ భాషలలో రాస్తున్న స్త్రీలు తమ అనుభవాలను, అభిలాషలను తమ రచనల్లో వ్యక్త్తీకరించడం ఈ పెద్ద మనిషి దృష్టిిలో నేరమైంది. మగవాళ్ళు ఎలా రాసినా, బూతు రాసినా, భూత ప్రేత పిశాచాల గురించి రాసినా, పచ్చి శృంగారం గురించి రాసినా వాళ్ళు మహారచయితలుగా చలామణి అవుతారు. మహిళలు మాత్రం దూషణ, తిరస్కారాలకు గురవుతారు. ఫ్యూడల్‌ సమాజపు తిట్లన్నీ ఉపయోగించి వారు మరి కలం పట్టకుండా అణచివెయ్యాలని చూస్తారు. ఎనభైలలో తెలుగు సాహిత్యం లో కూడా ఈ సంఘటనలు జరిగాయి. స్త్రీవాద రచయిత్రుల మీద పధకం ప్రకారం దాడి జరిగింది. నోటితో ఉచ్ఛరించజాలని తిట్లని వాడిన వాళ్ళు మామూలు రచయితలు కారు. అభ్యుదయ, విప్లవ రచయితలుగా చెలామణి అవుతున్న వాళ్ళు. అసలు స్త్రీలకు సంబంధించిన ప్రతి అంశంలోను తలదూర్చి, కట్టు, బొట్టు, మాట, రాత, నడత, ఆలోచన, ఆచరణ - వీటన్నింటినీ నియంత్రించాలనే అధికారాన్ని వీళ్ళకెవరిచ్చారు. ప్రతీ అంశం మీద పోలీసింగు చేస్తూ, మహిళల కదలికల్ని ఆలోచనల్ని అణచివెయ్యాలని ప్రయత్నించే వీళ్ళు ఏ కాలానికి ప్రతినిధులు?

భారతీయ భాషలన్నింటిలోను మహిళల్ని కించపరిచే, అవమాన పరిచే పదాలు, వ్యక్తీకరణలు లక్షల్లో వున్నాయి. మగవాళ్ళు పరస్పరం తిట్టుకోవాలన్నీ వాళ్ళు అమ్మ అక్క, ఆలి లను తిట్టాల్సిందే. వాళ్ళు జననాంగాలను కించపరచాల్సించే. 'నీకు సంబంధించిన స్త్రీలపై అత్యాచారం చేస్తాను జాగ్రత్త' అనే అర్ధంతోనే తిట్లు వుంటాయి. మగవాడు తన అధికార దర్పాన్ని అణిచివేత బుద్ధిని తన తిట్లద్వారానే వ్యక్తం చేస్తాడు. అదే పద్ధతిలో స్త్రీలను విడగొట్టి ధర్మపత్ని అని, వేశ్య అని, ఉంచుకున్నది అని అవమానించడం సర్వ సాధారణమైంది. మరి మగవాళ్ళు మాత్రం ధర్మపత్ని, అధర్మపతి, ఉంచుకున్నవాడు, తిరుగుబోతు లాగా విభజింపబడరు. వాడు మగాడు అంతే ఈ భావజాలం నరనరాన నింపుకున్న న్యాయమూర్తులు ఏ మాత్రం సంకోచించకుండా 'కీప్‌' 'రఖౌల్‌'లాంటి పదాలను వాడారు. ఇంత జెండర్‌ ఇన్‌సెన్సిటివీని అత్యున్నత న్యాయస్థానంలో ఊహించడమే కష్టం. కళ్ళారా చూసాక, చెవులారా విన్నాక మనసు తీవ్రంగా గాయపడింది. భగ్గున మండింది. 50 కోట్ల మంది మహిళల్ని కలిచివేసిన సంఘటన ఇది.

అన్ని భాషల్లోను ఇలాంటి అవమానకర పదాలున్నాయి. తెలుగు వరకు చూస్తే పురుషులు స్త్రీల మీద అత్యంత హీనంగా, హేయంగా ప్రేయోగించే ఒక నేరం గురించి, అమానుషమైన అత్యాచారం గురించి - మానభంగం, చెరచడం, అనుభవించడం లాంటి పదాలు ఉపయోగిస్తారు. ఈ పద ప్రయోగంలో వున్న వివక్ష గాని అవమానంగానీ పట్టించుకోరు ఈ పద ప్రయోగాల వల్లనే లైంగిక అత్యాచారానికి గురైన స్త్రీలని పాడై పోయిన స్త్రీలగా, చెడిపోయిన స్త్రీగా ముద్ర వేసి ఆమె బతుకును బలి తీసుకుంటారు. చెడిన పురుషుడు చెడిపోయినవాడు కాదా? వాడు శృంగార పురుషుడు శ్రీ కృష్ణుడు అంటూ బిరుదులివ్వడం. ఇందెంత దుర్మార్గమో ఆలోచించండి.

ఇంత కన్నా చెత్త పదాలు- ముతైయిదువ, అయిదోతనం, సౌభాగ్యవతి, విధవ, అబల, సౌశీలవతి, శీలం, గొడ్రాలులాంటి అవమానకరపదాలు తెలుగు భాష నిండా వున్నాయి. వాటిని యధేచ్ఛగా, సంకోచం లేకుండా వాడుతూనే వున్నారు. ''నేనేం గాజులేసుకుని కూర్చోలేదు'' అంటూ రెచ్చిపోయే వాళ్ళకి గాజులేసుకున్న వాళ్ళని అవమానిస్తున్నామనే అవగాహన, జెండర్‌ అవగాహన ఎప్పటికీ కలుగుతుందో! మహిళలకు సంబంధించి ఒక గౌరవ ప్రదమైన, ప్రజాస్వామికమైన, మానవీయ భాషను, ప్రత్యామ్నాయ పద ప్రయోగాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు మరింత ఎక్కువగా వుందని మార్కండేయ కట్జూ ఉదంతం మన ముందుకు తెచ్చింది.

39 comments:

Unknown said...

"భారతదేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ మహిళల్ని ''ఉంచుకున్నవాళ్ళు''గా వ్యాఖ్యానించి,"

భారతీయ మహిళల్ని.....కాదు అన్నది....

a section(only a section) of Indian women who live-in a relation which is not in the nature of marriage.....వాల్ళను... keep అని సంబోధించింది...

ఎందుకు ఊరికే తప్పుడు రాతలు రాస్తారు.....

శరత్ కాలమ్ said...

ఇంతకూ ఉంచుకున్నవారిని ఏమని పిలిస్తే గౌరవంగా వుంటుందో మీరు చెప్పలేదు.

కిరణ్ said...

ఎవరు ఎవరిని ఉంచుకున్నారు అనేది ఎలా డిసైడ్ చేయాలో మహా మహా అనుభవాలను కలిగిన శరత్ గారు చెప్తే బాగుంటుంది ...

శరత్ కాలమ్ said...

@ కిరణ్
:)

సింపుల్ ఆన్సర్ వుంది కానీ అలాంటివి ఇక్కడ వ్రాస్తే సత్యవతి గారికి కోపం రావచ్చు. తరువాత నా రిలేటెడ్ పోస్టులో కామెంట్ వ్రాస్తా.

Sujata M said...

Satyavati garu,

I Agree with you.

I want to mention this article here.
http://www.hindu.com/mag/2010/10/31/stories/2010103150090300.htm

Anonymous said...

సత్యవతి గారూ,
I totally agree with you.
ఇవాళా ఇరాన్లో "అక్రమ సంబంధాలకి ఒప్పుకున్నందువల్ల ఒక స్త్రీకి మరణ దండన" అన్నది విని మనం మనుషులమేనా అని ఆశ్చర్య పోయాను.
ఎంత విచిత్రం కదా? "అక్రమ సంబంధం" అని "ఆ సంబంధం" పెట్టుకున్న రెండు పార్టీల్లో ఒక పార్టీ పైనే తప్పూ, బాధ్యతా తోసి వేయటం!
సుజాత గారూ, మీరిచ్చిన లింకు బాగుందండీ. ధన్యవాదాలు.
శారద

నీహారిక said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

బ్రాహ్మణీయ ఫ్యూడల్ పితృస్వామ్యం ఇంకా మన ఆలోచనల్లో ఉంది. దాన్ని కూకటివేళ్ళతో పెకలించాలంటే ఒక విప్లవం కావాలి. కానీ మనం అటవంటి భావవిప్లవానికి తయారుగా లేము. So, let's just hope for a change.

Praveen Mandangi said...

సత్యవతి గారు. మీరు అన్నట్టు వివాహానికి వెలుపల బతుకుతున్న వారి సంఖ్య కోట్లలో లేదు. వందలు లేదా వేల సంఖ్యలో ఉండొచ్చు. అక్రమ సంబంధానికీ, ఉంచుకోవడం (concubinage)కీ తేడా ఉంది. అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీని మగవాడు మోసం చేస్తే అమె ఇంకో మగవాడి దగ్గరకి వెళ్తుంది. ఉంచుకున్న స్త్రీ అలా కాదు. ఆమె ఆర్థికంగా మగవాడి మీద ఆధారపడుతుంది. మగవాడు ఆమెని మోసం చేసినా నిస్సహాయంగా ఉండి పోతుంది. ఒక పెళ్లి కాని స్త్రీ పెళ్లైన పురుషునితో సంబంధం పెట్టుకున్నప్పుడు అది అక్రమ సంబంధమా లేదా కాంక్యుబినేజా అనేది స్పష్టంగా తెలియకపోవచ్చు. ఉంపుడుగత్తెకి భార్యతో సమానమైన గౌరవం ఇవ్వాలనడం స్త్రీవాదం ఎలా అవుతుంది?

Praveen Mandangi said...

Concubinage అనేది అవమానకరం అయినప్పుడు ఆడవాళ్లు concubinesగా వెళ్లకూడదు. అంతే కానీ concubinesగా వెళ్లినవాళ్లని concubines అనకూడదు అని చెప్పడం సంకుచితత్వం అవుతుంది.

Anonymous said...

1) 'ముష్టి 500రూ కోసం' అని ఆమెను కించ పరుస్తూనే ఆమె వైపు మాట్లాడటం వింతగా వుంది. ఐదొందలు మీదృష్టిలో ముష్టి కావచ్చు, ఆ పేదరాలికి అదే పదివేలేమో.
2) చట్టబద్ధం కాని సంబందాన్ని ఏర్పరుచుకున్న వాళ్ళను సపోర్ట్ చేసి, భరణం ఇప్పిస్తే, రెండోవైపు చట్టబద్ధంగా పెళ్ళిచేసుకున్న స్త్రీ మాటేమిటి? ఇదెక్కడి ఫెమినిజం? :)
3) చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీలకు సపోర్ట్ ఇవ్వడమేనా ఫెమినిజం అంటే? జడ్జ్ వాడిన భాషపై గగ్గోలు పెట్టడంకన్నా, ఆ మగ వ్యక్తిని జైలు శిక్ష పడేలా చట్టాలను సవరించాలని కోరడం అర్థవంతంగా వుంటుందేమో. లేదా అలాంటి సంబంధాలను చట్టబద్ధం చేసి, భరణం వచ్చేలా, సరైన పదజాలంతో చట్టాలను సవరించడానికైనా పోరాడాలి. జడ్జ్ ఏ భాష వాడినా చట్టంలో లేనిదానికి వాళ్ళేమి చేయగలరు?

" బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ", " పురుషాధిక్య ", " మను న్యాయం " - అని ఏదేదో నోటిదురద తీర్చుకునే వారికి ఇస్లామిక్ దేశాల్లో ఇలాంటి విషయాల్లో చట్టాలు ఎలా వుంటాయో కొంచెమైనా అవగాహన వుందో లేదో అనిపిస్తుంది. భరణం అటుంచి పబ్లిక్ గా రాళ్ళతో కొట్టి చంపమని చట్టాలు వుంటాయని కూడా తెలియదేమో వీళ్ళకి.

Praveen Mandangi said...

http://teluguwebmedia.asia/node/9
స్త్రీవాదులకి జెండర్ స్పృహ ఎంత వరకు ఉందో ఇక్కడ చదవండి.

ఆ.సౌమ్య said...

చాలా బాగా రాసారండీ. మీరన్నట్టు చెడిపోయినది, అనుభవించాడు లాంటి మాటలు కూడా ఎప్పుడు పోతాయో!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

సత్యవతి గారు,

ఆలోచింపజేసే వ్యాసం రాశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం వాడే పదాలు కాదు, వాటి వెనక వున్న ఆలోచనల సుంకుచితత్వం.

వ్యవస్థలో మార్పులకి మార్గనిర్దేశం చెయ్యవలసిన ఉన్నత స్థానాల్లోని వ్యక్తులే సంకుచితత్వాన్ని ప్రతిబింబించే పదాలు వాడడం దుదృష్టకరం. ఏ పదాలు వాడాలి? వెరే పేర్లు ఎందుకు పెట్టాలి అనేవి నా దృష్టిలో ఈ వ్యాసం స్ఫూర్తి కి సంబంధం లేని విషయాలు.

మధ్య యుగాల నాటి ఆలోచనలనీ, భావాలనీ వదిలి ముందుకెళ్ళే క్రమంలో భాష లోని పదాలు వాటి వాడుకా కూడా మారాల్సిన అవసరం ఉంది. కాకపోతే, అటువంటి మార్పు Ground reality లో మార్పుకి సూచికగానే ఉంటుంది గానీ, కేవల పదజాలంలో మార్పు మాత్రమే Ground reality ని మార్చలేదు.

మీరు ఉదహరించిన అవమానకరమైన సందర్భాల వల్ల మన సమాజంలో అంటే మనలో రావాల్సిన మార్పు చాలా ఉంది అనేది స్పష్టమవుతుంది.

Praveen Mandangi said...

ముతైయిదువ, అయిదోతనం, సౌభాగ్యవతి, విధవ లాంటి పదాలు వాడేవాళ్లకీ, concubine అనే పదం వాడేవాళ్లకీ చాలా తేడా ఉంది. భర్త చనిపోయిన స్త్రీకి రెండవ పెళ్లి చేసుకునే హక్కు ఉంది అని నాగరిక సమాజం అంగీకరిస్తుంది. కానీ concubinesకి హక్కులు కావాలంటే ఎలా అంగీకరించగలం? కాంక్యుబినేజ్ వల్ల ఆడవాళ్లకి లాభమా, మగవాళ్లకి లాభమా? చలం గారు వ్రాసిన "భోగం మేళం" కథలో జడ్జి గారి తమ్ముడు భోగం కులానికి చెందిన స్త్రీని ఉంపుడుగత్తెగా ఉంచుకుంటాడు. తన ఉంపుడుగత్తె వైపు ఎవరినీ కన్నెత్తి చూడనివ్వడు. వ్యభిచారం చేస్తూ కూడా శీలం & పాతివ్రత్యాన్ని నమ్ముతాడు. Prostitution and concubinage cannot bring any change in the present position of women.

నీహారిక said...

@ snkr,

"చట్టబద్ధం కాని సంబందాన్ని ఏర్పరుచుకున్న వాళ్ళను సపోర్ట్ చేసి, భరణం ఇప్పిస్తే, రెండోవైపు చట్టబద్ధంగా పెళ్ళిచేసుకున్న స్త్రీ మాటేమిటి? ఇదెక్కడి ఫెమినిజం?"

వాళ్ళని సపోర్ట్ చేస్తున్నామని మీకెందుకనిపించింది. ఎవరి మనసుకి తోచిన పని వాళ్ళు చేయవచ్చు.
అటువంటి వాళ్ళు పురుషులైనా, వాళ్ళకి లేని పేర్లు స్త్రీలకి మాత్రం ఎందుకు అని అంటున్నాం. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేసేవాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా చీపురుకట్ట పట్టుకుని చెరిగేయడానికి మేమెపుడూ సిద్ధమే!!


" చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే స్త్రీలకు సపోర్ట్ ఇవ్వడమేనా ఫెమినిజం అంటే?"

ఫెమినిజం అంటే ఏమిటో మాకు తెలుసు, మీరు నేర్పవలసిన అవసరం లేదు. ఒకళ్ళు నేర్పవలసిన పరిస్థితిలో స్త్రీలెప్పుడూ ఉండరు. అందుకే మమ్మల్ని అణగదొక్కడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉంటారు.

Praveen Mandangi said...

Indian feminists did nothing to bring concubines out from the concubinage. మన దేశంలో కబుర్లు చెప్పడానికే స్త్రీవాదం ఉన్నట్టు అయ్యింది.

Kathi Mahesh Kumar said...

@snkr: ఇస్లామిక్ దేశాల షరియాకి - భారతదేశంలోని పితృస్వామ్యానికీ నేపధ్యం మతమే. అక్కడ ఇస్లాం ఇక్కడ బ్రాహ్మనిజం. రెండూ ఖండనీయమే. ఇక్కడ మాట్లాడుతోంది భారతదేశ నేపధ్యంలో, కాబట్టి బ్రాహ్మణీయపితృస్వామ్యాన్నీ ఫ్యూడల్ భావజాలన్నీ ఉటంకించాల్సి వచ్చింది. అంతమాత్రానా ఇస్లామిక్ దేశాలు మహిళలపై చేసే అకృత్యాలను సమర్థించినట్లు కాదు. ఇస్లాం మతం పేరుతో మహిళలపై భారతదేశంలో ఉన్న ఆంక్షల్ని సపోర్ట్ చేసినట్లూ కాదు. Any thing against human rights will be condemned. And condemned in strongest terms.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>>Concubinage అనేది అవమానకరం అయినప్పుడు ఆడవాళ్లు concubinesగా వెళ్లకూడదు. అంతే కానీ concubinesగా వెళ్లినవాళ్లని concubines అనకూడదు అని చెప్పడం సంకుచితత్వం అవుతుంది.

This is hopeless argument. The word itself indicates exploitation of women and indicates viewing women as just sexual objects.

If two people want to engage in something like that.. it is upto them and both of them share equal responsiblity for the good or bad that comes out of it.

As members of a civilized society, we should be ashamed if being a 'concubine' in the medevial sense of the term is seen as one of options for the women of today.

Praveen Mandangi said...

కబుర్లు చెప్పడం కాకుండా మనవాళ్లు ఏమి చేశారు? వేశ్యలని వేశ్యలు అనకూడదు అని, ఉంపుడుగత్తెలని ఉంపుడుగత్తెలు అనకూడదు అని చెప్పడం తప్ప ఉద్ధరించడానికి చేసిందేమీ లేదు.

నీహారిక said...
This comment has been removed by the author.
Praveen Mandangi said...

Words can bring nothing change in position of women. Deeds can bring change. కేవలం కబుర్లు చెపితే వచ్చేది శూన్యం.

Praveen Mandangi said...

మీకు కేవలం పదాలు అభ్యంతరకరంగా కనిపించాయి కానీ చేతలు అభ్యంతరకరంగా కనిపించలేదు. టివి సీరియళ్లలో చదువుకున్న స్త్రీలు భర్త చనిపోయిన తరువాత పసుపుకుంకుమలు తీసేస్తున్నట్టు చూపిస్తున్నారు. స్త్రీలని అలా చూపించడం తప్పు అనిపించలేదా? ఇప్పుడు పట్టణాలలో అయినా ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. పది మంది వచ్చి పోయే ఆఫీస్ కి ఒక స్త్రీ అభాగ్యపు వస్త్రధారణలో వెళ్లగలదా? ఆడవాళ్లని disgrace చేసే టివి సీరియళ్లు నిత్యం టెలీకాస్ట్ అవుతున్నాయి. కేవలం మాటలని పట్టుకుని విమర్శిస్తే ఏమి లాభం?

Anonymous said...

ప్రవీణ్ చెప్పేది నిజమే! ఏ పేరెట్టినా అర్థం అదేగా! ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్ భాషల్లోని పేర్లు పెడితే అర్థం కాక, కొంత వూరట కలిగే అవకాశాలుంటాయి. :D

నీహారిక
మీరేమటున్నారో నాకు అర్థం కాలేదు. తరవాతెపుడైనా మీగోడు తీరిగ్గా వింటా, ప్రామిస్. :)

కత్తి,
'బ్రామనికల్ ఇస్లాం, యూదు, క్రైస్తులంటూ లేరు, ఐనా మతాలకతీతంగా ప్రపంచమతా చట్టాలు అలానే వున్నాయి, ఎందుకు? కొన్ని ఆటావిక తెగల్లో ఇలాంటివి లేవంటారు, ఆటవిక దిశగా పురోగమిద్దామంటారా?! పితృస్వామ్యం కాక మాతృస్వామ్యం లో అంతా చక్కగా వుంటుందా? అదో , ఇదో ఏదో ఒక స్వామ్యం వుండాలి కదా? మీరు చెప్పిన సో కాల్డ్ 'విప్లవం ' శతాబ్దాలుగా జరుగుతూనేవుంది. అందుకే చట్టాలు, రాజ్యాంగాలు ఫ్లెక్సిబుల్ గా వున్నాయని రాజ్యాంగ నిపుణులు మీకు తెలియంది కాదు. :)

Praveen Mandangi said...

పదాలు మారిస్తే ఏమి లాభం. Prostitute అనే పదాన్ని హిందీ డిక్షనరీలో చూసినప్పుడు वेश्या అని కనిపించింది, తెలుగు డిక్షనరీలో చూసినప్పుడు భోగము స్త్రీ అనే పదం కనిపించింది. ఉంపుడుగత్తె అనేది మన బాషలోని పదం కావడం వల్లే కదా మనకి అభ్యంతరకరంగా కనిపించింది. హిందీలో उपपत्नी అని లేదా ఇంగ్లిష్ లో concubine అని వ్రాస్తే అర్థం మారిపోతుందా? కేవలం పదాలు మారిస్తే స్త్రీల జీవితాలు మారిపోతాయా?

Praveen Mandangi said...

ఒకప్పుడు గాంధీ దళితులని దళితులు అనకూడదు, హరిజనులు (దేవునికి జన్మించినవాళ్లు) అనాలని అన్నాడు. కుల వ్యవస్థ మాత్రం ఉనికిలో ఉండాలని అన్నాడు. మీ అభిప్రాయం ఏమిటి? concubinesని కాంక్యుబిన్స్ అనకూడదు కానీ concubinage మాత్రం ఉనికిలో ఉండాలి. అంతే కదా. పేర్లని మార్చి సంతృప్తి పడడం స్త్రీవాదం ఎలా అవుతుంది?

Praveen Mandangi said...

snkr గారు. నాకు తెలిసి స్త్రీవాద ఉద్యమం 160 సంవత్సరాల క్రితం పాపులర్ అయ్యింది. విప్లవంలో తప్పు లేదు. విప్లవవాదులమని పైకి చెప్పుకుంటూ వ్యక్తిగతంగా భూస్వామ్య సంప్రదాయాలని ఆచరించేవాళ్లదే తప్పు.

నీహారిక said...
This comment has been removed by the author.
శరత్ కాలమ్ said...

@ ప్రవీణ్
ఈ విషయంలో మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

శరత్ కాలమ్ said...

@ నీహారిక
నా ప్రశ్నకి నా బ్లాగులోని క్రింది వ్యాఖ్య ద్వారా సమాధానం దొరికింది. మిండడు/మిండగాడు, వుంచుకున్నది అనే పదలు కొద్దిగా మోటుగా వున్నాయి కాబట్టి ఇహ నుండి ఉప పతి, ఉప పత్ని అనే పదాలను ఉపయోగిస్తాను. ఈ ఉప వ్యవస్థ సమాజం నుండి తొలగిపోయాక ఆ పదాలని వాడను కానీ పాలిఓమరీ వ్యవస్థ సమాజంలో పూర్తిగా వచ్చేంతవరకు అవసరమయినంతమేరకు ఈ ఉప వ్యవస్థని ఉపయోగించాల్సిందిగా నేనయితే ప్రోత్సహిస్తూనే వుంటాను.

మగాళ్లకు మిండగాడు/మిండడు అనే పదాలు వున్నాయి కదా. కొన్ని మగ పదాలకు ఆడపదాలు లేవు. ఒక జెండరుకి పదాలు లేకపోయినంత మాత్రాన ఆ పదాలను వాడకూడదు అనడం ఏం లాజికో అర్ధం కాదు. స్త్రీలకు లేదు కాబట్టి పురుషులకూ కోసెయ్యాలనడం బావుంటుందా చెప్పండి. కాకపోతే లేకపోతే కొత్తవి (పదాలు) సృష్టించుకోవాలి గానీ. పదాలు మొరటుగా అనిపిస్తే కాస్త చక్కనయిన పదాలు, పేర్లతో వ్యవహరించవచ్చు. టాపిక్ ఇలాంటిది కాబట్టి కొంచెం ఇలా వ్రాయాల్సివచ్చింది అని గమనించగలరు.

"దేవనకొండ ఓబుల్ రెడ్డి అన్నారు...
పూర్వీకులు ఉంచుకోబడ్డవాళ్ళకి ఉపపతి, ఉపపత్ని అనే పదాలను వాడారు."

రాజేష్ జి said...

@" బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ", " పురుషాధిక్య ", " మను న్యాయం " - అని ఏదేదో నోటిదురద తీర్చుకునే వారికి...

అవును snkr గారు.. అసలు విషయాన్ని పాతరేయాడనికి కొన్ని సుత్తులు ఇలా
మట్లాడి దురద తీర్చుకుంటారు, లేకపోతె పొద్దు గడవదు. ఆ ప్రవీన్ గారి ని చూసైనా ఇలంటివాళ్ళు కొంత నేర్చుకుంటె బావుంటది.

@Indian feminists did nothing to bring concubines out from the concubinage. : మన దేశంలో కబుర్లు చెప్పడానికే స్త్రీవాదం ఉన్నట్టు అయ్యింది.
Words can bring nothing change in position of women. Deeds can bring change. కేవలం కబుర్లు చెపితే వచ్చేది శూన్యం.


ఎమి జెప్పారు ప్రవీన్ గారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో మీ తర్వాతే ఇలాంటి విషయాల్లో.. లొతైన విశ్లేషణ.

ఒక కొత్త పదం నేర్చుకున్నా.. మీరు పదే పదే వాడడం వల్ల,అది concubines. నాకు కుకుంబర్ తెలుసు. ఈ concubinesకి కుకుంబర్ కి మధ్య ఎమైనా relation ఉందా?

Praveen Mandangi said...

నేను చదివినది ఇంగ్లిష్ మీడియం. ఉంపుడుగత్తెని ఇంగ్లిష్ లో concubine అంటారని చెప్పగలను. అంతే కానీ keep అనరు. Keep అంటే house keep (ఇంటి పనులు చేసే ఆమె) అని అర్థం వస్తుంది. ఇండియాలో wrong contextలో keep అనే పదం వాడుతారు.

రాజేష్ జి said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

Keep అంటే తన కోసం అట్టిపెట్టుకున్న స్త్రీ. పెళ్ళి చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అలా అట్టిపెట్టుకుంటారు. భార్యని తాళిగట్టి అట్టిపెట్టుకుంటే keeps ని తాళిగట్టకుండా అట్టిపెట్టుకుంటారు. అందువల్ల వాళ్ళ గుర్తింపు ఏదైనప్పటికీ వాళ్ళూ భార్యల్లాంటివాళ్ళే. ఇందులో స్త్రీలకు అవమానకరమైనదేదీ లేదు. Keep అనే పదం కూడా మరీ అంత అవమానకరం కాదు. ఏకపత్నీవ్రతాన్ని చట్టం చేయడం వల్ల ఈ keep అనేది వాడుకలోకి వచ్చింది. అంతకుముందు "ఆమె ఫలానా ఆయన చిన్నభార్య" అని చెప్పుకునేవారు. ఒక సాధారణ వివాహిత స్త్రీ చేసేదే keeps కూడా చేస్తున్నారు. భర్త పట్ల వారి అంకితభావం ఒక వివాహితస్త్రీకి ఎంతమాత్రమూ తీసిపోదు. అయితే వాళ్ళు అందరిలాంటి సాధారణస్త్రీలేనని దురదృష్టవశాత్తు సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అంగీకరించవు. .

నిజానికి keeps స్త్రీలలోనే కాదు, పురుషుల్లో కూడా ఉన్నారు. మా బంధువొకాయన్ని ఆయన పనిచేసే షాప్ ఓనర్ భార్య ఉంచుకుంది. భర్తకు తెలిసినా కిమ్మనలేదు. ఆమె చేసిన ఆర్థిక సహాయంతో మా బంధువు పాతిక బెడ్రూముల ఇల్లు కట్టాడు. అలాగే మా మాజీ కొలీగ్ భర్తని ఆయన పనిచేసే కాలేజీ ప్రిన్సిపాల్ ఉంచుకుంది. (అందుకు మా కొలీగ్ ప్రోత్సాహం, సహకారం కూడా తోడయ్యాయనుకోండి)

శృంగారంలో మగవాడు Active partner, ఆడది passive partner. శరీరనిర్మాణం వల్ల కలిగిన Functionality difference ఇది. అందుచేత మగవాడు శృంగారం చేసేవాడయ్యాడు. ఆడది "చేయబడేది" అయింది. కడుపు చేయడం లాంటి పదాలు ఇలాగే వచ్చాయి. ఇది ఫెమినిజానికి జోక్యం లేని ఒక ప్రకృతిసహజధర్మం. ఇది మానవులలోనే కాక అన్ని జీవజాతులలోను ఇలాగే ఉంది. వాస్తవజీవితంలో కూడా ఒక ఆడది లేచిపోతే, "ఆమెకి మొగుడివల్ల సుఖం లేదు" అని మగవాణ్ణే కర్తను చేస్తారు కదా. స్త్రీపురుషులు పరస్పరం నిజంగా పోషించే యథార్థ పాత్రల్ని వర్ణించే పదాలు కాకుండా కవితామయమైన abstract పదాలతో విషయాలు అర్థమవుతాయా ? మనకు మనమే కల్పించుకున్న సభ్యతాకాన్సెప్టుల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఇప్పుడున్న తెలుగు పదజాలంలో అవాస్తవికత ఏముంది ? వి వాడితే తప్పేమిటి ?

ప్రవీణ్ శర్మ అన్నట్లు పదాల్ని మార్చినంతమాత్రాన వాళ్ళ వాళ్ళ functionalities మారవు గదా ?

Anonymous said...

Keep అంటే తన కోసం అట్టిపెట్టుకున్న స్త్రీ. పెళ్ళి చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అలా అట్టిపెట్టుకుంటారు. భార్యని తాళిగట్టి అట్టిపెట్టుకుంటే keeps ని తాళిగట్టకుండా అట్టిపెట్టుకుంటారు. అందువల్ల వాళ్ళ గుర్తింపు ఏదైనప్పటికీ వాళ్ళూ భార్యల్లాంటివాళ్ళే. ఇందులో స్త్రీలకు అవమానకరమైనదేదీ లేదు. Keep అనే పదం కూడా మరీ అంత అవమానకరం కాదు. ఏకపత్నీవ్రతాన్ని చట్టం చేయడం వల్ల ఈ keep అనేది వాడుకలోకి వచ్చింది. అంతకుముందు "ఆమె ఫలానా ఆయన చిన్నభార్య" అని చెప్పుకునేవారు. ఒక సాధారణ వివాహిత స్త్రీ చేసేదే keeps కూడా చేస్తున్నారు. భర్త పట్ల వారి అంకితభావం ఒక వివాహితస్త్రీకి ఎంతమాత్రమూ తీసిపోదు. అయితే వాళ్ళు అందరిలాంటి సాధారణస్త్రీలేనని దురదృష్టవశాత్తు సమాజం, ప్రభుత్వం, న్యాయవ్యవస్థ అంగీకరించవు. .

నిజానికి keeps స్త్రీలలోనే కాదు, పురుషుల్లో కూడా ఉన్నారు. మా బంధువొకాయన్ని ఆయన పనిచేసే షాప్ ఓనర్ భార్య ఉంచుకుంది. భర్తకు తెలిసినా కిమ్మనలేదు. ఆమె చేసిన ఆర్థిక సహాయంతో మా బంధువు పాతిక బెడ్రూముల ఇల్లు కట్టాడు. అలాగే మా మాజీ కొలీగ్ భర్తని ఆయన పనిచేసే కాలేజీ ప్రిన్సిపాల్ ఉంచుకుంది. (అందుకు మా కొలీగ్ ప్రోత్సాహం, సహకారం కూడా తోడయ్యాయనుకోండి)

శృంగారంలో మగవాడు Active partner, ఆడది passive partner. శరీరనిర్మాణం వల్ల కలిగిన Functionality difference ఇది. అందుచేత మగవాడు శృంగారం చేసేవాడయ్యాడు. ఆడది "చేయబడేది" అయింది. కడుపు చేయడం లాంటి పదాలు ఇలాగే వచ్చాయి. ఇది ఫెమినిజానికి జోక్యం లేని ఒక ప్రకృతిసహజధర్మం. ఇది మానవులలోనే కాక అన్ని జీవజాతులలోను ఇలాగే ఉంది. వాస్తవజీవితంలో కూడా ఒక ఆడది లేచిపోతే, "ఆమెకి మొగుడివల్ల సుఖం లేదు" అని మగవాణ్ణే కర్తను చేస్తారు కదా. స్త్రీపురుషులు పరస్పరం నిజంగా పోషించే యథార్థ పాత్రల్ని వర్ణించే పదాలు కాకుండా కవితామయమైన abstract పదాలతో విషయాలు అర్థమవుతాయా ? మనకు మనమే కల్పించుకున్న సభ్యతాకాన్సెప్టుల్ని పక్కన పెట్టి ఆలోచిస్తే ఇప్పుడున్న తెలుగు పదజాలంలో అవాస్తవికత ఏముంది ? వి వాడితే తప్పేమిటి ?

ప్రవీణ్ శర్మ అన్నట్లు పదాల్ని మార్చినంతమాత్రాన వాళ్ళ వాళ్ళ functionalities మారవు గదా ?

Kathi Mahesh Kumar said...

@రాజేష్ . జి: నీకు అర్థంకాని విషయాల గురించి ఎందుకు నోరుపారేసుకోవడం?

Anonymous said...

/ఇహ నుండి ఉప పతి, ఉప పత్ని అనే పదాలను ఉపయోగిస్తాను./
మరి ఈలెక్కన 'ఉపకులపతి ' అని మనం పిలుచుకుంటున్న వైస్ చాన్సిలర్ల బ్రతుకేంగాను? పైగా కులం అనే పదం కూడా వుంది. వేరే పదం ఆలోచించండి.

/ఈ concubines కుకుంబర్ కి మధ్య ఎమైనా relation ఉందా?/

ఆలోచింపజేసేదిగా వుంది. ఏదో వుండి వుంటుంది. :D

Praveen Mandangi said...

ఈ రోజు HMTVలో టెలీకాస్ట్ అయిన సత్యవతి గారి కార్యక్రమం రికార్డ్ చేశాను. http://teluguwebmedia.asia/node/10

Anonymous said...

మన దేశంలో స్త్రీపురుష సంబంధాలు అందరికీ ఒక్కలాగ లేవు. ఎవరి అవసరాల ననుసరించి వారు సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. బహుభార్యాత్వం ఎలా ప్రబలుతోందో బహుభర్తృత్వమూ అలాగే ప్రబలుతోంది, ఇవి చట్టవిరుద్ధమని ప్రభుత్వం ఘోషిస్తున్నప్పటికీ ! ఇటువంటి అన్ని సంబంధాలకీ కలిపి ఒక సంయుక్తపదాన్ని కనిపెట్టడం బహుసా కష్టమేమో ! అట్లనే అందరికీ కలిపి ఒక వివాహ చట్టం చేయడం కూడా కష్టమేమో !

నేను హరియాణా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒకసారి ఛాత్ పూజలు జరుగుతున్నై. తమ భర్త ఆయురారోగ్యాల కోసం ఆ దేశపు ముత్తైదువలు ఆ పూజలు చేయిస్తారు. ఆ ఉత్తరాది బ్రాహ్మణుడు "నీ భర్త పేరేంటి చెప్పమ్మా" అనడిగితే ఒక యౌవన ముత్తైదువ నలుగురి పేర్లు చెప్పింది. వాళ్ళు అన్నదమ్ములనీ వాళ్ళందరూ సమానంగా తన భర్తలేననీ చెప్పింది. అక్కడే ఆమెలాంటి (బహుభర్తలు గల) యువతులు ఇంకో ముగ్గురున్నారు. విషయమేంటంటే - ఆ రాష్ట్రంలో ఈమధ్య స్త్రీల జనాభా దారుణంగా పడిపోవడంవల్ల అన్నదమ్ములంతా కలిసి ఒక్క స్త్రీనే చేసుకుంటున్న కేసులు ఎక్కువవుతున్నాయి. అయితే ఆ అన్నదమ్ములలో ఒక్కరికే బహిరంగంగా ఆమెనిచ్చి పెళ్ళిచేస్తారు. తరువాత "మిగతా అన్నదమ్ములు కూడా నీ భర్తలే" నని ఆ పెళ్ళికూతురికి నెమ్మదిగా తెలియజేస్తారు. ఆమె ఏం చేస్తుంది ? సర్దుకుపోతుంది. సుమారుగా ఇదే పరిస్థితి పంజాబు, రాజస్థాన్‌లలో కూడా ఉన్నదని తెలుస్తున్నది.

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...