ఈ మధ్య పిల్లల నోట్లోంచి గంటకో సారన్నా వినబడే మాట బోర్ కొడుతోంది అని.
టి.వి చూస్తారు.కాసేపటికి బోర్.
ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తారు గంటకే బోర్.
వీడియో గేం ఆడతారు అరగంటకే బోర్.
కాసేపు క్రికెట్ ఆడి బోర్ అంటారు.
వీళ్ళ సంగతేంటో నాకు అస్సలు అర్ధం కావడం లేదు.
నాకు పిల్లల్ని పెంచడంలో అనుభవం లేదు కానీ
నాకు చాలా చాలా ఆత్మీయుడైన ఓ కుర్రాడున్నాడు.
వాడికి నాలుగు నెలల వయసప్పటి నుండి పరిచయం.
ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఆదివారాలు మా ఇంటికొస్తాడు.
శెలవుల్లో మాతోనే ఉంటాడు.
వాడూ నేనూ కలిసి తెగ తిరుగుతాం.
వాల్డెన్ అంటాడు.కేఫ్ కాఫీ డే అంటాడు.
ఈట్ స్ట్రీట్ కెళదామంటాడు.
వాడితో కలిసి నేనూ తిరుగుతూ వాడి కంపెనీని ఆస్వాదిస్తూ ఉంటాను.
అన్నీ అయ్యాకా ఇంటికొచ్చి బోర్ కొడుతోంది అంటాడు.
అరేయ్ ఇప్పటి దాకా తిరిగాం కదా బోర్ ఏంటిరా?బోర్ అంటే ఏంటిరా అంటాను.
ఏమో నాకు తెలవదుకానీ బోర్ కొడుతోంది అంటాడు మళ్ళి.
ఒక్కో సారి ఈ పిల్లల్ల్ని చూస్తే గుండెల్లో కెలికినట్టవుతుంది.
బాల్యం,బాల్యానుభవాలు,ఆటలు,అల్లర్లు కోల్పోయారు.
మాకెన్ని తీపి జ్ఞాపకాలో.
కళ్ళు మూసుకుంటే చాలు సినిమా రీళ్ళల్లా కదలాడే జ్ఞాపకాల దొంతర్లు.
ఒకటా రెండా.ఎన్నో.ఎన్నెన్నో.
కష్టాలు.కన్నీళ్ళు.తీరని ఆశలు.తనివి తీరని అనుభూతులు.
చిన్నాన్నలు ,పెదనాన్నలు,పిన్నమ్మలు, పెద్దమ్మలు మేనత్తలు,మేనమామలు,బావలు అమ్మమ్మలు,నానమ్మలు
అమ్మమ్మ గారి ఊళ్ళో అల్లర్లు.
అసలు బోర్ అనే మాటకి అవకాశం లేనంత సందడి.
తనలోకి తాను చూసుకున్నప్పుడు అపారమైన జ్ఞాపకాలు ఊటలా ఊరుతుంటే బోర్ ఏంటి.
ఇప్పటి పిల్లలకి గాఢమైన అనుభవాలెక్కడివి?ఏదీ గుండెల్లో ఇంకదు.
ఏదీ గాఢానుభూతినియ్యదు.
గుండెల్లో ఇంకనివన్నీ గాలికి కొట్టుకుపోతాయ్.
లోపలంతా లొటారం,ఖాళీ,వెలితి.
ఎంత వస్తు సముదాయంతో నింపితే ఈ వెలితి పూడుతుంది.
సెల్ఫోన్లు,ఐపాడ్లు,టివిలు.ఇంటర్నెట్లు,సినిమాలు,క్రికెట్లు ఇవేవీ పిల్లలకి త్రుప్తి నియ్యడం లేదు.
లోపలి బోలుతనాన్ని పూరించుకోవడమెలాగో తెలియకే పాపం బోర్ బోర్ అంటూ బేర్ మంటున్నారు
.
7 comments:
చిన్న పిల్లలు అనేముంది సత్యవతి గారు... 20- 30 మధ్య లొ ఉన్న వాళ్ళు కూడా అదే మాట... అన్నీ అందుబాటులోనే ఉంటాయి, అయినా బోర్.. దాన్ని తప్పించుకోడానికి అయితె కదలకుండా టివి చూడటం కానీ బ్రౌజ్ చెయ్యడం,, లేకపోతే పరిచయాలు తెగ పెంచేసుకుంటున్నారు... అవీ ఎంతో సేపు నిలవవు... జీవితంలో అనాలోచిత పరిచయాలు ఎక్కువైపోయి మంది ఎక్కువైతే సమస్యలు.. ఆ సమస్యలు ఒక పక్క, బోర్డం ఇంకో పక్క... ఎవరికి వారు తమతో తాము సమయం గడపడం లేదు.. తమతో అనే కాదు, తమ సొంత మనుషులతో, చుట్టూ ఉన్నవాళ్ళతో... ఎవరితో వాళ్ళు ఎంతో కొంత సమయం గడపగలగడం అలవాటైతే బోర్డం అనిపించదు... కానీ జనం మీద పడుతున్నారు కేవలం బోర్డం తీరడం కోసం, ఫన్ కోసం... ఈ శతాబ్ధి లో మన సమాజాన్ని పట్టి పీడించే అతి ప్రమాదకరమైన వ్యాధి బోర్డం.. సగం మంది బోర్డం తో నిరుత్సాహం గా ఉంటే, మిగిలిన సగం మంది ఏదొక విధంగా వాళ్ళ బాధితులు.
ఇప్పటి పిల్లలకి గాఢమైన అనుభవాలెక్కడివి?ఏదీ గుండెల్లో ఇంకదు.
ఏదీ గాఢానుభూతినియ్యదు.
గుండెల్లో ఇంకనివన్నీ గాలికి కొట్టుకుపోతాయ్.
లోపలంతా లొటారం,ఖాళీ,వెలితి.
ఎంత వస్తు సముదాయంతో నింపితే ఈ వెలితి పూడుతుంది.
సెల్ఫోన్లు,ఐపాడ్లు,టివిలు.ఇంటర్నెట్లు,సినిమాలు,క్రికెట్లు ఇవేవీ పిల్లలకి త్రుప్తి నియ్యడం లేదు.
లోపలి బోలుతనాన్ని పూరించుకోవడమెలాగో తెలియకే పాపం బోర్ బోర్ అంటూ బేర్ మంటున్నారు.............
ఒక పెద్ద పుస్తకం రాయడానికి సరిపడా సరుకు ఉంది ఈ పేరాలో!
నిజమే సత్యవతి గారూ, నేను ఒక్క క్షణం కూడా తీరికలేనంత బిజీగా ఉంటా....రొటీన్ పనుల్తో కాదు, మనసుకు నచ్చే పనుల్తో! ఇప్పటి పిల్లలకు అన్నీ వాళ్ళకు నచ్చేవే చేస్తున్నా ఎందుకింత బోరో అర్థం కాదు! వీళ్ల బోరుకు నాకొక కారణం తట్టింది. పంచుకోవడం లేకపోవడం. ఒక్కరే బిడ్డ ఉన్న ఇంట్లో ఈ కంప్ల్యెంట్లు తప్పవు. వీళ్ళ జీవితాల్లో "ఆస్వాదన" లేదు. ఆదరా బాదరా చేసి పడేయడం తప్ప! దీనికి బోలెడు కారణాలు. రాస్తూ పోతే....చెప్పానా పుస్తకం అవుతుందని!
మనిషి ఎనాడయితె భౌతికమైన వస్తుసముదాయంలో ఆనందాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టాడో,ఆనాటినుంచే తననితాను కోల్పోయాడు.ఇక ఘాదమైన ఆనందాలకు,అనుభూతులకు చోటేక్కడిది?దిగులు తప్ప.[ఆ వస్తువు చెడితే దిగులు,పోతే దిగులు,పొందకుంటే దిగులు,..ఆ విధంగా ఈ వస్తు సముదాయమ్తో..కొన్నా దిగులే..కొనకున్నా దిగులే మేడం జీ.....మనిషికి లేని విలువ నేడు వాటికున్నది మరి..
వస్తు సముదాయసేకరణే నిజమైన బోర్ అంటే...మనిషికి ఈ సత్యం భోధపదడిననాడు బోర్ అనే పదం వారినుంచి దూరంగా పారిపోగలదు.
ఇళ్ళూ, స్కూళ్ళు జైళ్ళయిపోయాకా బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది?
కాకపోతే కలవారి ఇళ్ళు 5 * జైళ్ళు.
మిగతా వాళ్ళవి మామూలు జైళ్ళు.
I guess we have to get them (kids) into the habit of refelcting.
We can start by asking them what was done that day, what they liked, what they didn't like, what they would hope to do.
It is a serious problem if not taken seriously.
We all have to learn to take time out to think and appreciate, reflect and hope within ourselves.
There's a story, I think, by Rabindranath Tagore. Once, there was a place where everybody was doing only useful things. Everyone was trying to be efficient. Even the stream was flowing quietly to save energy. And there was one man, who did nothing 'useful'. He was making some art, perhaps a painting. If anyone remembers this, please point to it. I will be so grateful.
At the same time, 'quiet' is only meaningful when there's noise.
You got to keep yourself busy to appreciate the leisure. When there's 'nothing', then there's an opportunity.
నా వుద్దేశం ప్రకారం బోర్ అంటే మనలో వున్న ఆనందాన్ని మనం చూడలేక పోవటం. ఆనందాన్ని మనలో వెతుక్కోకుండా బయట ప్రపంచం లో వెతుక్కోవటం. భౌతిక మైన ఆనందాన్ని శాశ్వత మని తలచటం. భౌతిక మైన ఆనందం శాశ్వతం కాదు. ధ్యానం చెసినపుడు శరీరం ఆత్మలో లయించి ఆనందాన్ని కలుగ చేస్తుంది. ధ్యానం వల్ల బోర్ ని తొలగించుకోవచ్చు.
I think, If these kids are grown up, they also will feel about their kids like - "Oh.. we enjoyed a lot in our childhood with computer games,watching TV etc.. and now these kids are missing all those( they might be doing newer things by then..)" . I think thats all part of generation gap and is very natural..
Post a Comment