Monday, March 1, 2010

భల్లుగూడ లో గిరిజన మహిళలపట్ల గ్రేహౌండ్స్ పోలీసుల బీభత్స కాండ





ఫిబ్రవరి ఇరవై ఆరున కొంతమంది రచయిత్రులం  కలిసి
విశాఖ జిల్లా భల్లుగూడలో గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచారానికి గురైన గిరిజన మహిళలను కలిసాం.
ఉదయం పది గంటలకి విశాఖలో బయలుదేరి పాడేరు మీదుగా రెండు టాటా సుమోల్లో  బయలుదేరాం.భల్లుగూడా బాధిత స్త్రీలు పాడేరు వస్తారని ముందు చెప్పారు.
కానీ మేమే భల్లుగూడా వెళ్ళాల్సి వచ్చింది.
దాదాపు పది కిలోమీటర్లు కొండల్లో,అడవిలో నడవాలని చెప్పడంతో చాలామంది వాహనాల్లోనే ఉండిపోయారు.
నేను మరో ఏడుగురం  నాలుగున్నరకి  భల్లుగూడకి బయలుదేరాం.
దారంతా రాళ్ళు,రప్పలతో నిండి ఉంది.
రెండు కొండలెక్కి దిగడంతో నాకు చాలా అయాసం వచ్చేసింది.
మధ్యలో దట్టంగా చెట్లు అల్లుకున్న అడవి.
కొండలెక్కి అడవి దాటి భల్లుగుడా చేరేసరికి సూర్యాస్తమమౌతోంది.
మా కోసం ఊరంతా ఎదురుచూస్తోంది.
అత్యాచారానికి గురైన ముగ్గురు స్త్రీలు మాతో మాట్లాడడానికి
సిద్ధమయ్యారు....................

(మిగిలింది రేపు చదవండి)

5 comments:

Veeragoni said...

సేరియల్స్ లాగా మిగతాది రేపు చదవండి అనడం ఏమీ బాగా లేదు.

కస్క్రీమాపాదనిహీ said...

నాది వీరగొని గారి కామెంటే.........



ఎంతో ఇంటరెస్టింగ్ గా మీ టపాని చదవడం మొదలు పెట్టిన నాకు నిరాశే ఎదురయింది. మీరు మిగిలింది రేపు చదవండి అని రాసినపుడు పత్రికా రంగం లో ఉన్న మీ మీద టి.వి 9 ఎఫ్ఫెక్ట్ ఉందేమో అనిపించింది. వాళ్ళు కూడా మీ లాగే ఇంటరెస్టింగ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చి బ్రేక్ తరువాత చూడండి అంటారు. కాబట్టి రేపైనా ఆ సంఘటన గూర్చి పూర్తి వివరాలు అందిస్తారని ఆశిస్తున్నాను.


రేపు కూడా పూర్తి గా రాయక పోతే, మీరు ఆ ఘటన ని బ్లాగర్లకు తెలియ చెప్పాలని కాకుండా మీ బ్లాగు లో విజిటర్స్ సంఖ్య పెంచుకోవడానికి రాస్తున్నట్టు అవుతుంది.

maa godavari said...

సారీ అండీ
నేను వైజాగ్ నుండి చాలా అలిసిపోయి రావడం వల్ల,రాత్రి బాగా లేట్ అవ్వడం వల్ల మొత్తం రాయలేకపోయాను.
బ్లాగ్ లోకి విజిటర్లని పెంచుకోవడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదండి.
భల్లుగూడాలో జరిగిన భయానక సంఘటనలు నా మనస్సును అల్లకల్లోలం చేయడం వల్ల కూడా నేను వెంటనే రాయలేకపోయాను.అక్కడ జరిగిన దారుణాన్ని మిత్రులతో పంచుకోవాలన్నదే నా ఉద్దేశ్యం.మీరు మరీ నన్ను టీవీ9 తో పోల్చడం నాకు చాలా బాధ కలిగించింది.

కస్క్రీమాపాదనిహీ said...

సారి అండీ సత్యవతి గారు, ఒక పత్రికా ఎడిటర్ గా ఉన్న మీ నుంచి వచ్చే కథనాల గురించి మేం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తాం. అటువంటి సందర్బం లో "మీరు ఇలా మిగిలింది రేపు చదవండి" అనేసరికి కొంత హర్ట్ అయ్యాను. అందువల్ల కొంచం ఘాటు గా రాయాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ రేపటి మీ టపా కోసం ఎదురు చూస్తుంటాను.

................ said...

సత్యవతి గారూ!

మీ "స్త్రీల అంశమే ఊపిరై కడదాకా సాగాల్సిందే" వ్యాసాని పూర్తిగా, ధ్యానంతో చదివాను. చాలా బాగా ఎంతో స్వంచంధంతో, హృదయపు స్పందనతో వ్రాసారు. చాలా బాగున్నది. చదివే మనసుకు వెన్నెలలా అనిపిస్తుంది, నాకు అనిపించింది! ధన్యవాదాలు శ్రద్ధతో రచించిన రచయితగారికి.

వ్యాసాంతంలో "నేను లోంచి మనలోకి నడిచిన ఆనాటి తరం, మనలోంచి నేను లోకి జారిపోతున్న ఈనాటి తరం. ఈ మార్పు భీతిగొల్పుతుంది. భయపెడుతుంది. మనల్ని ఏకాకులుగా మార్చేస్తుంది. చుట్టూ ఏం జరుగుతోందో చూడనివ్వని బండ తనంలోకి నెట్టేస్తుంది." అని మీ ఆందోలనని స్పష్టంగా కాగితం మీద పెట్టారు. మానవ సమాజంలో మార్పులు, సామాజిక సంస్కృతీ మారుతూ వుండటం కాలగమనంలో అతి సహజమయిన విషయం. అయితే వచ్చే మార్పులని మనం వప్పుకోవదమూ, ఆహ్వాదించే విధానమూ ఆయా కాలాలో ఉన్న ఆర్ధిక, సాంఘిక మరి రాజకీయ పరిస్థుల మీద పూర్తిగా ఆధారపడివుంటుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. కాకపోతే, కనిపిస్తున్న సాంఘిక అన్యాయాల పరిమళాలేమనల్ని స్పందించేలా చేస్తాయి కాబట్టి విశాలవిశ్వ పరిధి నుండి వుండే అవగాహనతో విస్లించి చూడటం కష్టమవుతింది అప్పుడప్పుడు కొంత మంది విస్వకర్తలకు కూడా. మీ అవిశ్రామ శ్రమతో మీరు ఇప్పుడు ఓ విశ్వకర్త స్థాయిని ఆక్రమించారు స్త్రీ సంఘర్షణ ఉద్యమంలో!

ఇంకో విషయం నా జ్ఞానమూర్కత్వంతో అడుగుతున్న ప్రస్స్న - "ఈ రోజు మీడియా ప్రదర్శిస్తున్న విశృంఖల, వినాశకర ధోరణివల్ల స్త్రీలు మరింత హింసకు గురౌవుతున్నారు. చిన్న పిల్లల్ని సైతం వదలకుండా వేటాడుతున్న వైనం దిగ్భ్రమకు గురిచేస్తోంది." అని అన్నారు. ఎ సందర్భంగా, ఏ కారణాలతోకూడి మీకు ఇలా అనిస్తోంది? మీడియాకి సమాజంలో ప్రజలు ఏమి చూడటానికి ఉత్సాహం చూపిస్తుంటే అదే వివరించటం సహజమూ న్యాయమూకూడా కదా? దీనికి కారణము సామాజిక సాంస్కృతిక శక్తులే కదా? వాటిని మనము ఎలా మార్చాలి?

ఓ క్షణంలోనే మీ అభిమానిగా మారిన ఓ సాదా జీవి

తర్పణాలు త్రిశంకు స్వర్గాలు

 తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...