ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.
కర్నూల్ వచ్చా నిన్న రాత్రి.ఉదయాన్నే వాకింగ్ చేద్దామని జాతీయ రహదారి(హైదరాబాద్ చిత్తూర్ పోయే దారి)మీదకి వచ్చాను.రాత్రి కురిసిన వానకి తోడు పొగమంచు జోడై దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.రోడ్డుకి అటు ఇటు పచ్చటి తివాచీ పరిచినట్టు ,దట్టంగా పొగమంచు ఆవరించిన సెనగచేలు,గుత్తులు గుత్తులుగా కంకులేసిన జొన్న చేలు,మరోపక్క పసుపారబోసినట్టు విచ్చుకున్న పొద్దు తిరుగుడు పూలతో కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు చేలు. ఆ చల్లటి వేళ ప్రక్రుతి ఎంత రమణీయంగా ఉందో నేను రాయడం కాదు చూసితీరాల్సిందే.
మెలమెల్లగా తూరుపు ఎర్రబారుతోంది.భానుడి తొలికిరణాల స్పర్శని అనుభవిస్తూ ఎందుకో అలవోకగా పశ్చిమానికి తిరిగానా నా నోట్లోంచి వావ్ అంటూ ఓ కేక దూసుకొచ్చింది.
వానజల్లు లేకుండా విచ్చుకున్న రంగురంగుల ఇంధ్రధనుస్సు.ఓ క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను.పొగమంచు కురుస్తోంది కాని వర్షం లేదే.సూర్య కిరణాలు మంచు మీద ఏటవాలుగా పడితే కూడా రెయిన్ బో వస్తుందా?(ఆ తర్వాత తెలిసింది ఆ టైం లో టౌన్ లో వాన పడిందని)
పచ్చదనం ,ఇంధ్రధనుస్సు నాతో చెట్టాపట్టలేసుకుంటూ నాతో నడిచాయంటే నమ్ముతారా మీరు?
ఒక్కదానివీ జాతీయ రహదారి మీదకి వాకింగ్ కి వెళతావా జాగ్రత్త అంటూ నా సహచరుడు హెచ్చరించాడు కానీ నేను ఒంటరిగా నడిచిందెక్కడ?పచ్చదనం,తొలికిరణాల వెచ్చదనం,ఏడురంగుల హరివిల్లు,ఉదయపు హాయైన ప్రశాంతత ఇవ్వన్ని నాతో ఉంటే నేను ఒంటరిగా నడవడమేంటి?
నిజానికి ప్రక్రుతిని మించిన తోడు వేరే ఏముంటుంది?
Sunday, November 30, 2008
Friday, November 21, 2008
మార్పు మాత్రమే శాశ్వతం
ఉదయం చల్లటి గాలి మనసారా శరీరాన్ని తాకేవేళ నా నడకతో పోటీ పడుతూ ఎన్నో ఆలోచనలు.తెలిమంచుతెరలు ఎంత అడ్డం పడినా తొలిసూర్య కిరణాలు తొంగి చూసినట్టు కళ్ళకు అడ్డంపడుతున్న,దేన్నీ స్పష్టం చూడనివ్వని సంధిగ్ధాలెన్నో పటాపంచలౌతున్న చప్పుడు.
నిన్నటి దుఖ తీవ్రత ఈరోజు ఎందుకుండదు?నిన్నటి మనోవేదన, మాటలకందని మానసిక సంఘర్షణ ఈరోజు ఏమౌతుంది?హమ్మో ఇదిలేకపోతే నేను బతకగలనా?హమ్మో అది దూరమైతే నేను భరించగలనా? నువ్వు లేకపోతే నేను బతికుంటనా?నీ కోసం ప్రాణలైనా ఇచ్చేస్తాను.నువ్వు లేని జీవితాన్ని కల్లో కూడా ఊహించలేను.ఎన్ని అబద్ధాలను మోస్తూ మనిషి బతుకుతుంటాడో ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యమేస్తుందో. స్నేహాలు, ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు ఇవన్ని అవసరమే.కానీ వాటి చుట్టూ మనం అల్లుకునే అభూతకల్పనలే వింతగా ఉంటాయి.ఆత్మ త్రుప్తి కోసం అనుకుంటూ ఎంత ఆత్మ ద్రోహం చేసుకుంటామో ఆలోచిస్తే సంభ్రమంగా ఉంది.అన్నీ శాశ్వతం,అన్నీ బంధాలూ రాతి స్వభావాన్ని కలిగి ఉంటాయి,ఎప్పటికీ మారవు అనుకోవడం లోనే అంత ఉంది చిక్కంతా.
నిజానికి ఏదీ శాశ్వతం కాదు మార్పు ఒక్కటే శాశ్వతమైంది.చుట్టూ ప్రపంచం చలనశీలతకలిగి ఉంటుంది.
సంతోషం,దుఖం రెండూ శాశ్వతం కావు.అప్పుడే నవ్విన కళ్ళు మరో క్షణంలో కన్నీళ్ళని కురిపించొచ్చు.
అవే కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా పరిణామం చెందొచ్చు.
ప్రపంచాన్ని నడిపించేది మార్పు మాత్రమే.చలనాన్ని, చలనశీలతని అర్ధం చేసుకోగలిగితే బయట ప్రపంచం ఎలా మార్పునకు గురౌతుంతో మన మనో ప్రపంచం కూడా తీవ్రమైన మార్పులకు గురౌతుందనేది అవగాహన అవుతుంది.
జీవనది నిశ్చలంగా,నిర్మలంగా నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది.కానీ అదెంత చలనశీలతను కలిగి ఉంటుందో అక్కడ నీళ్ళు లిప్త మాత్రపుసేపు కూడా నిలిచి ఉండవని మనం మర్చిపోతాం.
జీవితం కూడా అంతే కదా.అన్ని బంధాలూ,స్నేహాలూ,ప్రేమలూ మనల్ని శాశ్వతంగా చుట్టుకుని ఉన్నట్టు, అవి ఎప్పటికీ మారవని ఎంత భ్రమ పడతామో కదా!ఈ క్లారిటీ ని కమ్మేసే పొగమంచు తెరలేవో ఈ ఉదయపు వేళ జారి నా పాదాల మీద పడుతున్న భావన.
నా నడకలో మరింత ఆత్మవిశ్వాసం,ఆత్మగౌరవం.
మార్పు మీద ఎంతో ప్రేమ.శిలాసద్రుస్య బంధాల విముక్తి.మనస్సు స్వచ్చంగా,విశాలంగా ఉన్న భావన.
విశాల ప్రపంచం మీద ప్రేమ.
ఈ ఉదయం,ఈ తొలికిరణాలు,ఈ చల్లటి గాలీ ,ఈ పొగమంచూ ఈరోజుకే సొంతం.అలా అని వాటిని శాశ్వతమనుకోలేం కదా.ఇవన్నీఈ రొజున్నట్టుగానే రేపూ కావాలనుకోవడమంత వెర్రితనం మరొకటి ఉంటుందా.రేపు కొత్తగా,కాంతివంతంగా మన కళ్ళకి ఆవిష్క్రతమౌతాయిగా.
ఎంతో అద్బుతంగా,ధవళ కాంతి పుంజాలు వెదజల్లుతూ మనస్సుని మైమరపించే బ్రహ్మకమలం మర్నాటికి నిర్జీవంగా రాలిపోతుంది.
ఎంతటి ఆత్మీయ బంధమైనా,ఎంతటి వెలుగుల్ని కురిపించేదైనా అది అలాగే శిలలా ఉండిపోతుందనుకోవడం చాలా పొరపాటు.
మారాలి, మార్పుని ఆహ్వానించాలి.మనస్సుని మరింత విశాలం చేసుకోవాలి.

Wednesday, November 19, 2008
మనకేమైంది నేస్తమా
నిన్నలా చూడడం నా కెంత శిక్షో నీకు తెలుసా
చిరుగాలికి రావి ఆకులు గలగలాడినట్టు
పారిజాతాలు జలజలా రాలిపడినట్టు
తెరలు తెరలుగా మొగలి రేకుల్నివిడదీసినట్టు
సహజంగా, సెలయేరు దూకినంత స్వచ్చంగా
నవ్వే నువ్వు
నీ నవ్వుతో నన్ను వెలిగించే నువ్వు
కన్నీళ్ళు కన్నీళ్ళుగా కరిగిపోవడం
ఆ కన్నీళ్ళకి కారణం నేనే కావడం
అబ్బ! నాకెంత గుండె కోతో నీకు తెలుసా?
ఒకరి సమక్షం ఇంకొకరికి ప్రాణమైన చోటే
ఒకరినొకరం స్ప్రుశించలేకపోవడం
ఎంత విషాదం?
ఒకరికొకరం ప్రాణంగా
స్నేహానికి నిర్వచనంలా నిలబడిన
మనం ఈ రోజు ఎందుకింత నిస్సహాయులమైనాం నేస్తమా!

Monday, November 3, 2008
దిబ్బపాలెం లో కుప్పకూలిన కొంపా గూడు.
ఆ తరువాత మేం ఆ పక్కనే ఉన్న దిబ్బపాలెం గ్రామం వెళ్ళేం.
భూకంపమొచ్చి కుప్పకూలిపోయాయా?శత్రురాజుల దాడిలో కూల్చేయబడ్డాయా అన్నంత హ్రుదయవిదారకంగా ఉన్నాయక్కడ కూలిన ఇళ్ళ ద్రుశ్యాలు.కడుపులో చెయ్యిపెట్టి దేవినట్టయ్యింది. ఎవరి ఇళ్ళను వాళ్ళే కూల్చేసుకుంటున్న దారుణ ద్రుశ్యాలు.ఇళ్ళు,బళ్ళు, కమ్యూనిటి హాళ్ళు ఒకటేమిటి-దిబ్బపాలెంలో అన్నీ మట్టి దిబ్బలే.ఇటుకల పోగులే.ఒంటరిగా దిగులుగానిలబడ్డ పెరళ్ళ ముందు
ప్రేమగా పెంచుకున్న మొక్కలు."వీళ్ళంతా ఎక్కడికెళ్ళారు?" అన్న ప్రశ్నకు గూళ్ళు కూలిపోయాయిగా.చెట్టుకొకరు.పుట్ట కొకరుగా చెదిరిపోయారు.ఎవరెక్కడికెళ్ళేరో ఎవరికి తెలుసు?తమ సొంత గ్రామం.సొంత పరిసరాలు.సొంత మనుషులు.ఆ గ్రామంతో పెనవేసుకున్న అనుభవాలు.గుండె దిటవునిచ్చే సామూహిక నివాస ప్రాంతం.ఏది?ఏమైంది?ఏకాకులై ఏకాంత వాసాలకి తరలిపోయిన ఆ ప్రజల జీవన శిధిలాల్లా దిబ్బపాలెంలో కూలిన ఇళ్ళ దిబ్బలు.కార్పోరేట్ కసాయితనానికి నిదర్శనంలా కనబడుతున్న సముద్రం చుట్టూ వెలుస్తున్న వైర్ల ఫెన్సింగ్.నిర్వాసితులైన ప్రజలకి ఫోటోలు తీస్తూ,వారిపై అవాకులు,చెవాకులు పేలిన ప్రభుత్వ ప్రత్యేక అధికారిబండతనం,లేకితనం.ఉన్న ఇంటిని కూల్చేసి,వలస పొమ్మనడంలోని దుక్ఖాన్ని,గుండె కోతని లేశమంతయినా ఊహించలేని ఆ అధికారితో మా తీవ్ర వాగ్వివాదం."అభివ్రుద్ధి" విశ్వరూపాన్ని, ప్రభుత్వ దారుణ, ,నిర్లక్ష్య వైఖరిని అద్దంలో చూసిన సందర్భమది.
మిగిలింది రేపు.

Sunday, November 2, 2008
తూర్పు కనుమల్లో వెల్లువెత్తిన స్త్రీల కన్నీటి ప్రవాహాలు
భూమిక ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రచయిత్రుల సాహితీ యాత్ర ఈసారి ఉత్తరంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయమైంది.అక్టోబుర్ 17 న నలభై మంది అందులో ముప్పైకి పైగా రచయిత్రుల తో మా యాత్ర మొదలైంది.ఉత్త్రాంధ్ర లో జరుగుతున్న వివిధ సామాజిక ఉధ్యమాల అధ్యయనం, వాకపల్లి సందర్శనం మా యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు.
మేం విశాఖలో దిగిన వెంటనే అల్పాహారం చేసేసి గంగవరం, దిబ్బపాలెం వైపు వెళ్ళిపోయాం. గంగవరం పోర్టు నిర్వాసితుల గురించి మీడియా లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే.గంగవరం గ్రామ ప్రజల గుండె ఘోషను అక్షరీకరించడానికి నా కలానికున్న బలమెంతో నాకు తెలియదు కానీ "మా సముద్రం పోయింది"అనే మాట పదేపదే చెవుల్లో గింగిర్లు తిరుగుతోంది.సముద్రం మా జీవనాధరం.చేపలు పట్టుకుని బతికేటోల్లం.మమ్మల్ని మా సముద్రం నుంచి వేరు చేస్తే మేం బతికేదెట్లా?మేం పని చేసుకు బతుకుతామంటే మీకు చెక్కులిస్తా..ఇక్కడి నుండి పొమ్మంటారేమిటి?ఉద్యోగాలిస్తామన్నరు.ఇల్లు కట్టించి ఇస్తామన్నరు.ఇంకా ఏమేమో ఇస్తామన్నారు.అవన్నీ మాకెందుకు?మా సముద్రాన్ని మాకిచ్చేస్తే చాలు కదా?కన్నీళ్ళ వేడికోలు.
గంగవరంలో మహిళలు సాహసోపేతమైన ఉద్యమం నడిపారు.జైలు కెళ్ళేరు.తుపాకీ తూటాల దెబ్బలు తిన్నారు.నూక రాజు ఆత్మార్పణే చేసాడు.మహిళలు పోర్టులోకి దూసుకెళ్ళి,వంటా వార్పూ కర్యక్రమం పెట్టి,పదిహేను రోజులు అక్కడే వండుకుని,తింటూ పోర్టు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.స్త్రీలు జైలు కెళ్ళీ శిక్ష అనుభవిస్తున్నపుడు,పురుషులు ఉద్యమ ద్రోహం చేసి ఒప్పందాలు చేసుకున్నారని కన్నీళ్ళతో వారు చెబుతున్నపుడు మేమంతా నోట మాట రానివాళ్ళమయ్యాం.
గంగవరం చుట్టూ వెలుస్తున్న గోఘ సముద్రంలో పుట్టి,సముద్రంతో జీవితం పెనవేసుకుని,సముద్రమృ జీవనాధారమైన వాళ్ళనిసముద్రాన్ని ముట్టుకోకుండా అడ్డుకట్ట వెయ్యడమెంత ద్రోహమో ఎవరు చెబుతారు?మా "సముద్రం పోయింది"అంటూ గుండెలు బాబుకుని ఎడుస్తున్న గంగవరం గ్రామస్తుల్ని,ఉవ్వెత్తున ఉద్యమం నడిపి మోసగించబడిన ఆ స్త్రీ మూర్తులని ఎవరు ఓదార్చగలరు?
మిగతా భాగం రేపు

Tuesday, October 14, 2008
భూమిక స్నేహ హస్తం
12.10.2008 ఈనాడు ఆదివారం లో వచ్చిన వ్యాసం.
భర్త సాధింపులు, అత్తమామల వేధింపులు, ఉద్యోగంలో ఒడుదొడుకులు...సమస్య ఏదైనా కానీ పరిష్కార దిశలో మహిళలకు ఆసరాగా నిలుస్తోంది 'భూమిక' హెల్ప్‌లైన్.
1800 425 2908
స్త్రీవాద పత్రిక 'భూమిక' నిర్వహిస్తోన్న హెల్ప్‌లైన్ నెంబర్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది టోల్‌ఫ్రీ నెంబరు. ఒక్క ఫోన్‌కాల్‌తో మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు వీరు. చదువు, ఉద్యోగం, గృహహింస, చట్టపరమైన చిక్కులు, మానసిక ఇబ్బందులు... ఇలా అన్ని రకాల సమస్యల నుంచి స్త్రీలకు విముక్తి కలిగించేందుకు ఈ హెల్ప్‌లైన్ సాయపడుతోంది.
15 ఏళ్లుగా స్త్రీ అభ్యుదయానికి అక్షరసాయం చేస్తున్న భూమిక 2006లో ఈ హెల్ప్‌లైన్‌ను వెుదలుపెట్టింది. 'చాలా మంది మహిళలు తమ సమస్యల్ని ఉత్తరాల ద్వారా భూమికకు తెలియజేసి సరైన దారి చూపమని అర్థించేవారు. అలాంటి వారికి సమాచారం లేదా పరిష్కారం దొరికే మార్గం చూపేవాళ్లం. ఎక్కువ మందిని ఆదుకోడానికి హెల్ప్‌లైనే సరైన మార్గమని భావించి ప్రారంభించాం' అని చెబుతారు భూమిక సంపాదకులు
కె.సత్యవతి. హెల్ప్‌లైన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం 'ఆక్స్‌ఫామ్ ఇండియా' అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది.
మాటే మంత్రం ఆమెది అత్తవారింట్లో నచ్చని పెళ్లి. భర్త లేని సమయంలో అత్తమామలు మానసికంగా శారీరకంగా హింసించేవారు. మూడేళ్లు అదే పరిస్థితి. కానీ ఒక్కసారైనా ఆమె ఆ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఓరోజు తలపై కట్టెతో కొట్టారు. రక్తం కారుతుండగా బయటకు పరుగుతీసింది. ఓ ఇంటి ముంగిట స్పృహతప్పి పడిపోయింది. ఆ సమాచారం భూమికకు అందింది... నిమిషాల్లో 108తో పాటూ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడకు చేరుకుని ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పూర్తయిన తర్వాత రక్షణ గృహంలో ఆశ్రయం కల్పించారు. కొన్నాళ్లకు అత్తమామలతోపాటు భర్తకు కౌన్సిలింగ్ ఇప్పించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు సుఖంగా జీవించడం వెుదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. కాస్త అటూ ఇటుగా ఇలాంటి నేపథ్యంతో భూమిక దృష్టికి వచ్చే కేసులు నెలలో అయిదు వరకూ ఉంటాయి.
ఆలుమగల మనస్పర్థల పరిష్కారానికీ భూమిక వేదికగా నిలుస్తోంది. తమ బాధలు పంచుకోడానికి ఎవరూ లేరని ఫోన్ చేసేవారూ, ఉన్న వాళ్లెవరూ తమని పట్టించుకోవడం లేదని చెప్పేవారూ... రోజులో పది మందైనా ఉంటారు. సమస్యను చెప్పుకోడానికీ, బాధను పంచుకోడానికీ ఓ ఆత్మీయ నేస్తం కావాలి... అది భూమిక రూపంలో వాళ్లకి దొరికింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలపాటు గొంతులో దాచుకున్న బాధ
ఒక్కసారి బయటకు వస్తుంది. 'ఫోన్ చేసినవారి మాటల్ని చాలా ఓపికతో వింటాం. ఒక్కోసారి గంటకు పైగానే మాట్లాడతారు. అయినా మేం విసుగుచెందం. అన్నీ విన్నాక సలహా లేదా సూచన చెబుతాం. తుది నిర్ణయం వారిదే. ఒక నిర్ణయానికి వచ్చాక సమస్య పరిష్కారానికి మా వంతు సాయం చేస్తాం' అని చెబుతారు భూమిక ప్రతినిధులు.
ఎల్లలు దాటి
రాష్ట్రంలోని అన్ని మూలల నుంచి వీరికి ఫోన్‌లు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళల సమస్యల పరిష్కారానికి వీరిని ఆశ్రయించేవారు ఎక్కువ. అమెరికాలోని దక్షిణాసియా దేశాల మహిళల బాగోగులు చూసే 'మానవి' స్వచ్ఛంద సంస్థ తెలుగువారి సమస్యల పరిష్కారానికి భూమిక సాయం తీసుకుంటోంది. ఉద్యోగాల ఆశతో వెళ్లి విదేశాల్లో వోసపోయిన వారు స్వదేశం చేరుకోడానికీ వీరే దిక్కు. హెల్ప్‌లైన్ సేవలు జిల్లాలకూ విస్తరించాలనే భూమిక లక్ష్యం ఇపుడు నెరవేరింది. భూమిక స్ఫూర్తిగా ప్రభుత్వం ఇందిర క్రాంతిపథం సభ్యులచేత ప్రతి జిల్లా కేంద్రంలో మహిళా సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. వీరంతా భూమిక హెల్ప్‌లైన్ నిర్వాహకుల దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపు పది జిల్లాల్లో ఇప్పటికే హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాలకు చెందిన వారు శిక్షణలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల స్థాయి వరకూ అధికారుల ఫోన్ నెంబర్లూ వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రంలో ఏ మూలనుంచి సమస్య వినిపించినా తక్షణ పరిష్కారం కోసమే
ఈ ఏర్పాట్లు. బాధితులు ఆయా జిల్లాల్లో ఉండే మానవహక్కుల సంఘాలు, లోక్ అదాలత్, మహిళా కమిషన్ ద్వారా లబ్ధిపొందడానికీ సాయపడతారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది వరకూ భూమిక వాలంటీర్లు ఉన్నారు. వీరిలో మహిళా న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలకి చెందిన వారు ఎక్కువ. న్యాయ సంబంధ సలహాల కోసం ప్రతి శనివారం న్యాయవాదితో ఫోన్‌లో ప్రత్యక్షంగా మాట్లాడే వెసులుబాటు ఇటీవల ప్రారంభించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిత్యం ఉండనే ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకుపోయి అల్లాడే మహిళలను అందులోంచి బయటపడేలా చేయడంలో 'భూమిక' హెల్ప్‌లైన్ కీలక భూమిక వహిస్తోందనడంలో సందేహం లేదు.

Sunday, October 12, 2008
భూమిక హెల్ప్ లైన్ గురించి ఈనాడు లో వచ్చిన ఆర్టికల్ ని ఈ లింక్ లో చదవొచ్చు.
ఈనాడు సండేమాగజైన్ చూడండి
http://epaper.eenadu.net/svww_index1.php
http://epaper.eenadu.net/svww_index1.php
Saturday, October 11, 2008
''బెల్ బజావో''-గంటకొట్టండి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే-3' నివేదిక ప్రకటించింది. ఈ రిపోర్టు వెల్లడించిన కొన్ని అంశాలు -ముఖ్యంగా దేశంలో గృహహింస బాధిత స్త్రీల సంఖ్యను చూస్తే చాలా బాధాకరంగా, ప్రమాదకరంగా వుంది. నిరక్షరాస్యత, అభివృద్ధి లేమికి మారుపేరైన బీహార్‌లో పరిస్థితి మరీ దారుణంగా వుంది. బీహార్‌లో 50 శాతం మందికి పైగా నిత్యం భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నారు. జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే -3 నివేదికలోని ముఖ్యాంశాలు ఇవి.
బీహార్‌లో 59 శాతం మంది కుటుంబ హింసకు గురవుతున్నారు.
19 శాతం మంది లైంగిక హింసకు బలవుతున్నారు.
మహిళలపై గృహహింసలో జాతీయ సగటు 37శాతం
ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే 14శాతం మంది భౌతిక హింస, 35 శాతం మంది లైంగిక హింసను అనుభవిస్తున్నారు.
గృహహింసలో అగ్రస్థానం బీహార్ అయితే అట్టడుగు స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ (6%)వుంది. నిరక్షరాస్యతకు, హింసకు దగ్గర సంబంధముందని ఈ నివేదిక పేర్కొంటూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న పురుషులలో 60శాతం మంది అక్షర జ్ఞానం లేనివారేనని తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఇంత ఎక్కువ సంఖ్యలో నిత్యం గృహహింసను ఎదుర్కొంట స్త్రీలు బతుకులు వెళ్ళదీయడం అనేది ఏ దేశానికైనా సిగ్గుచేటైన విషయం. కోట్ల సంఖ్యలో స్త్రీలు, గృహహింసనుండి రక్షణ చట్టం వచ్చిన తరువాత కూడా హింసకు గురవ్వడం గమనించినపుడు చట్టాలు ఎంత సొంపుగా అమలవుతాయె అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంలో అగ్రస్థానం సంపాదించిన బీహార్‌లో ఈ రోజుకీ రక్షణాధికారుల నియామకం జరగలేదు. గృహహింస చట్టం అమలు చేయమని, రక్షణాధికారులను నియమించమని ఒక న్యాయవాది శృతిసింగ్ పాట్నా హైకోర్ట్‌లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చెయ్యల్సి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో వుంది. వివిధ ఎన్.జి.వోలు ఈ చట్టం అమలు విషయమై పట్టుదలతో పనిచేయడంవల్ల పూర్తిస్థాయి రక్షణాధికారుల నియామకం జరిగింది. బాధిత స్త్రీలు వీరి ద్వారా కోర్టులో కేసులు వేయగలుగుతున్నారు. హింసాయుత జీవితాల నుండి విముక్తి పొందగలుగుతున్నారు. అయినప్పటికీ ఈ చట్టం గురించిన అవగాహన, చైతన్యం ఇంకా చాలా మందికి లేదు. ప్రభుత్వం గృహహింస నిరోధక చట్టాన్నయితే తెచ్చింది కానీ ఎలాటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రభుత్వం సరైన రీతిలో ప్రచారం చేపట్టి వుంటే కొంతమంది మహిళలైనా చట్ట సహాయంతో హింసాయుత బతుకుల్లోంచి బయటపడగలిగేవారు.
నిజానికి భారతదేశంలో హెచ్‌ఐవి/ఎయిడ్స్ కన్నా గృహహింస వల్ల ఎక్కువ మంది మహిళలు చనిపోతున్నారు. అయినప్పటికీ హెచ్‌ఐవి నిరోధక ప్రచారం కోసం ప్రభుత్వాలు కోట్లాది రపాయలు ఖర్చు చేస్తున్నాయి. గృహహింస అంశాన్ని ప్రభుత్వం హెచ్‌ఐవి కన్నా ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రచారం చేయాల్సి వుంది. ఇప్పుడిప్పుడే ఆ ప్రచారం ప్రారంభమౌతున్నసూచనలు కన్పించడం సంతోషదాయకం. అలాంటి ఒక ప్రచారానికి సంబంధించినదే ''బెల్ బజావో'' కార్యక్రమం. నాకు తెలిసి మొట్ట మొదటి సారిగా కేంద్ర శిశు సంక్షేమశాఖ, "బ్రేక్ త్రూ" http://www.bellbajao.org/ అనే అంతర్జాతీయంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ కలిసి బెల్ బజావో ప్రోగ్రామ్‌కి శ్రీకారం చుట్టాయి.
ఈ ప్రోగ్రామ్ కింద రెండు వీడియోలను వీరు రూపొందించారు. వీటి ద్వారా గృహహింస మీద మౌనంగా వుండొద్దు అని చెప్పదలిచారు. ముఖ్యంగా ఈ రెండు వీడియోలు బాలురను, పురుషులను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఒక దానిలో ఒక మొహల్లాలో క్రికెట్ ఆడుకుంటున్న మగపిల్లలు, ఒక ఇంట్లో భర్త తలుపులు మూసి భార్యను కొట్టడం, ఆమె గట్టిగా కేకలు పెడుతూ ఏడ్వడం వింటారు. వెంటనే వారు ఆట ఆపేసి, ఆ ఇంటికెళ్ళి, కాలింగ్ బెల్ కొడతారు. హింసిస్తున్న భర్త బయటకొచ్చి ఏంటి అని అడుగుతాడు. బాల్ పడింది మీ ఇంట్లో అంటారు పిల్లలు. నిజానికి బాల్ వాళ్ళ చేతుల్లోనే వుంటుంది. అప్పటికి ఆ ఇంట్లో హింస ఆగుతుంది. ఇంకో వీడియెలో పక్కింట్లో, భార్యను కొడుతున్న భర్త, బిగ్గరగా ఏడుస్తున్న భార్య. పక్కింటాయన లేచి వెళ్ళి బెల్ కొట్టి కొన్ని పాలు ఇస్తారా అని అడుగుతాడు. భర్త లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కూడా అప్పటికి తాత్కాలికంగా హింస ఆగుతుంది.
ఈ చిన్న వీడియోలు అందిస్తున్న సందేశం అద్భుతంగా వుంది. ఇంతకాలం గృహహింస అనేది వ్యక్తిగత వ్యవహారమని, బయటవాళ్ళు కల్గించుకూడదనే అపోహని ఇవి బద్దలు కొట్టాయి. ముఖ్యంగా పురుషుల్ని, మగపిల్లల్ని చైతన్యవంతం చేయడం ద్వారా గృహహంసను ఆపొచ్చు అనేది వీరి ఉద్దేశ్యం. గృహ హింస సామాజికమైందని, ఇది వ్యక్తిగతంకాదని చెప్పడం ద్వారా సమాజం మొత్తం దీన్ని ఆపడానికి ఉద్యమించాలని చెప్పక చెప్పారు ఇందులో. ఈ సందేశాన్ని అంటే 'బెల్ బజావో' గంట కొట్టండి, లేదా ''మూసిన తలుపుల్ని కొట్టండి'' అంటూ ఒక వాహనం రూపొందించి దేశవ్యాప్త ప్రచారానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రయత్నమని చెప్పాలి. అందుకే నేను మీ అందర్ని కోరుతున్నాను మిత్రులారా? గృహహింసను ఆపడానికి మూసిన తలుపుల్ని తెరిపించండి. గంటకొట్టండి హింసను ఆపడంలో మీరూ భాగస్వాములు కండి.

Monday, September 29, 2008
తుపాకీ మొనపై వెన్నెల
(ఈ ప్రయాణానుభవం ఇంతకుముందు ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయ్యింది.
ఈ ఫోటో కూడా అందులోదే.) క్రితం సంవత్సరం జమ్మువెళ్ళి వచ్చిన దగ్గరి నుంచి శ్రీనగర్ చూడాలనే కోరిక మరింత బలపడసాగింది. మేం శ్రీనగర్ ప్రోగ్రామ్ వేసుకోగానే ఎక్కువమంది నిరుత్సాహపరిచారు.ముందే అక్కడ శాంతి భద్రతల సమస్య వుంది దానికి తోడు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. శ్రీనగర్‌కు వెళ్ళడం మంచిది కాదు అని సలహా ఇచ్చారు. అయినా మేం వెళ్ళడానికే నిర్ణయించుకున్నాం.
మే ఒకటవ తేదీన ఢిల్లీలో దిగగానే పిడుగులాంటి వార్తను మోసుకొచ్చారు ప్రొటోకాల్ అదికారులు. ఏప్రిల్ 26 నుంచి వరసగా నాలుగు రోజులు శ్రీనగర్‌లో వర్షాలతో పాటు, విపరీతంగా మంచు కురిసిందని, లేహ్ వెళ్ళే రోడ్లు మంచుతో నిండిపోవడం వల్ల ముసేసారని ఆ వార్త సారాంశం. శ్రీనగర్, సిమ్లా, కులు,మనాలి ప్రాంతాల్లో మంచు కురస్తుండడం వల్ల అక్కడికి విమాన సర్వీసులు రద్దయ్యాయని కూడా చెప్పారు. ప్రాణం ఉస్సురంది. మాతోపాటు శ్రీనగర్ ప్రోగ్రామ్ పెట్టుకున్న మరొకరు వాళ్ళ ప్రయాణం కాన్సిల్ చేసుకున్నారు. ఢిల్లీలో రెండు రోజులు గడిపాక మే మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల ఫ్లయిట్‌కి మేం శ్రీనగర్ వెళ్ళాల్సి వుంది.
రెండో తేదీ సాయంత్రం నా బెంగాలీ మిత్రురాలు ఉత్పల వాళ్ళింటికి వెళ్ళాం. మాటల సందర్భంలో ఉలన్ దుస్తులు తీసుకెళుతున్నారా అని అడిగింది ఆమె. నేను ఒక షాల్ మాత్రమే తీసుకెళుతున్నానని చెప్పాను. శ్రీనగర్, లే వెళుతూ ఒక్క షాల్ సరిపోతుందనుకున్నావా అంటూ తన దగ్గరున్న ఉలెన్ బట్టలన్నీ ఓ సూట్‌కేస్ నిండా సర్ది ఇచ్చింది. రెండు లాంగు కోటులు, మంకీక్యాప్‌లు, షాక్సులు, గ్లౌజులు, స్వెట్టర్‌లు సూసి ఇవన్నీ ఎందుకని నేను నవ్వితే అక్కడికెళ్ళాక అర్థమౌతుందిలే ఎందుకో అని తనూ నవ్వింది. నిజంగానే లే వెళ్ళాక నాకు బాగానే అర్థమైంది. అవన్నీ తీసుకెళ్ళి వుండకపోతే మేం చలికి గడ్డకట్టుకుపోయేవాళ్ళం.
ఉత్పల ఇచ్చిన అదనపు సట్‌కేస్‌తో సహా మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళాం. మాతోపాటు కాశ్మీరుకు చెందిన మరొక ఆంధ్రప్రదేశ్ జడ్జి, ఆయన భార్య వహీదా కూడా సమ్మర్ వెకేషన్ కోసం శ్రీనగర్ వెళుతున్నారు. శ్రీనగర్ ఫ్లయిట్ కన్‌ఫర్మ్ అయ్యేవరకు నాకు ఆందోళనగానే వుంది. శ్రీనగర్‌లో వాతావరణం మెరుగైందని విమానం బయలుదేరబోతున్నదని తెలియగానే నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. విమానం గాల్లోకి లేవగానే నా మనసు విమానం రెక్కమీదకెక్కి కూర్చొంది. వెన్నముద్దల్లాంటి మబ్బుతునకల్ని చీల్చుకుంటూ విమానం ఎగురుతోంది. ఓ అరగంట గడిచాక వహీదా నన్ను పిల్చి ఇక్కడ కూర్చో అంటూ కుడివైపు విండో సీట్ ఆఫర్ చేసింది. ఆ సీట్లో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూడగానే అద్భుతమైన దృశ్యం కంటబడింది. మంచుతో కప్పబడి, సూర్యకాంతికి మెరుస్తున్న హిమాలయ ఉత్తుంగ పర్వత పంక్తులు. లోతైన లోయలు, సన్నటి నీటి పాయలు. ధవళ కాంతులీనుతున్న పర్వత సముదాయాలు మనస్సును పులకరింపచేసాయి. కన్నార్పితే ఏ సౌందర్యం కనుమరుగైపోతుందో అని చేపలాగా అనిమేషనై అలాగే చూస్తుండిపోయను. కాశ్మీరు లోయలోకి ప్రవేశిస్తున్నాం అంది వహీదా. కళ్ళను కట్టిపడేసే ఆ ఆకుపచ్చలోయ సొగసును అనుభవించాలి తప్పమాటల్లో వర్ణించలేం. పచ్చనిలోయ చుట్టూ మే నెల ఎండలో మెరుస్తున్న మంచు పర్వతాలు. మరో పావు గంటలో విమానం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది.
ఎయిర్‌పోర్ట్ నించి బయటకు వచ్చి కారులో కూర్చుని తలుపు వేయబోయను. ఒక్క అంగుళం కదలలేదు. ఆ తర్వాత తెలిసింది అది బుల్లెట్ ఫ్రూఫ్ కారని. ఎందుకు బుల్లెట్ ఫ్రూఫ్ కారని అడిగితే ఇక్కడ మిలెటెన్సీ ప్రోబ్లమ్ వుంది. సెక్యూరిటీ కోసం తప్పదు అన్నారు. నా వరకు ఆ కారులో కూర్చోవడం ఇష్టంలేకపోయింది. కాని తప్పలేదు. ఎకె 47 పట్టుకున్న పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ముందు సీట్లో సెటిల్ అయిపోవడం కూడా నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు.
టూరిస్టులు లేక అన్నీ ఖాళీగా పడివున్నాయని మా షికారీని నడిపిన హమీద్ చెప్పాడు. హౌస్ బోటుల్లోపల గదులు ఫైవ్‌స్టార్ హోటళ్ళలో గదుల్లా అన్ని హంగులతో వున్నాయి. ప్రతి బోటు ముందు దిగులు ముఖాలతో యజవనులు కూర్చుని వున్నారు. హమీద్ ఫ్లోటింగు గార్డెన్ గురించి చెబుతూ గబుక్కున షికారీలోంచి నీళ్ళల్లో ఏపుగా ఎదిగిన గడ్డిమీదికి దూకాడు. గమ్మత్తుగా ఆ గడ్డి లోపలికి కుంగి వెంటనే పైకి లేచింది,. మేం ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టాం. ' ఏ పానీకా ఊపర్ జమీన్' అంటూ నవ్వాడు. దానిమీద టమాటాలు, కీరకాయలు, తరుబూజాలు పండుతాయని చెప్పి మరింత ఆశ్చర్యపరిచాడు. దాల్‌లేక్ మధ్య చిన్న ద్వీపం. దాని మీద నాలుగు చినార్ చెట్లు వుండే ప్రాంతాన్ని చూపించి దీన్నీ ' చార్ చినార్' అంటారని చెప్పి అటు తీసుకెళ్ళాడు. చుట్టు పరుచుకుని వున్న మంచు కొండలు దాల్‌లేక్ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుంటాయి.
శ్రీనగర్‌లో చక్కటి ఉద్యానవనాలు చాలా వున్నాయి. వీటన్నింటినీ మొఘల్ గార్డెన్స్ అని పిలుస్తారు. చష్మీషాహి, పరీమహల్, నిషాద్, హనూర్, షాలిమార్. వీటిలో చష్మీషాహి ఉద్యానవనంలో ఓ ప్రత్యేకత వుంది. అక్కడ భూమి నుంచి ఉబికి వచ్చే సహజసిద్ధమైన వాటర్ ఫౌంటెన్ నుంచి చల్లటి, స్వచ్ఛమైన నీళ్ళు సంవత్సరం పొడుగునా వస్తుంటాయి. ఆ నీళ్ళనే నెహ్రూ తాగేవాడని చెప్పి మాచేత కూడా తాగించారు. ఫ్రిజ్‌లోంచి తీసినట్టు చల్లగా వున్నాయి. మిగతా మొఘల్ గార్డెన్స్ కూడా చూసాక శ్రీనగర్‌లో ప్రసిద్ధమైన సిల్క్ చీరల ఫ్యాక్టరీని చూద్దామని మాతో వచ్చిన వాళ్ళని అడిగాం. మా డ్రైవర్ చీకటి పడబోతోందని, ఇంక బయట తిరగడం మంచిది కాదని అడ్డుపడ్డాడు. ఇంకా ఆరున్నర కూడా కాలేదు. అక్కడ ఏడున్నర దాకా వెలుగుంటుంది. ఇప్పుడే రూమ్‌కెళ్ళి ఏం చేస్తాం పోనీ షాపింగుకి వెళదాం అంటే మార్కెట్‌కెళ్ళడం అస్సలు శ్రేయస్కరం కాదని తెగేసి చెప్పాడు. ఏడు కూడా కాకుండానే మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లోకి తోసేసి వెళ్ళిపోయాడు.
మర్నాడు గుల్‌మార్గ్ వెళ్ళాలని చాలా తొందరగా తయరైపోయామ్. గుల్‌మార్గ్ శ్రీనగర్‌కి 57 కిలోమీటర్ల దూరంలో 2730 మీటర్ల ఎత్తులో వుంది. గుల్‌మార్గ్ అంటేనే పూల రహదారి. శీతాకాలంలో కురిసిన మంచు జూన్, జూలై నెలల్లో కరిగిపోయి పర్వతాలు మొత్తం రంగు రంగుల పూలతో నిండిపోతుంటాయట. మేం వెళ్ళింది మే నెలలో కాబట్టి ధవళ కాంతుల్తో మెరిసే కొండల్ని మాత్రమే మేంచూడగలిగాం. తొమ్మిదింటికి మా డ్రైవర్ అన్వర్ వచ్చాడు. వచ్చీ రాగానే ' మీరు నిన్న మార్కెట్‌కి వెళదామన్నారు చూడండి, అక్కడే గ్రేనెడ్ పేలింది రాత్రి. ఒక మిలటరీ జవాను ఇద్దరు పౌరులు గాయపడ్డారు!'అన్నాడు. 'నిజంగానా' అన్నాను నేను. ' ఇది మాకు అలవాటైపోయింది. మేం గ్రేనేడ్స్ మద్య బతకడం నేర్చుకున్నాం' అన్నాడు మనసంతా వికలం అయిపోయింది.
మా మూడ్స్ మళ్ళీ మామూలు అయ్యింది గుల్‌మార్గ్ దారిలో పడ్డాకే. దట్టమైన అడవిలోంచి ప్రయాణం అద్భుతంగా వుంటుంది. ఆకాశాన్నంటే ఫైన్, దేవదార్, పోప్లార్ వృక్షాలు. కొండపైకి వెళ్ళే కొద్దీ దగ్గరయ్యే మంచుకొండలు. కొండలమీద అక్కడక్కడ రాత్రి కురిసిన మంచు ముక్కలు. పెద్ద మంచు దిబ్బ మా కారుకు అడ్డు వచ్చిన్ది. అన్వర్ దానిమీద నుంచే కారు పోనిచ్చాడు. మెత్తగా జారిపోయింది కారు. అక్కడి నుంచి మంచు మీదే ప్రయాణం. పన్నెండులోపే గుల్‌మార్గ్ చేరిపోయామ్. ఎక్కడ చూసినా మంచే. కారుదిగి మంచు మీద నడుస్తుంటే ఇది కలా నిజమా అన్నంత అబ్బురమన్పించింది. మంచుతో నిండిపోయిన కొండలమీద కూడా సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతున్నాడు. వేడి మాత్రం తగలటం లేదు. కాసేపు మంచులో కేరింతలు కొట్టాక గండోలా( కేబుల్ కార్) లో టాప్ ప్లేస్ ఐన సెవెన్ స్ప్రిన్గ్స్ చేరాక సూర్య కిరణాలతో ధగధగ మెరిసిపోతున్న ఆ హిమసమూహ దర్శనం మమ్మల్ని సవ్మెహితులను చేసింది. కన్నార్పడం మర్చిపోయామ్. ఐస్‌మీద ఎగిరాం. గుప్పెళ్ళనిండా తీసుకుని గుండెలకద్దుకున్నాం. మోకాళ్ళలోతు మంచులో నడవడం గురించి నేను కల కూడా కని వుండను. ఆ స్వచ్ఛమైన మంచు స్పర్శని అనుభవించడం కోసం నేను వేసుకున్న ఊలు దుస్తుల్ని తీసిపారేసి, చీరతోనే తిరిగాను. మైనస్ డిగ్రీ చలిలో, ఆ మంచులో స్వెట్టర్లాంటిదేదీ వేసుకోకుండా, మంచు మత్తులో తిరిగినదాన్ని అక్కడ నేను ఒక్కదాన్నే. ఆ అందమైన అనుభవాన్ని గుండెల్లో దాచుకుని గుల్‌మార్గ్ నించి తిరుగు ప్రయణమైనాం. వెళ్ళేటప్పుడు మామూలుగానే వున్ననా సహచరుడి ముఖం తిరిగివచ్చేటప్పుడు ఆపిల్ పండు రంగులో కొచ్చింది. 'స్నోబైట్' ' సన్‌బర్న్' అని తర్వాత తెలిసింది. ముఖమంతా కమిలిపోయినట్లయింది. 'నిన్ను మంచు కరిచింది. నన్నేమో ముద్దుపెట్టుకుంది ' అంటూ ఏడిపించాను.
మర్నాడు పెహల్‌గావ్ వెళ్ళొచ్చని, అనంతనాగ్ లో ఎన్నికలు అయిపోయయి కాబట్టి ఏమి ప్రమాదం లేదని అన్వర్ ప్రకటించాడు. అమర్‌నాథ్ యత్ర పెహల్‌గావ్ మీదుగానే జరుగుతుంది. అమర్‌నాథ్ గుహ పెహల్‌గావ్‌కి 16 కి.మీ దూరంలో వుంది. ప్రపంచంలోనే ప్రసిద్దమైన కుంకుమపువ్వుల పొలాలు కూడా ఈ దారిలోనే వున్నాయి. అయితే మా పెహల్‌గావ్ ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. శ్రీనగర్ నుంచి మేం ముఫ్ఫై కిలోమీటర్లు ప్రయాణం చేసాక ఓ పెద్ద ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయామ్. అనంతనాగ్ లో ఆ క్రితంరోజే ఎన్నికలు ముగిసాయని, భద్రతా దళాలు, ఎన్నికల సామాగ్రి, సిబ్బంది ఓ పెద్ద కాన్వాయ్‌గా జమ్ము బయలుదేరిందని అన్వర్ చల్లగా చెప్పాడు. మూడు గంటల పాటు ఆగిపోయామ్. ఎలాగో దాన్నుండి బయటపడి పెహల్‌గావ్ చేరేటప్పటికి రెండయిపోయింది. శేష్‌నాగు సరస్సుకు వెళ్ళలేకపోయామ్. అయితే మా ప్రయణం పొడవునా ట్రెడ్పీనది పరవళ్ళను చూడగలిగాం. రాళ్ళమీద గల గల పారే ట్రెడ్సీనది నీళ్ళు ఫ్రీజర్‌లోంచి తీసినట్టున్నాయి. తిరుగు ప్రయాణంలో నేషనల్ పార్క్‌లో వున్న ట్రాట్ ఫిష్ ఫామ్‌కెళ్ళి వేడి వేడి ఫిష్ తిన్నాం. అతి చల్లటి ఫ్రెష్ వాటర్‌లోనే ట్రాట్‌ఫిష్ బతుకుతుంది. దేశంలో మరెక్కడా ఈ చేప దొరకదట. శేష్‌నాగ్ సరస్సును చూడలేకపోయమన్న నిరాశతో తిరిగి వచ్చేం.
మే 7 న ఉదయం తొమ్మిదింటికి మా ' లేహ్' ప్రయాణం మొదలైంది. లేహ్ గురించి మమ్మల్ని చాలా మంది బయపెట్టారు. సముద్రమట్టానికి 14,500 అడుగుల ఎత్తులో వుంది లేహ్ పట్టణం. అది లదాఖ్ రాజధాని. ఒక్కసారిగా ఆ ఎత్తైన ప్రదేశంలో కాలు పెట్టగానే చాలా ఆరోగ్య సమస్యలు అంటే తీవ్ర తలనొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంతా బరువెక్కిపోవడం, ఊపిరాడకపోవటం లాంటి సమస్యలతో పాటు గడ్డకట్టించే చలి వుంటుందని నేను ఇంటర్‌నెట్ ద్వారా తెలుసుకున్నాను. మిత్రులు కూడా చెప్పారు. శ్రీనగర్ నుంచి లేహ్ కు విమానంలో అయితే అరగంటే పడుతుంది. అదే కారులో అయితే 20 గంటలు పడుతుందట. కార్గిల్‌లో రాత్రి ఆగి వెళ్ళాల్సి వుంటుంది. అయితే ఏప్రిల్ 26 న కురిసిన మంచు వల్ల శ్రీనగర్ - లేహ్ రహదారి మూసేసారు. మేం విమానంలోనే వెళ్ళాం. లేహ్ లో విమానం రెండు కొండల మధ్య నుంచి దిగుతుంది. ఆ దృశ్యం తప్పకుండా చూడు అని వహిదా చెప్పిన్ది. తొమ్మిదిన్నరకి లేహ్ లో దిగాం. నిజంగానే విమానం ల్యాండింగ్ అద్భుతంగా వుంది. గమ్మత్తుగా ఒక వేపు మంచు కొండలు, ఒక వేపు ఎడారి లాంటి ఇసుక కొండలు. వాటి మధ్యనించి విమానం దిగింది. ఎందుకైనా మంచిదని భుజానికి వేలాడుతున్న స్వెట్టర్‌ని ఒంటికి తగిలించాను. మెట్లు దిగుతుంటే వంద కేజీల బియ్యం బస్తా తలమీద వున్న ఫీలింగు కలిగింది. ఒళ్ళంగా బరువుగా అయిపోయి ఆచితూచి అడుగేయాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోనే వున్న ఫుల్‌మూన్ గెస్ట్‌హౌస్‌కి తీసుకెళ్ళారు. వేగంగా నడవొద్దని, వొంగకూడదని, ఎక్కువ మాట్లాడవద్దని, సాయంత్రం దాకా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు ప్రోటోకాల్‌వాళ్ళు. డాక్టర్ వచ్చి మా ఇద్దరి బ్లెడ్ ప్రెషర్ చెక్ చేసాడు. నార్మల్‌గానే వుంది. చలి గడ గడ లాడించేస్తోంది. హై ఆల్టిట్యూడ్ వాతావరణంలో ఎదురయ్యే ఇబ్బందులేవీ మమ్మల్ని తాకలేదు. మేం సాయంత్రం ఫ్రెష్‌గా తయారై బయటకు వస్తుంటే మా డ్రైవర్ తాషి ' ఆప్ లోగ్ హమ్ సె బీ ఫిట్ హై, ఏక్ దమ్ ఫిట్' అంటూ నవ్వాడు. అతడా మాట అనగానే మాలోని ఆందోళనంతా పటాపంచలై వొళ్ళంతా తేలికగా అయిపోయింది. ఆ తర్వాత 'హాల్ ఆఫ్ ఫేమ్' పేరుతో మిలటరీ వాళ్ళు ఏర్పాటు చేసిన మ్యూజియం చూడ్డానికి వెళ్ళాం. లేహ్ చరిత్రతో పాటు, లదాఖ్ ఫెస్టివల్స్, నృత్యాల గురించిన సమాచారం ఎంతో వుందక్కడ. కార్గిల్ యుద్ధం, యుద్ధంలో మరణించిన వారి వివరాలు, సియాచిన్ గ్లేసియర్ ఫోటోలు, అక్కడి భద్రతా దళాలు ధరించే దుస్తుల వివరాలు, పాకిస్తాన్ ఖైదీల ఫోటోలు, వాళ్ళ నించి సంపాదించిన ఆయుధాలు అన్నింటినీ ప్రదర్శించారక్కడ.
అక్కడినుంచి మార్కెట్‌కు వెళ్ళాం. చిన్న బజారది. అక్కడే వున్న చహంగా విహార్‌కు వెళ్ళాం. లేహ్ చుట్టూ ఎన్నో బౌద్ధ ఆరామాలు వున్నాయి. వాటిని గొంపాలంటారు. హెమీస్, ఆల్చి, ఫైయండ్, షె మొదలైన ఎన్నో గొంపాలు వున్నాయి. వీటిలో లేహ్ కు 40 కిలోమీటర్ల దూరంలో వున్న హెమీస్ గొంపా చాలా పెద్దది. ధనికమైనది. ఈ గొంపాల్లో వందల సంఖ్యలో లామాలుంటారు. ప్రతీ గొంపా విలక్షణ మైన పూజా పద్దతుల్ని కలిగి వుంటుంది. కొన్నింటికి దలైలామా అధిపతిగా వున్నాడు.మేం ఏడున్నరదాకా బయట తిరుగుతూనే వున్నాం. పావు తక్కువ ఎనిమిది వరకు సూర్యాస్తమయం కాలేదు. మమ్మల్ని గెస్ట్ హౌస్‌లో వదిలేస్తూ తాషి ' ఇక్కడ వెన్నెల చాలా బాగుంటుంది . చూడండి' అన్నాడు.నా సహచరుడేమో "ఇంత చలిలోనా చస్తాం' అన్నాడు. నేను మాత్రం ఎలాగైనా చూడాలి అనుకున్నాను. ఆరాత్రి తను నిద్రపోయాక లాంగ్ కోట్, గ్లౌస్ వేసుకుని, మంకీకేప్ తగిలించుకుని ఒక్కదాన్ని బాల్కనీలోకి వెళ్ళాను. వావ్! అద్భుతం! మంచుకొండలతో పోటీపడి కురుస్తున్న వెన్నెల, పండువెన్నెల ! తిలక్ ' అమృతం కురిసిన రాత్రి' కవిత అలవోకగా నా నాలుకమీదకొచ్చిన్ది. చలికి కాలివేళ్ళు కొంకర్లు పోతున్నా అలాగే మైమరచి చూస్తండిపోయను. తాషికి థాంక్స్ చెప్పుకుని పిల్లిలాగా లోపలికొచ్చి రజాయిలో దూరిపోయను. మంచుకొండలమీద వెన్నెలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలలు కంటూ వెచ్చగా నిద్రపోయాను.
మే ఎనిమిదో తేదీన మా అసలు అడ్వంచర్ మొదలైంది. 17,350 అడుగుల ఎత్తులో వున్న చాంగ్లా పాస్ దాటి 14,000 అడుగుల ఎత్తున వున్న పాన్‌గాంగ్ సరస్సును చూడడానికి మనస్సు తహతహలాడసాగింది. అంత ఎత్తుకెళ్ళడం చాలా కష్టమని,గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువగా వుంటుందని మమ్మల్ని నిరుత్సాహపరచబోయారు. కాని మేం వినలేదు. తాషి మాత్రం మమ్మల్ని ఉత్సాహపరిచాడు. అవసరమొస్తుందేమోనని హాస్పిటల్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి పెట్టాడు. మేం ఎనిమిది గంటలకు బయలుదేరాం. మనాలి - లేహ్ రోడ్డు మీదుగానే చాంగ్లా పాస్‌కి వెళ్ళాలి. అతి పురాతనమైన సింధునది దర్శనం ఇక్కడే అయ్యింది. ' కారు' గ్రామం నుంచి కుడివేపు మనాలి రోడ్డు, ఎడంవేపు పాన్‌గాంగ్ సరస్సుకెళ్ళే రోడ్డు విడిపోతాయి. మా కారు ఎడంవేపు తిరిగింది. మాలో చెప్పలేని ఉత్కంఠ, ఉద్వేగం. చాంగ్లాపాస్ దాటగలమా లేదా అనే ఆందోళన. ఆ బృహత్తర పర్వత సముదాయల మధ్య సన్నటి రోడ్డు మీద కారు మెలికలు తిరుగుతోంది. ఒక్క రోడ్డు తప్ప సమస్తం స్నోతో నిండివుంది. చిన్న చిన్న సెలయేళ్ళు, రాసులు రాసులుగా హిమపాతం. కారు దిగి కేరింతలు కొట్లాలని, ఈల లేసి గోల చెయ్యాలనే బలమైన ఆకాంక్షని చలి చిదిమేసింది. అయినా ధైర్యం చేసి ఒక చోట దిగి మంచుని ముద్దాడుతూ ఫోటోలు తీసుకున్నాం. గడగడలాడిపోయామ్. అక్కడ మైనస్ 4 టెంపరేచర్ వుంటుందని తాషి చెప్పాడు.చిన్న చలికే తట్టుకోలేని నా సహచరుడు మైనస్ డిగ్రీలో నిలబడటం నాకు ఆ స్థలమహత్యమన్పించింది. చాంగ్లాపాస్ దగ్గర పడుతుంటే తాషి ఆక్సిజన్ పెట్టాలా అని అడిగాడు. మేం వద్దన్నాం. నేను యెగాలో నేర్చుకున్న 'శీతలి ప్రాణాయామం' ద్వారా ధారాళంగా ఆక్సిజన్ లోపలకు పంపించగలిగాను. తనకు కూడా నేర్పాను. దీనివల్ల మాకు ఆక్సిజన్ లేమి సమస్య ఎక్కువగా ఎదురుకాలేదు. చాంగ్లా చేరగానే ప్రతి ఒక్కరికి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది కాబట్టి అక్కడ ఒక మిలటరీ కేంప్ పెట్టారు. ఫస్ట్ ఎయిడ్, టాయిలెట్ లాంటి సౌకర్యాలున్నాయి. మేం గడగడలాడుతూ కేంప్‌లోకి వెళ్ళగానే అక్కడున్న నాయక్ సుబేదార్ విష్ణు బహదూర్ గురండ్ మాకు మిరియాలతో కాచిన వేడి వేడి టీ ఇచ్చారు. ఆ చలిలో కారం కారంగా, వేడిగా గొంతులోంచి జారుతున్న టీ ఎంత తృప్తి నిచ్చిన్దో మాటల్లో చెప్పలేను. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి మేం ముందుకు సాగాం. ఆ కొండల్లో చిన్న చిన్న గ్రామాలు చూసాం. గుర్రాలతో పొలం దున్నుతున్న రైతుల్ని చూసాం. పసిమినా గొఱ్రెల్ని మేపుతున్న కాపరుల్ని చూసాం. చకాచకా పరుగులు తీసే మర్మాడ్ ( కొండ ఉడతలు) లు, యాక్స్, కొండ మేకలు, రకరకాల పక్షులు కన్పించాయి.మరో అరగంటలో మేం పాన్‌గాంగ్ సరస్సు తీరాన వున్నాం. అద్భుతం. అపురూపం. విభిన్నరంగుల్లో మిల మిల మెరిసే 130 కిలోమీటర్ల పొడవైన ఉప్పునీటి సహజ సరస్సు దర్శనం ఇచ్చింది. ఇండియాలో నలబై, చైనాలో 90 కిలోమీటర్ల పొడవునా పాన్ గాంగ్ సరస్సు విస్తరించి వుంది. నాలుగు కిలోమీటర్ల అడ్డం వుంటుంది. అన్నింటినీ మించి 14,000 అడుగుల ఎత్తుమీద ఆవిర్భవించిన అద్భుత ప్రకృతి దృశ్య కావ్యం ఈ సరస్సు. క్షణం క్షణం రంగులు మారుతోంది. నీలం, ఆకుపచ్చ. సరస్సు తీరాన చిత్తరువులమై వినమ్రంగా అలా నిలబడిపోయామ్. మనస సరోవరం చూడాలన్న గాఢమైన కోరికను ఈ సరస్సు ఛిద్రం చేసేసింది. పాన్‌గాంగ్ సరస్సు కెరటాలు మా గుండెల్లోనే ఉప్పొంగుతుండగా మేం తిరుగు ప్రయణానికి అయిష్టంగానే సిద్ధమయ్యామ్. ఆ ... అన్నట్టు ఇక్కడ మిలటరీ కేంప్‌లో మాకు చక్కటి ఆతిథ్యమిచ్చిన వాళ్ళు మన తెలుగువాళ్ళేనండి. మేం ఇద్దరం తప్ప మూడో మనిషి నోటివెంట ఈ పదిరోజులుగా తెలుగుమాట వినని మేం ముగ్గురు తెలుగువాళ్ళని చూసి బోలెడు సంతోషపడ్డాం. వాళ్ళూ చాలా సంతోషించారు. నాయక్ షేక్ మహబూబ్ పాషా గిద్దలూరుకు, లాన్స్ నాయక్ రామానుజం చిత్తూరుకు, సిపాయి నాగేశ్వరరావు శ్రీకాకుళానికి చెందినవాళ్ళట. సంవత్సరం నుంచి ఇక్కడే వున్నారట. మా దగ్గరున్న చాక్‌లెట్‌లు, బిస్కట్‌లు, మెడిసిన్స్ అన్నీ వాళ్ళకిచ్చేసాం. వాళ్ళిచ్చిన వేడి వేడి టీ తాగి తిరుగు ప్రయాణమయ్యం.
అప్పటికి మంచుకొండల మీద ఎండకాస్తోంది. అయితే మేం చాంగ్లా పాస్ దగ్గరికి వచ్చేటప్పటికి హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల్తో మంచు కురవడం మొదలైంది. మేం అదిరిపోయా. ఆ అదురులోనే మంచుకురవడాన్ని చూస్తున్నందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయిపోయా. కొన్ని క్షణాల్లో మా కారు ముందు అద్దం మంచుతో నిండిపోయింది. వైపర్స్ కదలనని మొండికేసాయి. తాషి కిందికి దిగి అతి కష్టం మీద కొంత మంచును తొలగించి వైపర్స్ ఆన్ చేసాడు. మెల్లగా కారును నడపడం మొదలెట్టాడు. ఏకధాటిగా కురుస్తున్న మంచును చూస్తూ సర్వం మర్చిపోయా. ఆక్సిజన్ విషయం అసలు గుర్తే రాలేదు. లోపలంతా ఓ ఉద్విగ్నత నిండిపోయింది. చాంగ్లాపాస్ ఎక్కి దిగిపోగానే వాతావరణం మళ్ళీ ఎండతో నిండిపోయింది. లేహ్ పట్టణంలోకి అడుగుపెట్టేముందు సిన్ధు నదిని చూసాం. నీళ్ళల్లో దిగి ఆ చల్లటి నీటి స్పర్శని అనుభవించాం. ఇటీవలే అక్కడ సింధు దర్శనం పేరుతో ఓ ఉత్సవాన్ని ఎల్.కె. అద్వానీ ప్రారంభించినట్లు శిలాఫలకం మీద చదివినప్పుడు బౌద్ధమతస్తులు అదికంగా వున్న లేహ్ , లదాఖ్ లకు ' హిందూత్వ'ను దిగుమతి చేయడానికి అద్వాని ప్రయత్నాలు మొదలుపెట్టాడు కాబోలు అనుకున్నాను.
అపూర్వ అద్భుత అనుభవాలను మూటగట్టుకుని మర్నాడు ఉదయం మేం తిరుగు ప్రయణమయ్యామ్. క్షణక్షణం మారే లేహ్ వాతావరణం మా విమానాన్ని ఆరుగంటలు ఆలస్యం చేసింది. ఇసుకతో కూడిన ఈదురుగాలులు, మబ్బులతో నిండిపోయే పర్వత సానువులు, దూరాన కొండల మీద వర్షం, ఎయిర్ పోర్ట్‌లో ఎండ ఇలా ఎన్నో వాతావరణ విన్యాసాల మధ్య మా వివనం గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఢిల్లీ చేర్చింది.
పది రోజులపాటు కాశ్మీర్ అందాల్ని గుండెల్లో వొంపుకుంటూ పరవశించిపోయినా నాలోపలెక్కడో ఓ ముల్లు గుచ్చుకుంటూనే వుంది. ప్రతి కాశ్మీరీ ముఖంలో ' ఏదో పోగొట్టుకొన్నామన్న భావన' గుండెల్ని మెలిపెడుతనే వుంది. శ్రీనగర్ సందుగొందుల్లో పేలుతున్న గ్రెనేడ్‌లు, భద్రతా దాళాల మోహరింపులు, పనుల్లేక ఉద్యోగాల్లేక గుంపులు గుంపులుగా రోడ్ల మీద తారసపడే కాశ్మీరీ ముస్లిమ్ యువకుల నిరాశామయమైన చూపులు ఇంకా నన్ను వెంటాడుతూనే వున్నాయి. అందమైన కాశ్మీర్‌లోయలో అందవిహీనం చేయబడిన కాశ్మీరీ జీవితం, అభద్రత, అన్యాయం మధ్య కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలను మర్చిపోవడం చాలాకష్టం. గత పదిహేను సంవత్సరాలుగా బారత భద్రతా దళాల తుపాకులకు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల బాంబు దాడులకు బలైపోయిన 80,000 వేల మంది మరణాలకు ఎవరి జవాబుదారీ లేదు. మూడు వేలమంది యువకులు లోయనుండి అదృశ్యమైపోయారని వాళ్ళేమయ్యరో ఎవరికీ తెలియదని మా పి.ఎస్.వో అన్నాడు. 8000 మంది స్త్రీలు భర్తలను పోగొట్టుకున్నారని, మరెందరో స్త్రీలు భర్తలు బతికి వున్నారో లేదో తెలియని భయంకర స్థితిలో సంగం విధవలుగా మారారని ఒక చోట చదివాను. 20 వేల మంది పిల్లలు అనాధాశ్రమంలో మగ్గుతున్నారని విన్పపుడు కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లయింది. ఒక పోలీసు ఉన్నతాధికారి పొరపాటుగా ఒక కుటుంబాన్ని టెర్రరిస్టులుగా భ్రమించి కాల్చి చంపి, చావకుండా మిగిలిపోయిన అల్‌తాఫ్ అనే కుర్రాడిని, భార్య ప్రోద్భలం మీద దత్తత చేసుకుని పెంచుతున్నాడని విన్నప్పుడు నా వొళ్ళంతా కంపించిపోయింది. తల్లిదండ్రుల్ని చంపినవాడే తన ప్రస్తుత తండ్రి అని ఆల్‌తాఫ్‌కి బహుశా తెలిసి వుండదు. కాశ్మీరులో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఉదంతాలు సరిపోతాయనుకుంటాను. ఉత్తుంగ పర్వతాలు, మహావృక్షాలు, సరస్సులు, లోయల సోయగాలు ఒకవైపు, కర్కశ భద్రతా దళాల ఇనపబూట్ల చప్పుళ్ళు, పొగలు కక్కే ఎ.కె. 47లు, ఉగ్రవాదుల గ్రేనేడ్ పేలుళ్ళు, నెత్తురోడుతున్న శరీరభాగాలు ఇదీ నేటి కాశ్మీర్. వెన్నెల్ని, కటిక చీకటి అమావాస్యని ఒకేసారి అనుభవిస్తూ మేం హైదరాబాదులో అడుగుపెట్టాం.
Saturday, September 20, 2008
ఒంటరి దీవులు
జీవితం పూడ్చలేని ఓ అగాధంలా మారుతోంది
దేనితో పూడ్చాలి ఈ అగాధాన్ని?
జనం ఇరుకిరుకు గూళ్ళల్లోంచి బయటపడి
రోడ్ల మీద చీమల్లా పాకుతున్నారు
నోళ్ళు తెరుచుకుని నిలబడ్డ మహా మాల్స్
ఈ జనాన్ని అమాంతంగా మింగేస్తున్నాయ్
వందలాది వెర్రి మొర్రి చానల్స్
కంటి రెటీనా మీద కబ్జా చేస్తున్నయ్
ఇంటెర్నెట్ మహా మాయ
నరనరాల మీద నాట్యం చేస్తోంది
మొబైల్ ఫోన్ల మహ ప్రవాహం
చెవుల్లోంచి గుండెల్లోకి జారి
అయిస్ లా గడ్డకడుతోంది
"ఎవరికి వారౌ స్వార్హంలో
హ్రుదయాలరుదౌ లోకంలో"
నా కారు,నా చానెల్, నా మొబైల్, నా ఎఫ్.ఎం,
నా ఏ టి ఎం,నా ఇంటెర్నెట్, నా బాంక్ బాలెన్స్
ఇలా "నా"చుట్టూ గిరికీలు కొడుతున్నాం
మనం స్రుష్టించిన అద్భుత టెక్నాలజీ
మనల్నెంత ఒంటరుల్ని చేస్తోంది
"మన" ని "మనిషి" ని మర్చిపోయి
ఎవరికి వారం ఒంటరి దీవులమౌతున్నాం
తోటి మనిషి మాత్రమే పూడ్చగలిగిన
ఈ అగాధాలను
మార్కెట్లను ముంచెత్త్తుతున్న
మహా మాల్స్ లోని మహా చెత్త పూరిస్తుందా
మరింత అగాదగాన్ని స్రుష్టిస్తుంది తప్ప
మానవీయతని ప్రోదిచేస్తుందా
మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుందా చెప్పండి.
Subscribe to:
Posts (Atom)
తర్పణాలు త్రిశంకు స్వర్గాలు
తర్పణాలు, త్రిశంకు స్వర్గాలు ............ మా సీతారాంపురం లో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నా...
-
అక్టోబరు 20 యావత్ భారతదేశంలోని మహిళల్ని గాయపర్చిన దినం. కించపరిచిన, అవమానపరిచిన దినంగా ఈ కంఠంలో ప్రాణం వున్నంతకాలం గుర్తుండిపోతుంది. ఎవరో ...
-
ప్రపంచాన్ని స్త్రీల దృష్టి కోణం నుంచి చూడమంటాను పురుషులు లేని ప్రపంచాన్ని నేను కోరడం లేదు ఆడపిల్లలు అన్నింటిని ఆఖరికి ప్రాణాన్ని సైతం కోల్...