ఆ తరువాత మేం ఆ పక్కనే ఉన్న దిబ్బపాలెం గ్రామం వెళ్ళేం.
భూకంపమొచ్చి కుప్పకూలిపోయాయా?శత్రురాజుల దాడిలో కూల్చేయబడ్డాయా అన్నంత హ్రుదయవిదారకంగా ఉన్నాయక్కడ కూలిన ఇళ్ళ ద్రుశ్యాలు.కడుపులో చెయ్యిపెట్టి దేవినట్టయ్యింది. ఎవరి ఇళ్ళను వాళ్ళే కూల్చేసుకుంటున్న దారుణ ద్రుశ్యాలు.ఇళ్ళు,బళ్ళు, కమ్యూనిటి హాళ్ళు ఒకటేమిటి-దిబ్బపాలెంలో అన్నీ మట్టి దిబ్బలే.ఇటుకల పోగులే.ఒంటరిగా దిగులుగానిలబడ్డ పెరళ్ళ ముందు
ప్రేమగా పెంచుకున్న మొక్కలు."వీళ్ళంతా ఎక్కడికెళ్ళారు?" అన్న ప్రశ్నకు గూళ్ళు కూలిపోయాయిగా.చెట్టుకొకరు.పుట్ట కొకరుగా చెదిరిపోయారు.ఎవరెక్కడికెళ్ళేరో ఎవరికి తెలుసు?తమ సొంత గ్రామం.సొంత పరిసరాలు.సొంత మనుషులు.ఆ గ్రామంతో పెనవేసుకున్న అనుభవాలు.గుండె దిటవునిచ్చే సామూహిక నివాస ప్రాంతం.ఏది?ఏమైంది?ఏకాకులై ఏకాంత వాసాలకి తరలిపోయిన ఆ ప్రజల జీవన శిధిలాల్లా దిబ్బపాలెంలో కూలిన ఇళ్ళ దిబ్బలు.కార్పోరేట్ కసాయితనానికి నిదర్శనంలా కనబడుతున్న సముద్రం చుట్టూ వెలుస్తున్న వైర్ల ఫెన్సింగ్.నిర్వాసితులైన ప్రజలకి ఫోటోలు తీస్తూ,వారిపై అవాకులు,చెవాకులు పేలిన ప్రభుత్వ ప్రత్యేక అధికారిబండతనం,లేకితనం.ఉన్న ఇంటిని కూల్చేసి,వలస పొమ్మనడంలోని దుక్ఖాన్ని,గుండె కోతని లేశమంతయినా ఊహించలేని ఆ అధికారితో మా తీవ్ర వాగ్వివాదం."అభివ్రుద్ధి" విశ్వరూపాన్ని, ప్రభుత్వ దారుణ, ,నిర్లక్ష్య వైఖరిని అద్దంలో చూసిన సందర్భమది.
మిగిలింది రేపు.
No comments:
Post a Comment