ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.

ఈ రోజు ఉదయం నేనో అద్భుతమైన ద్రుశ్యం చూసాను.


కర్నూల్ వచ్చా నిన్న రాత్రి.ఉదయాన్నే వాకింగ్ చేద్దామని జాతీయ రహదారి(హైదరాబాద్ చిత్తూర్ పోయే దారి)మీదకి వచ్చాను.రాత్రి కురిసిన వానకి తోడు పొగమంచు జోడై దారంతా చిత్తడి చిత్తడిగా ఉంది.రోడ్డుకి అటు ఇటు పచ్చటి తివాచీ పరిచినట్టు ,దట్టంగా పొగమంచు ఆవరించిన సెనగచేలు,గుత్తులు గుత్తులుగా కంకులేసిన జొన్న చేలు,మరోపక్క పసుపారబోసినట్టు విచ్చుకున్న పొద్దు తిరుగుడు పూలతో కళకళలాడుతున్న పొద్దుతిరుగుడు చేలు. ఆ చల్లటి వేళ ప్రక్రుతి ఎంత రమణీయంగా ఉందో నేను రాయడం కాదు చూసితీరాల్సిందే.

మెలమెల్లగా తూరుపు ఎర్రబారుతోంది.భానుడి తొలికిరణాల స్పర్శని అనుభవిస్తూ ఎందుకో అలవోకగా పశ్చిమానికి తిరిగానా నా నోట్లోంచి వావ్ అంటూ ఓ కేక దూసుకొచ్చింది.

వానజల్లు లేకుండా విచ్చుకున్న రంగురంగుల ఇంధ్రధనుస్సు.ఓ క్షణం నా కళ్ళని నేను నమ్మలేకపోయాను.పొగమంచు కురుస్తోంది కాని వర్షం లేదే.సూర్య కిరణాలు మంచు మీద ఏటవాలుగా పడితే కూడా రెయిన్ బో వస్తుందా?(ఆ తర్వాత తెలిసింది ఆ టైం లో టౌన్ లో వాన పడిందని)

పచ్చదనం ,ఇంధ్రధనుస్సు నాతో చెట్టాపట్టలేసుకుంటూ నాతో నడిచాయంటే నమ్ముతారా మీరు?

ఒక్కదానివీ జాతీయ రహదారి మీదకి వాకింగ్ కి వెళతావా జాగ్రత్త అంటూ నా సహచరుడు హెచ్చరించాడు కానీ నేను ఒంటరిగా నడిచిందెక్కడ?పచ్చదనం,తొలికిరణాల వెచ్చదనం,ఏడురంగుల హరివిల్లు,ఉదయపు హాయైన ప్రశాంతత ఇవ్వన్ని నాతో ఉంటే నేను ఒంటరిగా నడవడమేంటి?

నిజానికి ప్రక్రుతిని మించిన తోడు వేరే ఏముంటుంది?

Comments

sujji said…
mee narration chala baagundi .!!
అవును. జీవిత చరమాంకం వరకు మనకు తోడుండి తనలో కలిపెసుకోనేది ప్రక్రుతి మాత్రమె.
లలిత said…
అది............ఇదేనా................
అద్భుతం
ఖచ్చితంగా పదేళ్ల కిందట, అదే కర్నూలులో - అచ్చు ఇదే సన్నివేశంలో బైకు మీద అమ్మాయితో నేను.....కట్ చేస్తే...కలనయంత్రం ముందు టిక్కుటక్కుమంటూ నేను, నేపథ్య సంగీతంలో ఆ బైకు-అమ్మాయి గురక:-(
Thanks for reminding/rewinding those memories:-)